పేజీలు

సర్వమంగళ

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధి సాధికే శరన్యే త్రయంబకే దేవి నారాయని నమోస్తుతే .
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశ్యశాలినీ । దేశోఽయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ॥

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

01 నవంబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23


పరమాత్మా వైపా! ప్రపంచము వైపా !

కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయము అర్థించడానికి ఇరువురు వస్తారు, ఆ ఇరువురు తనకు కావలసిన వారే బంధువులే కనుక ఇరువురికి సహాయముచేస్తానని మాట ఇస్తాడు, అయితే పరమాత్మా ఒక ప్రతిపాదన చేస్తాడు,   ఇక్కడ పరమాత్మా తన నుంచి సహాయాన్ని అర్థించిన ఇరువురికి లభించేట్టుగా తన సహాయాన్ని రెండు రకాలుగా విభజించాడు. మొదటిది తన యొక్క సమస్త సైన్యము ఒక వైపు , {ఒక భాగము }, రెండవది తాను ఒక్కడు ఒక వైపు అయితే తనను కోరుకునే వారికీ ఒక షరతు పెట్టాడు, యుద్దములో తాను యుద్ధము చేయను, అస్త్రము పట్టను ఇది షరతు! దీని ప్రకారము నీకు ఏది కావాలో నిశ్చయించుకో మని ఇరువురి ముందు ఈ ప్రతి పాదన చేసి ముందుగా సహాయాన్ని అడిగే అవకాశము కూడా అర్జునుడికి ఇచ్చినాడు. ఎందుకంటే ఆ సందర్బములో పరమాత్మా ముఖ్యముగా అర్జునుడిని పరీక్షించాలి అన్న భావముతో, అర్జునుడి మనోదృక్పథము తెలుసుకొనుటకు. ఈ అవకాశమే అర్జునుడికి అసలయిన పరీక్ష, (అర్జునుడి యొక్క పారమార్థిక దృష్టిని ప్రపంచానికి తెలియజేయటము కొరకు. ) అర్జునుడు తనను కోరుకుంటాడు లేదా తన యొక్క అపారమయిన సైన్యాన్ని కోరుకుంటాడ ! కానీ అతను అర్జునుడు కనుక శ్రీ కృష్ణుడునే కోరుకున్నాడు కృష్ణుని అపార మయిన సైన్యముతో తనకు అవసరము లేదని అంటాడు. దుర్యోధనుడు ( భౌతిక దృష్టి ) తనకు అపారమయిన శ్రీకృష్ణుని సైన్యము లబించినందుకు ఎంతో సంతోషించాడు. 

ఈ సమస్త జగత్తు అంతయు పరమాత్ముని సైన్యము, వస్తువిషయాదులన్నీ కూడా పరమాత్మా యొక్క సైన్యమే అయితే అవి నశ్వరమైనవి, అశాశ్వత మైనవి, పరమాత్మా మాత్రమే సత్యము, శాశ్వతడు, సత్యస్వరూపుడు, నిత్యానందస్వరూపుడు, శాశ్వతమైన పరమాత్మాను పొందాలనుకొంటే ప్రపంచము నుండి అంటే ప్రపంచ వస్తు విషయాదుల పట్ల విముఖుడై పరమాత్మా యొక్క స్మరణలో ఉండాలి. 

(........ఇంకావుంది)







29 అక్టోబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 22

అపరిగ్రహము - అస్తేయం   


'అపరిగ్రహం'అంటే ఇతరుల వస్తువులు గ్రహించ కుండా వుండటము నాయొక్క భావనలో అది కేవలము వస్తువులతోనే కాదు ఇతరుల నుండి విషయ గ్రహణము కూడా చేయకూడదు, అంటే ఇతరుల భావనలు, అవి అరిషట్ వర్గాలతో కూడుకొని ఉంటాయి కనుక వాటిని కూడా సాధకుడు గ్రహించకూడదు. వారి యొక్క భావాలు మనపట్ల మంచి భావన, మంచి అభిప్రాయము కావచ్చు లేదా ఈర్ష్య ద్వేషాదులతో కూడుకున్నవి కావచ్చు అయితే అవి కేవలము వారు మన పట్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాలు కావచ్చు, మనలను ఆవిధముగా అర్థము చేసుకోవడము కావచ్చు, వాటిని సాధకుడు తన మనసులో చేరనిస్తే, వాటినుంచి సాధకుడి మనసులో భావ పరంపర పెరిగి పోయి తన యందు కూడా రాగఃద్వేషాదుల అల్లికలు కలుపు మొక్కల లాగా పెరిగి పోయి సార వంతమయిన జ్ఞాన ప్రకాశన్నీ ప్రకాశ హీనము చేస్తాయి. రైతు తన యొక్క పొలములో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు పీకి పారేసి మరల వాటిని పెరగనీయకుండా జాగ్రత్త పడితే అతనికి లభించే పంట అద్భుత ఫలాలను ఇస్తుంది. పండిన పంటను కూడా చీడ పురుగులు పట్టకుండా రైతు ఎప్పుడు అప్రమత్తుడై ఉంటాడో సాధకుడు కూడా ఈ విధమైన సాధనను కొనసాగించాలి. అందుకు సాధకుడికి చెప్పబడిన యమ నియమాదులు పాటించడము వలన శుద్ధ అంతఃకరణం ఏర్పడి దివ్య ఫలాలను పొందగలడు.

కేవలము వస్తువులే కాక ఎప్పుడయితే సాధకుడు ఇతరుల భావజాలమును స్వీకరిస్తాడో అంటే ఆయా విషయాదులందు మనస్సున స్వీకరించినట్లే, వాటితో మనస్సున అనేక భావజాలోత్పతికి కారకుడు అవుతున్నాడు, తన పట్ల విమర్శ కావచ్చు, పొగడ్త కావచ్చు ఆరెండు కూడా ఎవరు అయితే వ్యక్తము చేస్తారో అవి కేవలము వారివే వారి యొక్క మనో భావజాలములే ఆయా మనోభావాలు వారివి మాత్రమే, అవి తన పట్ల అయినప్పటికీ కేవలము అవి వారి యొక్క మనోభావాలుగా పరిగణించి ఆ ఉద్దేశ్యాలను వారికె వదిలి వేయాలి కానీ వారి భావాల పట్ల సాధకుడు తన యందు భావోత్పతి చేసుకోకూడదు, అందువల్ల సాధకుడి మనసు యందు అనేక విషయ పరంపరలకు అవకాశము ఇట్చినట్లే, ఆలా చేసుకొంటే తనవి కానీ భావ జలాన్ని తాను స్వీకరించి నట్లే. తనది కాని విషయము అవుతుంది. తనది కాని వస్తువును తనది గా ప్రతి పాదించడమే అవుతుంది. ఇది అపరిగ్రహము-అస్తేయము  అని అనిపించుకుంటుంది. ప్రాపంచికుల మనోభావాలు తన పట్ల కానీ వేరే ఇతర ప్రాపంచిక వ్యవహారములు యందు  ఎలా ఉన్నప్పటికీ వాటితో సంగత్వము, భాగస్వామ్యము చేసుకోకుండా తనవి గా చేసుకోకుండా, తనవి గా క్లెయిమ్ చేయకుండా ప్రమాద కార విషయములుగా, అక్కరకు రాని విషయములు గా పరిగణించి వాటిని వదిలి వేయడమే సాధకుడికి పరమ శ్రేయస్కరము. ఇతరుల మనో భావ వికారాలు, కక్కు ( వాంతికి )  వంటివిగా, అసహ్యమయినవిగా భావించి వాటికీ అంటే ఆయా భావాలకు దూరముగా వుండటము సాధకుడి యొక్క ప్రధాన ఆవశ్యకమైన గుణముగా ఉండాలి.  ఐతే ఇక్కడ గమనించ వలసినది ఏమంటే అవతలి వారు మన పట్ల విద్వేష పూరితమైన భావాలతో మన యొక్క మనుగడకు గాని దన, మాన, ప్రాణాలకు  నష్టము కలిగించే విధముగా ఉంటే మాత్రము ఏమాత్రము సాధకుడు ఆయా విషయముల యందు అశ్రద్ధ చేయకూడదు. ఈ విషయాన్ని మహాభారతము తెలియచేస్తున్నది. 

 

పాండవులు కౌరవుల పట్ల ఎంతో స్నేహశీలతను, బందు ప్రీతితో వ్యవహరిస్తున్నప్పటికీ కౌరవులు మాత్రము పాండవుల యొక్క ప్రతి చర్యను, దురభిప్రాయముతో, ద్వేష పూరితమయిన భావనలతో పాండవుల ప్రతి చర్యను వారి పట్ల జరిగిన అవమానంగా  చూస్తు పాండవుల యొక్క దన మాన ప్రాణాలను హరించాలనే భావనలతో వారిని అనేక విధాలుగా వెంటాడారు, మానసికముగా హింసిస్తూ వారి, నైతికంగా కృంగేలా సందర్భము వచ్చిన ప్రతి సారి అడుగు అడుగున వారిని  వేధించడమే కాకుండా, ఉద్దేశ్య పూర్వకంగా వారిని అనేక సందర్భాలను కల్పిస్తూ వారిని వివశులను చేసి వారి ని అనేక విధాలుగా పతనము చేయాలనీ దుష్ట పన్నాగాలు ఎన్నో పన్నినారు. 

వారి విద్వేష పూరితమయిన చర్యలు పదునాలుగు సంవత్సరాల అరణ్య వాసములో కూడా కొనసాగినాయి. కాబట్టి సాధకులు తాము ఎంత తమ వరకు తాము ఉన్నప్పటికీ తమను ఎవరి దౌర్భల్యాలు వెంటాడుతున్నాయి తెలియదు కాబట్టి నిరంతర అప్రమత్త కూడా అవసరమే. సాధకుడికి ఎవరి పట్ల శత్రు భావము లేనప్పటికీ తన పట్ల ఇతరుల మనస్సులు ఏవిధమయిన దుర్బలత్వముతో తో కూడుకున్నవో తెలియదు అతి సహనము, అతిగా ఓర్పు కూడా ప్రమాద కారి కావచ్చు, కనుకనే శ్రీకృష్ణ పరమాత్మా దుర్మార్గాన్ని అతిగా సహించడము కూడా వాటిని ప్రోత్సహించడమే, వారిలో నీవు ఏమిచేసినా వారి మనస్సులు రాగద్వేషాదులనుండి విడివడవు, వారిని ఉపేక్షించడము వలన వారిని చూసి వారి లాంటి దుర్మార్గులు ఎందరో తయారు అవుతారు కాబట్టి వారిని అరికట్టడము అనివార్యము అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునిడికి హితవు చెప్పాడు. కాబట్టి సాధకుడు ఇతరుల విద్వేషం నుంచి కూడా అప్రమత్తుడు అయి చీడ పురుగులనుంచి పంటను కాపాడు కుంటున్నట్లుగా సాధకుడు తనను తాను కాపాడుకోవాలి. 

{ సాధకుడు తన నుండి ఇతరుల నుండి వెలువడే విద్వేష పూరిత భావజాలము నుండి తన యొక్క మనస్సును, తన యొక్క చిత్తమును సదా కాపాడుకొంటూ నిత్యము జాగరూకతో ఉండాలి }

.........ఇంకావుంది. 



28 అక్టోబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 21

  

జీవుడు - సాధకుడు - సిద్ధుడు 
క్షేత్రము - స్థానము 

జీవ భ్రాంతి తొలగి స్వస్వరూప దర్శనము ఆత్మ దర్శనమైన యోగి జీవన్ముక్తుడు,  స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతుడు అవుతున్నాడు, అతను సర్వే సర్వత్రా అంతటా ఆ పరబ్రహ్మను మాత్రమే దర్శిస్తున్నవాడు, మాయ తొలగినవాడు, ద్వంద్వము లేనివాడు, అంతటా ఆనందస్వరూపుడయినా ఆ పరబ్రహ్మను చూడగలుగుతున్నవాడు అవుతున్నాడు. ఎలాగంటే భూమి మీద వుండే సమస్త జీవులకు భూ భ్రమణము వల్ల ప్రకృతిలో ఏర్పడే రాత్రి పగలు, ఋతువులు జీవులకు అనుభూతిలో కలవు, జనన మరణ  అదే విధముగా సూర్యుని స్థానములో నిలబడి  చూస్తే రాత్రి పగలు { చీకటి వెలుగులు } ఋతువులు ఇత్యాదులు వుండవు.  అతనికి అంతటా కేవలం అఖండమయిన ప్రకాశము మాత్రమే గోచరిస్తుంది.  అదేవిధముగా ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి  ఆత్మక్షేత్రము నుండి అంతటా ఆత్మ స్వరూపముగానే దర్శిస్తాడు. ఈ జగత్తు యందు జగత్తుకు ఆధారముగా వున్న, అంతటా నిండి నిబిడీకృతమయిన దివ్య ఆనందస్వరూపుడయినా ఆ పరబ్రహ్మ, పరమాత్మనే దర్శిస్తుంటాడు, ఇతనినే జీవన్ముక్తుడు అంటారు.  అతనికి జగత్తు యందు జగత్తును కాంచాడు, జగత్తుకు ఆధారమయిన శుద్ధ చైతన్యాన్ని దర్శిస్తాడు.  ఆత్మ దర్శనము పొందిన యోగి వ్యవహారికముగా కనిపిస్తున్నప్పటికీ అతను ఎల్లపుడు ఆత్మస్థానములోనే ఉంటాడు. అంతటా ఆనంద స్వరూపమయిన ఆత్మనే దర్శిస్తాడు. 

{ భూ క్షేత్రము నందు జీవుడు కాలము , రాత్రి పగలు, ఋతువులు ప్రకృతిని అనుభూతి చెందుతాడు, సూర్యని నందు నిలబడి చూస్తే కాలానికి అతీతమయిన స్థితి, అఖండమయిన ప్రకాశము, ఆవిధముగానే ఆత్మ యందు స్థితిని పొందినవాడు  భౌతిక దృష్టి నశించి జనన మరణ సంసార బంధాలకు అతీతుత మైన స్థితిని పొందుతున్నాడు. }

.....ఇంకావుంది. 

27 అక్టోబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం 20

వ్యష్టి - సమిష్టి

ఒక అవగాహన 

 సూర్యని నుండి సూర్య  రష్మిని  ఆయా యంత్ర పరికరములు  { సోలార్ యంత్ర పరికరములు } గ్రహించి వాటియొక్క సామర్థ్యము ననుసరించి, వాటిలో పొందపరుచబడిన ఉపయోగ విశిష్టతతో వాటి యొక్క వైవిధ్యమయిన శక్తి తో పనిచేయునో అదే విధముగా చైతన్య స్వరూపుడయిన ఆ పరబ్రహ్మ నుండి జీవులు శక్తిని, చైతన్యమును  పొందుతూ ఆయా జీవి యొక్క భౌతిక శరీర, మానసిక, ప్రజ్ఞననుసరించి, వివేకముతో వారి సామర్థ్యముననుసరించి వ్యవహరిస్తున్నారు. 

క్రిమి కీటకాదుల యందు, పశు పక్షాదుల యందు, దేవ, దానవల యందు, మానవల యందు , యక్ష, కిన్నర కింపురుషులు ఇత్యాదులందు ప్రకాశిస్తున్నది కూడా ఆ బ్రహ్మ యొక్క చైతన్యమే విలక్షణమయిన పరస్పర వైరుధ్యమైన ఆయా ఉపాధులయందు గల సామర్థ్యము ననుసరించి వారి/వాటి యొక్క వ్యవహారము కలదు.   

జగత్తు పట్ల సమిష్టి యొక్క భవనాలే వ్యష్టిలో గోచరము అవుతున్నది. స్ఫురిస్తున్నది.  వ్యష్టి బౌతికంగా అంతరిస్తున్నప్పటికీ, వ్యష్టిలో జగత్తు లేకుండా పోయినప్పటికీ,  సమిష్టి యొక్క భావనలో జగత్తు యొక్క భావన  ఉన్నందున  అన్య ఉపాధులకు  జగత్తు భాసిస్తూనే వున్నది .  సమస్త జగత్తు యథార్థముగా వున్నట్లుగా  భాసిస్తున్నది . 

సమిష్టి లో జగత్తు యొక్క దృడ భావన వున్నదందున వ్యష్టిలో ఆ భావనే స్ఫురిస్తున్నది. అయితే వ్యష్టి ఈ జగత్తును తన కన్నా భిన్నముగా దర్శిస్తున్నాడు, అనుభూతి చెందుతున్నాడు. వ్యవహరిస్తున్నాడు. తనకు మూలము అసమిష్టి యే తనలో భాసిస్తున్న జగత్తు భావన అంతయూ ఆ బ్రహ్మదే అని గ్రహించలేక వున్నాడు. జగత్తుకు గల లేదా పదార్థానికి గల భౌతిక పరిదులు, నియతులు, వృద్ధి క్షయములు తనకు ఆపాదించుకొని  లోకమునందు వ్యవహరిస్తున్నాడ, దుఃఖిస్తున్నాడు .  

.....ఇంకావుంది. 


25 అక్టోబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 19

 విజయ దశమి శుభాకాంక్షలతో.......


తన శరీరము పట్ల వ్యామోహాన్ని, మహా మొహాన్ని కలిగిన వారై , ఇంద్రియ లోలులై, వర గర్వితులై  త్రిగుణాలతోను, రాగద్వేషాలతోను, అరిషట్ వర్గాలతోను వ్యవహరిస్తూ, లోక కంఠకులై,  అసుర చేష్టలతో జనులను, సాధువులను, స్త్రీలను పీడిస్తు వున్న రావణ, దుర్గమాసురాది రాక్షసుల ఫై కలిగిని విజయమే విజయదశమి. 

దుర్గమము అంటే కొన్ని పర్యాయ పదాలు కోట, పురము, శరీరము, జయింప శక్యము కానిది, కఠినమయిన త్రోవ, దాట శక్యము కానిది మొదలగునవి  ఆయా సందర్భాలననుసరించి వాడుతుంటారు. ఇక్కడ శరీరము అని తీసుకుంటే, ఈ శరీరము జడము, ఇది జడ ప్రకృతి, ఈ జడ ప్రకృతినే 'మాయా' అంటారు, ఈ మాయ జయింప శక్యము కానిది. జయించుటకు అతి దుర్లభమయినది, అత్యంత కఠినమయినది. జీవుడు తాను ధరించిన శరీరము పట్ల మహా మోహముతో ఉంటాడు. సత్వ రజస్తమోగుణాలతోను, 'రాగద్వేషాలతో', అరిషట్వర్గాలతోను వ్యవహరిస్తుంటాడు. ఈ విధముగా భౌతిక జగత్తుతో తాను నెరపే ప్రతి వ్యవహారమునకు కారణము తన పట్ల తనకు వున్నబంధమే, ఈ మాయయే, ఈ  మోహకారణమే జన్మ పరంపరలకు దారితీస్తున్నది. కనుక ఈ విధమమయిన సంసార చక్రమును జీవుడు దాటుకోవాలంటే తన పట్ల తనకు వున్న ఆ మాయా మోహము నశించాలి, ఆ మోహము నశించటం అత్యంత దుర్లభమయిన, కఠినతరమయినదిగా వున్నది. ఈ మహా మాయ పట్ల, మాయా మోహముపట్ల కలిగిన జయమే విజయ దశమి.   

ఈ కఠినమయిన, దుర్లభమయిన జయింప శక్యము కానిదిగా అగుపిస్తున్న ఈ మాయా మొహాన్ని అత్యంత సులభతరమయిన బోధ, ఆది గురువుగా ఆ పరమేశ్వరుడే సమస్త మానవాళికి అనుగ్రహించాడు.  అనుకుంటా. కాశీ క్షేత్రములో కాశి విశ్వేశ్వరుని, విశ్వనాథుని దర్శించినవారు తమకు అత్యంత ప్రీతి పాత్రమయినది వదిలి వేయమంటారు. అంతే కాదు కాశీ క్షేత్రములో తనువు చాలించిన వారికి ముక్తి లభిస్తుంది అని స్థల పురాణము చెపుతుంది. ఇక్కడ తమకు అత్యంత ప్రీతి పాత్రమయినది వదిలి వేయమంటే, చాల మంది తమకు ఇష్టమయిన పండ్లు, కూరగాయలు, ఇంకా అనేకమయిన పదార్థాలు వదిలి వేస్తుంటారు, ఆలా చేస్తే ఇంద్రియ లోలత్వము నుండి బయట పడే ఒక అద్భుత సాధన అయ్యివుండవచ్చు.  కానీ నా యొక్క భావనలో ఇవన్నీ కాదు, ఇక్కడ కొంత విశ్లేషించుకొంటే  ప్రతి జీవికి అత్యంత ప్రీతి పాత్రమయినది ఏది అంటే తన యొక్క తనువు, తన శరీరమే ఈ జగత్తులో తనకు అత్యంత ప్రీతి పాత్రమవుతుంది. దాని పట్ల అత్యంత వ్యామోహాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ  వదిలివేయడమంటే తాను ఈ శరీరము అన్న భావాన్ని వదిలి వేయడమే. నేను ఈ శరీరము కాదు అన్న శరీర భావాన్ని ఎప్పుడయితే  వదిలివేస్తాడో అప్పుడే అతని అహంభావము తొలగి శుద్దుడు అవుతాడు. అతను సమస్త మానసిక బంధాలు తొలగుతాయి. ఆయా బందాలనుండి విముక్తుడ అవుతాడు. తనువుని ఆధారము చేసుకొని అనేక మానసిక బంధాలు ఏర్పడ్డాయి, అవి లత లాగ జీవుడిని అల్లుకొన్నాయి. బందితుడిని, వాటికీ కట్టు బడేటట్టుగా బద్ధుడను చేశాయి. 

ఇంకా కాశీ క్షేత్రములో మరణించిన వారికి మోక్షము లభిస్తుంది అంటారు, మరణానంతరము.  అయితే ఇక్కడ శరీరము ఉండగానే నేను ఈ శరీరము అన్న శరీర భావనను త్యజిస్తే, మోహము వదిలితే తన పట్ల తనకు వున్న వ్యామోహము పోతుంది.  అప్పుడే సమస్త బందాలనుండి విడివడుతాడు. ఆయా బందాలనుండి ముక్తుడు అవుతాడు. బ్రతికి ఉండగానే జీవన్ ముక్తుడు అవుతాడు.  విజయుడు అవుతాడు. 

విజయ దశమి శుభాకాంక్షలతో...... 


23 అక్టోబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం 18


ఆది భౌతికం, ఆది దైవికమ్, ఆధ్యాత్మికం

 దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్న చందాన !. 

{ భగవంతుడు అనుగ్రహించినప్పటికీ , సద్గురువు అనుగ్రహించినప్పటికీ  వారి వారి మనస్సులే  ఆయా ఫలాలను అందుకోకుండా వారికి అడ్డు పడుతాయి . }

భౌతికముగా జరిగే కష్ట,నష్టములను, ఉపద్రవాలను సాధకుడు దాటుకోవాచ్చు, దైవికముగా జరిగే సంఘటనల నుండి పరమాత్ముని కృప తో, సద్గురువు అనుగ్రహముతో దాటుకోవచ్చు అయితే ఆధ్యాత్మికంగ అంటే తన యెక్క  మనస్సు నుండి జరిగే ఉపద్రవములనుండి ఎవరు కూడా రక్షించలేరు, తన మనస్సును జయిస్తేనే సాధకుడు కానీ భక్తుడు కానీ ఉన్నతిని, అభివృద్ధిని, పరమాత్మ నుండి సద్గురువు నుండి పొందిన అనుగ్రహమును, ఆయువు, ఆరోగ్యము ఐశ్వర్యము లను పొందగలరు. అందుకు ఉదాహరణ అనేకములు వున్నాయి. 

ఉదాహరణకు మహాభారతములోని ఉద్యోగ పర్వము లో జరిగిన సంగటన చెప్పుకోవచ్చు, కౌరవులను ఆది భౌతికమునుండి, ఆది దైవికము నుండి రక్షించే ప్రయత్నము చేశారు కానీ ఆధ్యాత్మికము ( ఆధ్యాత్మికం అంటే ఇక్కడ మనస్సు అని అర్థము వస్తుంది. ) వారి మనస్సులు ( దుర్యోధనాధి కౌరవుల ) ఆయా శాంతి ఫలాలను అనుభవించకుండా చేశాయి. శాంతి దూత గా శ్రీ కృష్ణ పరమాత్మా జరగబోయే యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పాలని ప్రయత్నించాడు. ఒకరకంగా చెప్పాలంటే యుద్దాన్ని నివారించి కౌరవులను దుర్గతినుండి, దుర్మరణముల నుండి కాపాడాలని భగవానుడు ప్రయత్నించాడు, ఆయనే కాదు ఆయా సభలో పాల్గొన్న తపస్విలు, గురువులు, మహాత్ములు అందరు ఈ సంఘటనలనుండి కాపాడాలని ప్రయత్నించారు ఈ ప్రయత్నము దుర్యోధనాధి కౌరవులకు ఒకరకముగా వారికి భౌతికముగా,దైవికముగా జరిగే ఉపద్రవాలనుండి, సంఘటనలనుండి దుర్గతి పాలవకుండ, దుర్మరణము పొందకుండా నిలువరించే ప్రయత్నము చేశారు లేదా ఆవిధముగా అనుగ్రహము వారికి కలిగించారు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయ్నతమంతా సత్పురుషులు, అమాయకులు, ప్రజల ప్రాణనష్ట నివారణకు అయివుండవచ్చు, అతని మనస్సే  పరమాత్మా అనుగ్రహించిన, సద్గురువులు, మహాత్ములు అనుగ్రహించిన అనుగ్రహ ఫలాలను అనుభవించకుండా అడ్డుపడినట్లు అయ్యింది. దుర్యోధనుని దురహంకారము కారణముగా, రాఘ ద్వేషాదుల కారణముగా హృదయ దౌర్బల్యము కలిగి భగవానుని, మహాత్ముల బోధనలను పెడచెవినపెట్టినారు.  మానసికముగా కలిగిన వికారము, వికలత్వము కారణముగా అతని మనస్సే అతనికి శత్రువు అయింది. 

అతని మనస్సు నుండి కలిగే ఉపద్రవాన్ని అతను కనుగొనలేకపోయాడు, భగవానుడు, గురువులు, మహాత్ములు ఎంత బోధించినప్పటికీ, హెచ్చరించినప్పటికీ ఎంత మేలు చేయాలనీ చూసినప్పటికీ అతని మనస్సు కారణముగా అతనిని అతని పరివారాన్ని రక్షించలేక పోయారు.


{ సాధకుడికి, భక్తుడికి మొట్ట మొదట తన యొక్క మనస్సే తనకు ప్రధాన అవరోధం. }

.......ఇంకావుంది 

 

21 అక్టోబర్, 2020

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం 17

సద్గ్రంథ పఠనము 

 రఘు, రాఘవ, రాఘవేంద్ర సంవాదము 

 రఘు :  శ్రీమద్భగవద్గీత, శ్రీమద్రామాయణం, మహాభారతము, అష్టాదశ పురాణాలు, గురుచరిత్ర, సద్గురు చరిత్ర, మహాత్ముల దివ్య చరితలు, ఇతిహాసాలు ఇత్యాది సద్గ్రంథ పరాయణములు భక్తులు, సాధకులు ఎందుకు చేయాలి ?. 

రాఘవ : సాధ్గ్రంధ పఠనము వలన భక్తుడిలో, సాధకుడిలో ఆంతరంగిక పరిపక్వత సిద్దించి, భగవంతుని యొక్క, సత్యము యొక్క నిగూడ రహస్యాలు గ్రహించడానికి తగు విధముగా మానసిక స్థితి భక్తుడిలో సాధకుడిలో  ఏర్పడుతుంది. 

రాఘవేంద్ర  : సధ్గ్రంధములలోని అనేక సత్పురుషుల జీవితాలు, వారు వారి జీవితములో అనుసరించిన విధానాలు , సత్యముకోసం, ధర్మము కోసం  పరమాత్మకోసం, వారు పాటుపడిన రీతి, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, వారు చెందిన అనుభూతులు సాధకుడిలో, భక్తుడి హృదయములో సత్య ధర్మాల పట్ల, పరమాత్మా పట్ల వారి హృదయము ద్రవించి, వారి హృదయ ప్రక్షాళన జరిగి మానసిక బంధములనుండి విడి వడి  వారి మనసులో అనేక ఉత్తమ మయిన మార్పులు కలిగి వారి మనసులు, వారి మస్తిష్కములు అతి సూక్ష్మమయిన, నీగూఢమయిన సత్యాలను గ్రహించగలిగే స్థితులు కలుగుతాయి,  పరమాత్ముని పట్ల విశ్వసనీయత కలుగుతుంది, పరమాత్ముని యొక్క నిగూడ రహస్యాలు  గోచరము అవుతాయి, సత్యత్వము పట్ల పరమాత్ముని పట్ల భక్తి పారవశ్యులు అవుతారు, పాప కర్మలు నశించి, పుణ్యము ప్రాప్తి కలుగుతాయి, పరమాత్మా యొక్క దివ్యానుభూతి కలిగి, స్వ స్వరూప అనుసంధానము జరిగి కాలచక్రమునుండి విడివడుతాడు.  పరమాత్మా ప్రాప్తి , బ్రహ్మానంద సిద్ధి కలుగుతుంది. 

........ఇంకావుంది. 





12 అక్టోబర్, 2019

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం 14

అనంతపురం - అనంతుడు - ఆత్మీయుడు - మహామొహాపురం 

అది అనంతుడు ఉండే పురం కాబట్టి దానిని అనంతపురం అంటారు, ఈ అనంతుడి సామ్రాజ్యము కూడా అనంతమైనదే ఈ అనంత సామ్రాజ్యానికి ఒక స్వయం ప్రతిపత్తి కల ఒక సామంత రాజ్యము ఉంది. ఇది అనేక నియతులతో వర్ధిల్లుతోంది. ఆ సామంత రాజ్యము పేరు మహా మొహ పురం. అనంతుని సామ్రాజ్యము నుండి మహామొహపురాన్ని సుస్పష్టముగా వీక్షించవచ్చు అయితే మహమొహాపురము నుండి ఇది సాధ్యము కాదు. మహా మొహాపురపు నియతి ప్రకారము అక్కడ అడుగు పెట్టినవాడు అక్కడి నియతికి లోబడి అత్యంత సహజముగా చరిస్తాడు, దానిని చూచినంతనే ఆకర్షింపబడుతారు, తాను మహామోహపురానికీ చెందిన వాడిగానే ఉంటాడు.  ఆ మహమొహాపురమే తన సర్వస్వమని అతను అత్యంత బలీయముగా విశ్వసిస్తాడు. అక్కడ అతనికి లభించిన వాటితో, అతను పొందుతున్న వాటితో, ఇంకా అక్కడ అనేక ఆకర్షణలతో కనపడే ప్రతి వస్తు, విషయాలతో మానసిక బంధము ఏర్పరచుకొని వాటి యందు రాగ ద్వేషములు పెంపొందించుకొంటూ, వాటి యందే లగ్నము చెంది ఆ రాజ్యము విడువలేక తిరిగి తిరిగి మరల తాను అదే రాజ్యమునందు సదా సంచరిస్తూ ఎండమావుల లాంటి భౌతిక అస్తిత్వాలతో దాహము తీరక  మహా మొహపు పురము చక్ర బంధములో తిరుగాడుతూనే ఉంటాడు. ఇది అనంతపురము మరియు మహామొహాపురాల పరిచయము. 

ఇక అనంతుడి గురించి అతను అభేద భావన కలిగిన వాడు, ఎప్పుడూ ఆనందముతో నిండుకొని ఉంటాడు, అతనిని చూసినంతనే చూసినవారికి ఆ ఆనందము తొణికిసలాడుతోంది. ఆయనే సర్వ సామ్రాజ్యాధి పతి, ఆయన ఏలుబడిలో ఉండేదే అనంతపురము మరియు దాని సామంత రాజ్యము కూడ, మహామొహాపురము యొక్క మనుగడ, సమస్త పోషణ ఆధారము అంతా ఆ అనంతుడే. 

 ఈ అనంతుడికి ఒక ఆత్మీయుడు ఉన్నాడు, ఆ ఆత్మీయుడుకి ఆ అనంతుడే సర్వస్వము, ఆ అనంతుడు ఇతనికి  హితుడు, సన్నిహితుడు, అనంతుని సాన్నిధ్యము, సామిప్యం, సారూప్యము అతను పొంది వున్నాడు. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఎట్టి భేద భావము లేదు.  వారిద్దరూ నిత్యము జ్ఞాన గంగా లో విహరించేవారు, వారిద్దరికి సమయము  అన్నది లేనిదిగా ఉంది. వారి యొక్క బంధమూ అనంతమయినదే. ఒకసారి అనంతుడి స్నేహితుడు అనుకోకుండా మహమొహాపురము  వైపు దృష్టి సారించాడు అంతే అత్యంత ఆకర్షణ శక్తి గల మహమొహాపురమున తన దైన వస్తువు అక్కడ ఏదో ఉన్నట్టుగా అగుపించినది. అనంతుని ఆత్మీయుడికి. అంతే అనంతుని మాటలు ఏవో హెచ్చరిస్తున్నాయి, కానీ అంతలోపే వారిద్దరికీ దూరము బాగా పెరిగిపోయింది.   ఇక అనంతుని పూర్తిగా మరచిపోయాడు. మహా మొహాపురముతో ఏకీ భవిత్వము చెందినాడు, ఇప్పుడు అతడు తనది కాని దానిని తనదిగా భావించే తత్వాన్ని పొందివున్నాడు, అతత్వము ఇప్పుడు అతనిలో ఒక ప్రధానమయిన కతృత్వాన్ని నిర్వహిస్తుంది, ఇప్పుడు ఆ మహమొహాపు అనుచరుడు అయిన అతత్వము ఇతనికి బానిసన లేదా అనంతుని ఆత్మేయుడు ఆ అనుచరుడికి బానిసను తెలియడం కష్టము, మహమొహాపురపు అనుచరుడు తనతో సారూప్యము చెందినట్లు కూడా అతనికి తెలియకుండా పోయింది.  
ఇక్కడ అతనికి అనేక బంధుత్వాలు ఏర్పడ్డాయి, తల్లి తండ్రులతో, అన్న తమ్ముళ్ళతో, అక్క చెల్లెళ్ళతో, భార్య పిల్లలతో, స్నేహితులతో,, సన్నిహితులతో  అనేక వస్తు విషయాదులతో, మహా మొహాపురములో తనకు లభిస్తున్న కీర్తి ప్రతిష్టలు, ఆస్థి పాస్తుల కొరకు వాటితో మానసికి బంధము ఏర్పరచుకొని అవి లేని తనను ఊహించుకోవడము కూడా అతనికి అసాధ్యము, వాటిలో తన అస్థిత్వము ఉందని గాఢముగా నమ్ముతూ వాటి యందు తిరుగాడుతున్నాడు. ఇక   అతను పూర్తిగా అనంతుని గురించి అతని సహచర్యము గురించి ఏమాత్రము అతని స్మృతి పథములో లేవు. అనంతుని పూర్తిగా విస్మరించాడు. అనంతునితో అతనికి ఉన్న  గాఢమయిన శాశ్వత సంబంధము వుంది అన్న విషయము కూడా అతని మస్తిష్కములో ఉదయిన్చడమే లేదు. 

                                                                                                                       ....... ఇంకావుంది. 

21 అక్టోబర్, 2017

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం 13

యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం

మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్ మ్యాపింగ్ )

సమీక్ష కొనసాగుతున్నది :

ఆ దేశములోని అత్యంత ప్రముఖ ధనవంతులలో ఒకడు అయిన ఒక వ్యక్తి,  తన కుమార్తె వివాహము ఆ దేశములోనే వినూత్నముగా జరిపించాలని అనుకున్నాడు, ఆ వివాహానికి ఆహ్వానించ బడిన వారికి వారు జీవించినంత కాలం గుర్తుండే విధముగా ఒక మంచి అనుభూతి కలగాలని  భావించి ఇంద్రజాలములో ఖ్యాతి గడించిన ఒక ఇంద్రజాలికుడిని సంప్రదించి తన ఆలోచనను అతనికి తెలియజేసాడు, ఆ ఇంద్రజాలికుడి సామర్థ్యము  ఎటువంటిది అంటే ప్రేక్షకులను క్షణాల్లో మంత్ర ముగ్దులను చేయ గలిగే నిపుణత అతనిది, పట్ట పగలు నక్షత్రాలు చూపగలిగే దిట్ట, ఆ ధనవంతుడి అభిష్టము ప్రకారము తన వద్ద ఒక గొప్ప రచన ఉన్నదని అయితె తన యొక్క ప్రదర్శనను సామాన్య వేదిక మీద కాకుండా ఒక ఉద్యానవనములో తాను సూచించిన విధముగా ఉండాలని అందుకు  అనేక ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని, అందుకు తన యొక్క సహచరుల సహాయము తీసుకొమ్మని వివాహానంతరము రోజు ఆహ్వానితులకు ప్రదర్శనను ఉద్యానవనములో ఏర్పాటు చేయవలసి ఉంటుందని ఆహ్వానితులను విడివిడిగా ఉద్యానవనము లోపలికి తీసుక రావలసిందిగా  సూచించాడు. 

ఆ ధనవంతుడు అనుకున్నట్లుగానే ఆహ్వానాలు దేశములోని ప్రముఖులకు, బందువులకు, మిత్రులకు అతనికి కావలసిన ముఖ్యమైన వ్యక్తులకు అనుచరులకు అందరికి ఆహ్వానాలు చేరినాయి. ఆ శుభ గడియలు రానే వచ్చాయి, ఎంతో కోలాహలముగా వివాహము జరిగింది. 

పెళ్లి మరుసటి రోజు ప్రదర్శన మొదలయింది, ఇంద్రజాలికుడు సూచించిన విధముగా ఒకొక్కరిని ఆ ఉద్యానవనములో పలికి ఆహ్వానింప బడుతున్నారు, అందరిలాగా ఆ ధనికుడు కూడా ప్రదర్శనను తిలకించడానికి వచ్చాడు, ఆ ద్వారము దగ్గరికి ప్రవేశించగానే ఇంద్రజాలకుని సేవకులు ఆయనను లోపలికి ఆహ్వానించారు, లోపలికి ప్రవేశించగానే ఆయన కనుచూపు మేరలో అత్యంత విశాలమయిన, బారీ ఎత్తు గల చిత్రపటం కానవచ్చినది, ఆ చిత్ర పటములో అందమైన పూల తోట, బారీ వృక్షాలు, ఎన్నో రకాల పండ్ల చెట్లు, ఎత్తయిన కొండలు, జలపాతాలు, చిన్న చిన్న సెలయేర్లు, అందమైన భవంతి అక్కడ అక్కడ ఆకాశములో మేగాలు, ఆ మేగాల చాటున సూర్యుడు, సూర్యుని కిరణాలు అక్కడ వుండే సరస్సులలో ప్రకాషిస్తున్నట్లు ఎంతో సజీవముగా కానవస్తున్నది, ఆ చిత్ర పటము ఎంతో  అద్బుతముగా చిత్రీకరించినట్లు గోచరమౌతున్నది, ఆ చిత్ర పటలము దగ్గర అవుతున్న కొద్ది అతనికి ఆనందము, ఆశ్చర్యము అవుతున్నది, ఈ చిత్రాన్ని ఏ చిత్రకారుడు గీసేనో అని ఆ చిత్రకరుడను ప్రశంశిస్తు ఆ చిత్రానికి మరింత చేరువ అవుతున్నాడు, అచిత్రము చేరువవుతున్న కొద్ది ఆ చిత్రములోని వృక్షాలు, కదులుతున్నట్లు మరి కొంతదూరములో జలపాతములో ప్రవాహము కాన వచ్చినది, మేగాలలో కదలికలు కనపడ్డాయి, ఆయన ఆశ్చర్యమునకు అవధులు లేవు ఇది నిజామా అనుకొంటు ముందుకు సాగుతున్నాడు, వాటికీ దగ్గర అవుతున్న కొద్ది ఆ చిత్రము కాదు ఇది వాస్తవముగా వున్నది, దూరము నుంచి ఇది ఒక చిత్రము లాగా అనిపించినది అన్న బావన ఆయనకు కలుగుతున్నది, మొదటగా అక్కడ అందమయిన అనేక పుష్పాలు ఆయనకు దర్శన మిచ్చాయి, అద్బుతమయిన పుష్ప సుగందాలు ఆయనను ఎంతో ఉత్తేజ పరుస్తున్నాయి, ఆ పుష్పాల తోటలో కాసేపు విహరిస్తూ ఆ సుగంద పరిమళాలను ఆస్వాదిస్తు, వాటి అందాలను తిలకిస్తూ ముందుకు సాగుతున్నాడు, ఆ తోటను దాటుకొని, అందమయిన సెలయేళ్ళు, వాటి ప్రక్కన అనేకనేక్ పండ్ల చెట్లు అగుపించాయి, ఆ పండ్ల చెట్లను చూడగానే వాటిని తినాలనే భావన ఆయనకు కలిగింది, వెంటనే నారింజ పండ్ల చెట్టు నుండి కొన్ని పండ్లు తెంచుకొని తిని చూడగా అబ్బబ్బ ఎంతో పులుపు, నోరంతా పూల్లగ, అక్కడే వున్న మామిడి పళ్ళు తెమ్పుకొని ఒకటి తిన్నాడు, ఎంతో తియ్యదనం ,  కడుపు నిండా రక రకాల పండ్లు అరగించాడు, ఆరగించిన తరువాత కాస్త విశ్రాంతి తీసుకొన్నాడు, ఆకాశం మేఘావృతము అయ్యింది చల్లని గాలులు ఆయనను ఎంతో ఆహ్లాద పరచినాయి,  అలా కాస్తా ముందుకు వెళ్ళాడో లేదో వర్షం మొదలయింది, వర్షము వెలసిన తరువాత ఆయన కొంత దూరములో వున్న అందమయిన కొండల సముదాయము కానవచ్చినది, ఆ కొండలలోనుంచి అక్కడక్కడ జల పాతాలు కానవచ్చినాయి, ఆ కొండల దగ్గర ఒక సుందరమయిన భవంతి అయన దృషిలో పడింది, ఎంతో సుందరముగాను, ఆకర్షణీయముగా కనపడుతున్నది, ఆ భవంతిని సందర్శించాలని కోరిక కలిగింది, అనుకున్నదే తడువుగా ఆ భవంతి వద్దకు వెళుతున్నాడు.  భవంతి దగ్గర అవుతున్న కొద్ది ఆ భవంతి సామాన్య మనవ కట్టడము కాదు దేవతలు నిర్మించినదా  అన్న భావన ఆయనలో మెదలుతుంది. భవన సమీపము అత్యంత రమణీయముగా వున్నది, అప్పుడే వాన వచ్చి వెలసి ఉండడము వాతావరణము ఎంతో ఆహ్లాదముగా వుంది, ఆ భవనములోనుంచి మంచి సంగీతమ్ ఎంతో ఆనందముగా వినసొంపుగా వినిపిస్తుంది, ఆ సంగీతం తనను మై మరిపించే విదముగా వున్నది, ఆ భవన ప్రదాన ద్వారము దాటుకొని కాస్తా ముందుకు వెళ్ళగా ఒక అద్దాల మండపము కాన వచ్చినది, అద్దాల మండపములోనికి ప్రవేశించాడు, అనేక రకాల ఆకృతులతో, అనేక రకాల పరిమాణాలతో అద్దాల మండపము ఎంతో గొప్పగా కానవస్తున్నది, అద్దాల మండపములో తన యొక్క ప్రతిబింబము, అనేక రకాల ఆకృతులలో, రకరకాల పరిణామాలలో అయన యొక్క ప్రతిబింబము ప్రతిపలిస్తున్నది, ఒక అందమయిన పసి బాలుని ఆకృతితో కూడిన అద్దము ముందు ఆ ధనికుడు నిలబడినాడు, అద్బుతం, ఆశ్చర్యము తన ఎదురుగా ఒక చిన్న పసిబాలుడు అందులో కాన వస్తున్నాడు, బాగా ఆ అద్దాన్ని పరికించి చూడగా అందులో కాన వచ్చే ఆ పసిబాలుని ఆకృతి అచ్చము తన పసితనములోని తన యొక్క రూపము లాగే కాన వస్తున్నది, ఆలాగే ఏడు, ఎనిమిది సంవత్సరాల బాలుని ఆకృతితో మరొక అద్దము వద్ద నిలబడగా అక్కడ తాను ఆ సంవత్సరములలో తాను అలాగే ఉండే తన చిత్రము గుర్తుకు వచ్చినది,  ౧౪ 14 సంవత్సరాల నూనూగు మీసాల వయస్సులో  మరొక ఆకృతి గల అద్దములో అవయస్సులోని తన రూపాన్ని చూచాడు, యుక్తవయస్సులోని యౌవకుని ఆకారములో వున్న ఆకృతి దగ్గర నిలబడగా ఆ వయస్సులో యువకుడిగా తాను ఎలావుండే వాడో అవిదముగా తన యొక్క రూపాన్ని చూచుకొన్నాడు, మిగతా వాటి మాదిరే ఇందులో కూడా ఆయనకు కేవలము కనపడడము కాదు తాను ఏవిదముగా తన కదలికలు కలవో అదేవిదముగా ఆ అద్దములో ప్రతిబింబించే తన రూపము కూడా ఆయా వయస్సులో  కాన వస్తున్నది, ఆ వయస్సులోని సజీవత్వము అందులో దర్శనమిస్తున్నది. మరొక ఆకృతి వద్ద నిలబడగా తన ప్రస్తుత సహజ బింబము అందులో కాన వస్తున్నది, ప్రక్కన చివరిగా మానవాకృతిలో ఒక అద్దము చూడగా వృద్దాప్యము లో తన రూపము చూసుకొన్నాడు,  తన జీవితములో ఇటువంటి అద్దాల మండపము గురించి ఎన్నడు కనీసము వినను కూడా వినలేదని, ఎంతో ఆశ్చర్యముకు లోనయినాడు, ఆ అద్దాల మండపములోనుంచి ఆభవనము లోపలి ప్రదాన విశాల మయిన కార్య మండపము లోనికి వచ్చాడు, అక్కడికి రాగానే అక్కడ వున్న శిల్ప కళలకు ఎంతో సంతోషిస్తూ ఆ భవనపు ఫై అంతస్తుకు చేరుకొన్నాడు అక్కడ ఏకాంత మండపములో ఎవరో సంచరిస్తున్న అలికిడి కావడముతో ఇక్కడ తాను కాకుండా ఇంకా ఎవరో వున్నట్లు గ్రహించి వారిని చేరుకోవాలని ఏకాంత మండపములోనికి ప్రవేశించాడు, ఏకాంత మండపములోని బాల్కనిలో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఏవో మాట్లాడుకుంటున్నట్లు అనిపించి వారిని సమీపించడానికి అక్కడికి చేరుకొన్నాడు, అక్కడ వారు  ఇద్దరు ఆ రోజే వివాహము అయిన నవదంపతులు అని ఆయనకు అర్థము అవుతున్నది, వారిని పలకరించాలనే ఆసక్తి తో వారి సమక్షమునకు వచ్చాడు, అయితే ఇతని రాకను వారు ఏమాత్రము గమనించ లేదనుకుంటాను, ఆ నవదంపతులకు అత్యంత సమీపమునకు వచ్చాడు, వారిని చూడగానే ఆయనకు ఆనందముతో వుబ్భి తబ్బుబి అయిపోతున్నాడు. ఆనందాశ్రవులు ధారాపాతముగా కారుతున్నాయి, అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యినాడు,  ఆ నవ దంపతులు ఎవరో కాదు తనకు జన్మనిచ్చిన తల్లి తండ్రులు. అయితే ఆ నవ దంపతలకు ఇతని ఉనికి ఏమాత్రము తెలియటములేదు.   

                                                     ....................సమీక్ష కొనసాగుతున్నది.


07 అక్టోబర్, 2017

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం ౧౧ 11

యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం

మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్ మ్యాపింగ్ )

సమీక్ష కొనసాగుతున్నది :

యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం నకు ముందుగా మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్ మ్యాపింగ్ ) అనే అంశాన్ని సమీక్షిస్తున్నాము. లవణో పాఖ్యానం మనకు అర్థము కావడానికి ఈ సమీక్ష తోడ్పడుతుంది. ఇందులోని అంశాలు కొన్ని రిపీటేడ్ గా ఉన్నప్పటికి ఒక మంచి అవగాహన కొరకు ఈ వివరణ తప్పని సరి అయినది.  

యావత్ జగత్ మాయా మోహిత బ్రహ్మ యొక్క ఒక కల్పన అని అనుకుంటే ఆయన అనేకానేక అంశాలుగు ఉపాదులుగా వ్యక్తమవుతూ వాటి యందు అసత్తు (ఉపాధి గత బెదాలతో ) తో రమిస్తూ  అనేక కల్పనలను రచిస్తూ జగత్ గా అనేక ఉపాధి గత బేదాలు గల జీవ సమిష్టి గా,   జీవులుగా ప్రకటితమయి జీవ బ్రాంతి తో మాయా బద్దుడై వున్నాడు. సమిష్టి జీవుడి యొక్క మాయా సంసారం గురించి తెలుసుకోవాలంటే, అవగాహన చేసుకోవాలంటే,  ముందుగా వ్యష్టి జీవుడిగా మనము ఎటువంటి కల్పనలకు, బందాలకు, భావాలకు, ప్రభావాలకు, ప్రలోభాలకు లోనై ఉన్నామో తెలుసుకొందాం, మన యొక్క నిత్య జీవితములో ఎన్నో అంశాలు మనలను అవాస్తవ స్తితులలోనికి గురిచేస్తుంటాయి, ఇందులో మన యొక్క మానసిక బావనలు, ఆలోచనలు మనము గ్రహించే విషయాలు, స్వతంత్రముగా మనలో ఏర్పరచుకొనే లేదా భావన చెందే విషయాలు వాస్తవానికి బిన్నముగా ఉండవచ్చు, కొన్ని అంశాలు మనము కల్పన చే సుకొన్నవైతె మరి కొన్ని మన చుట్టూత వుండే సమాజము నుంచి మనకు కలిగేవి లేదా ఏర్పడేవి. సహజముగా మనసుతోనే అనేక బ్రమ కల్పిత అంశాలు ముడి పడివున్నాయి, జీవుడు తన యొక్క దేహబిమానముతో పాటు బౌతికముగా, మానసికముగా ఏర్పరచుకొనే బందాలు అనేకము, అవి బార్యా, పుత్రుల యందు  బంధు బాంధవులు, మిత్ర, సపరివారమందు అనేక వస్తు విషయముల యందు ఏర్పరచుకొన్న ఇవన్నీ నేను అనే అహంకార భావన నుండి కల్గిన బ్రాంతి జనకములే.

మానసికముగా మనకుగా మనము కల్పించుకోన్నవి కొన్ని అయితే మరికొన్ని ఇతరుల నుంచి ఏర్పడేవి మరి కొన్ని, అవి వారి వారి  వ్యక్తీ గత మనోబవాలు కావొచ్చు లేదా ఇతరులచే ప్రబావితము అయ్యేవి కావచ్చు, ఏదయినా గ్రహించే వాడి లేదా అనుభూతి చెందేవాడి మీద ఆయా ప్రభావము ఉంటుంది. ఆయా విషయము యొక్క సత్యత్వము అది వాస్తవమా లేదా అవాస్తవమ అనేది గ్రహించే వాడి ప్రజ్ఞ లేదా అతని యొక్క మేదస్సు పైన ఆధారపడి ఉంటుంది.  ఈ విషయము మనకు ఇంకొంచెము బాగా అర్థము కావాలంటే ఇది వరకు పోగొ టీవిలో (pogo tv  ) Just For Laughs Gags  ప్రోగ్రాము వచ్చేది, బహుశా చాలామందికి తెలిసేవుంటుంది, ఇందులో విషయాలు ఎంతో ఆసక్తి కరముగా ఉంటుంది,  ఈ ప్రోగ్రంమ్ యొక్క రూపకల్పన గురించి కొంత అవగాహన చేసుకొందాం, ఎందుకంటే ఎదుటివారిని అంటే చూపరులను లేదా ప్రేక్షకులను నవ్వించడం వీరి ముఖ్యవుద్దేశ్యం, అయితే వీరి యొక్క కల్పిత సన్నివేశాలు ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న సంగటనల తాలూకు విషయాలు ఏవి కూడా వారు లక్ష్యము చేసుకొన్న వ్యక్తులకు తెలియదు, ఇతరులు కావాలని చేసిన ట్రాప్ అనితెలియక ఆయా సంఘటనలకు గురి అయిన వ్యక్తులు  ప్రతిస్పందిస్తారు, కొన్ని సంగటనలు వారిని అనేక భావోద్వేగాలకు ఆశ్చర్యానికి, బయానికి, ఆనందానికి, అసహ్యతకు, కోపాన్ని, జాలిని, దయకు గురిచేస్తాయి, ఇది అవాస్తవము అని తెలియక బ్రమలకు లోను అవుతారు, ఈ ప్రోగ్రాము రూప కర్తలు ఇది యద్రిచ్చికంగా జరుగుతుంది అనేట్టుగా రూపొందిస్తారు, వాస్తవముగా జరగక పోయిన కొన్ని కొన్ని సంగటనలు జరిగినట్టుగా బ్రమలకు గురి చేయడము, వాళ్ళకు కలిగే భావోద్వేగాలు, ఆశ్చర్యములను తమాషాగా రూపొందించి ప్రేక్షకులకు చూపించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యవుద్దేశ్యము ఇక్కడ మనము ఈ విషయములో మనము గమనించ వలసినది ఏమిటంటే ఎలాగయితే Just For Laughs Gags కార్యక్రమ కర్తలు ఇతరులను మనో బ్రాంతి కి గురి చేసి ఒక సన్నివేశాన్ని ఏవిదముగా తయారు చేస్తారో అదేవిదముగా, సమిష్టి యొక్క మాయా కల్పన వల్ల వ్యష్టి జీవుడు సమిష్టి యొక్క మాయా కల్పనల వల్ల బ్రాంతి నొంది అశాశ్వతము, అసత్యము అయిన జగత్ యందు సత్యత్వ భావనతో చరిస్తూ సంసారము యందు పరిబ్రమిస్తున్నాడు. ఇతరుల కల్పన వల్ల గాని లేదా  స్వీయ కల్పనల వల్ల గాని అది ప్రదర్శన గాని లేదా ఒక భావజాలము గాని తాను ఏర్పరచుకొన్న బందాల ద్వార, సామాజికముగా ఏర్పరచుకొన్న వస్తు విషయా దూల పట్ల సత్యత్వ బ్రాంతి కలగా చేస్తున్నదో అదే విదముగా ఇంకొంచెము వివరణాత్మకముగా చూస్తే మాయోపాది వలన వ్యష్టి జీవుడు మాయ మోహిత బ్రహ్మ లేదా సమిష్టి బ్రహ్మ యొక్క రూప కల్పనలో మాయా మొహితుడు అయ్యి నేను అనే అహంకారానికి బద్దుడు అయి ఇదే సత్తు అని వాస్తవమని బ్రమించి భవ బందాలలో ఇరుక్కొని సంసార సాగరములో కాల చక్రములో కొట్టుమిట్టాడుతున్నాడు అని గ్రహించుటకు కొంతవరకు ఈ సమీక్ష ఉపయుక్తము అని బావిస్తున్నాను.

  మైండ్ మ్యాపింగ్ బ్రమ కల్పిత అనే అంశము అర్థము చేసుకోవడానికి Just For Laughs Gagsను సమీక్షించడము జరిగింది. వాస్తవానికి ఇటువంటి Tv ప్రోగ్రాములు అంత సంస్కార వంతమయినవి కాదు అని అనిపిస్తుంది, ఎందుకంటే ఎదుటివారి యొక్క భావోద్వేగాలతో ఉద్దేశ్య పూర్వకంగా ఆడుకోవడము నీచుల లక్షణము అని మనకు ఎన్నో ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి, అది వారి యొక్క మానసిక దౌర్భల్యము లేదా దుర్భలత నుంచి వ్యక్తమౌతున్నవి  అనిచెప్పవచ్చు, బ్రమ కల్పిత మనస్సు గురించి సమీక్ష మరింత లోతుగా తదుపరి పోస్టింగ్ లో కొనసాగిస్దాము.
                                                                     ......సమీక్ష కొనసాగుతున్నది. 

03 అక్టోబర్, 2017

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం ౧౦ 10

యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం

మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్ మ్యాపింగ్ )
ఒక విత్తనము మొలకేత్తి అచిన్న మొలక మహా వట వృక్షము అవుతుంది, అదే విదంగా జీవుడు శైశవము నుంచి అతని ప్రస్థానము మొదలవుతుంది, శైశావములో ప్రపంచ బావము ఇసుమంతయిన ఉండదు, క్రమ క్రమంగా అతను బాహ్య జగత్తు యొక్క అనేక రకాల అనుభవాలతో, అనుభూతులతో, పరిచయమవుతున్న వస్తు విషయాలతో క్రమ క్రమంగా అతను వాటితో మమేకము అవుతాడు, పాంచ భౌతిక దృశ్య ప్రపంచమే వాస్తవంగా బావన చెందుతాడు, బాహ్య జగత్తు యొక్క జ్ఞానము, పొందిన అనుభూతుల ద్వార వాస్తవంగా భావన చెందుతాడు. తాను శరీర ఇంద్రియముల ద్వార పొందుతున్న అనుబూతులు, మానసికంగా చెందుతున్న భావనలు సత్యములుగా బావిస్తూ రాగ ద్వేషముల యందు అనురక్తి కలిగి వున్నాడు, అనేక బావజాలములను ఏర్పరుచుకొని వ్యవహరిస్తుంటాడు, తాను పొందుతున్న అనుబూతులన్నీ పోగేసుకొని మైండ్ మ్యాపింగ్ లేదా మనో రూప కల్పన చేసుకొని అనుబవాలుగా, విషయ వాసనలుగా ఏర్పరచుకొని మాయా సంసారమును కొనసాగిస్తుంటాడు.
మాయ చేత బాహ్య జగత్ యందు తనకు కలిగిన, ఏర్పరచుకొన్న భావాలను వాస్తవముగా అనుబూతి చెందుతు తనకు కలిగిన మిద్యా జ్ఞానమును ప్రపంచము యందు ఆరోపించుట (మైండ్ మ్యాపింగ్)  జీవ స్వభావమయి వున్నది,   ఇదే విషయాన్ని ఇంకొంచెము విపులముగా పరిశీలిస్తే సహజముగా ఒక వ్యక్తి తన యొక్క బావములతో, తాను గ్రహించిన, పొందిన వివేక విజ్ఞానములతో, అనేక అనుభూతులతో  కామ, క్రోధ, లోబ, మోహ, మద, మాత్సర్యాలకు లోబడి పీడుతుడు అవుతున్నాడు. తనలో కలిగే అనేక భావాలతో వ్యవహరిస్తూవుంటాడు, తాను ఏ బావములతో అయితే కలిగి ఉంటాడో ఆయా బావోద్వేగములు కలిగి వుంటాడు, అంతే కాకుండా ఇతరుల రాగ ద్వేషములకు కూడా గురి అవుతూ వారి యొక్క ఈర్ష్య , ద్వేషముల లాంటి ధౌర్బల్యాది మానసిక రోగముల ప్రబావములో పడుతున్నాడు, ఎవరయినా తనయందు ఈర్ష్య బావముతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క బావముతో తాను కలత చెందుతూ మదన పడతారు, ఇక్కడ సూక్ష్మముగా అర్థము చేసుకోవలసింది ఏమిటంటే ఎవరయినా తమ యందు గాని ఇతర మయిన విషయముల యందు, రాజకీయ, కుల, మత, వర్గ, ప్రాంత, వ్యక్తుల, ప్రాపంచిక విషయముల యందు  రాగ ద్వేషములు కలిగి వికృత బావములు రూపొందించుకొని వాటిని పులుముకొని వాటితో  కలత చెందుతూ ఇతరులయందు, తత్ సంబందిత వ్యక్తి యందు దౌర్బల్యమును ప్రదర్శిస్తుంటారు, ఇది కూడా తత్ సంబందిత వ్యక్తీ కి ఇతర వ్యక్తులకు బ్రమను కల్పించే విషయము. ఎవరయితే ఇతరులు తన యందు కలిగిన బావ దారిద్ర్యము, (అరిషట్ వర్గ ప్రేరేపిత అసహ్యములు, మానసిక జుగుప్స ) ఉదాహరణకు తన యందు ఇతరులు వాస్తవానికి బిన్నముగా ఈర్ష్య, ద్వేషములతో నిందించిన, వ్యక్త పరచిన వారి యొక్క బావముతో కలత చెందుట ఒక బ్రాంతి కరమయిన చర్య అది వాళ్ళు అబిప్రాయము వారి యొక్క ప్రొజెక్షన్ వారి యొక్క మనోవ్యాది కాని వాస్తవానికి నేను వారి యొక్క దురబిప్రాయము కాదు అని తెలిసి ఉండుట మనో బ్రాంతి రహిత స్తితి, వారు నీ మీద తయారు చేసుకున్న, ఏర్పరచుకొన్న, జుగుప్స  అబిప్రాయముల యందు నీవు పట్టించుకోని వారి మనో రోగమును నాది అని పట్టుకోవడమే, కలత చెందడమే, నీ మీద వారు తయారు చేసుకొన్న (Mind Maping) జుగుప్సా కరమయిన బావములచేత  వాళ్ళును వాళ్ళే పీడిన్చుకుంటూ నీ యందు, ఇతరుల యందు వ్యక్తీకరించి ప్రదర్శించి, యాతనకు గురిచేస్తే కాని వారి యొక్క దుర్బలమయిన మనసు శాంతించదు శునకానందము పొందుతుంటారు, వాళ్ళను వాళ్ళు హిప్న టైజ్ చేసుకొంటూ ఇతరులను హిప్న టైజ్ చేస్తుంటారు, ఇది సహజముగా ప్రపంచములో జరిగే బావ కాలుష్యము,   కాబట్టి ఇతరుల మనోబావముల  పీడింప బడుతు  వారి ఈర్ష్య, ద్వేశాది జుగుప్స  అసహ్యములు  ప్రపంచములో జరిగే ప్రతి చర్యలన్ని ప్రపంచికుల మస్తిష్కమునుంచి ప్రొజెక్షన్ అవుతున్నవే అంతే కాని అవి అన్ని సత్యాలు కావు, వాటి యందు తగు విదముగా స్పందిస్తూ సత్యముగా నీవు పరమాత్మ యొక్క సత్యత్వమును గ్రహించుటకు నీవు ఎటువంటి బావ జాలము ఏర్పరచుకోనక, ఇతరుల మైండ్ మ్యాపింగ్ లో కొట్టుకొని పోకుండా కేవల కర్తవ్యనుసారముగా ప్రవర్తిస్తూ పవిత్రమయిన, పర బ్రహ్మ బావనలో మనసు  లీనమవ్వాలి.

Hologram Technology మనకు మహా భారతములో ధర్మ రాజు రాజసూయ యాగము ఘట్టము మనకు జ్ఞప్తికి తెస్తుంది, ఇందుల మయుడు పాండవులకు మయుడు మయ సభను నిర్మించి ఇస్తాడు ప్రస్తుత టేక్నాలజి 3D చిత్రాలు అందరికి సుపరిచితమే,   ప్రస్తుత కాలములో 3D  గేమ్స్ కూడా చాలానే వస్తున్నాయి అయితే ప్రస్తుత కాలములో వస్తున్న ఆధునిక Technology ద్వార అత్యంత ప్రామాణికతతో అనేక రకాల చిత్ర ప్రదర్శనలు జరుగుతున్నాయి. Hologram Technology, 7D Hologram show లకు ప్రస్తుతము అత్యంత ఆదరణ లబిస్తుంది. ఈ షోలో వాస్తవాన్ని ప్రతిబింబించే విదంగా అనుభూతులను పంచుతున్నాయి, ప్రదర్శన ఎక్కడో స్క్రీన్ మీద కాకుండా వాస్తవంగా మన చుట్టుపక్కల జరుగుతున్నట్టుగా వుంటుంది. తెరపయిన కనిపించే చిత్రాలు మనచుట్టుగా తిరగాడుతున్నట్లు బ్రమలకు గురిచేస్తు ప్రదర్శనలు జరుగుతున్నాయి, పి సి సర్కార్ ౧౯౯౨ 1992లో  లేజర్ ప్రక్రియతో ఆయన రైలునే మాయం చేసినట్టు ప్రేక్షకులకు బ్రమను కల్పించాడు. రైలునే మాయము చేసి అందరిని ఆశ్చర్య చకితులను చేసినాడు, అదేవిదముగా ఈనాడు వున్న  7D Hologram టేక్నాలజి  ద్వార లేని వస్తువులను, మనుష్యులను, అనేక రకాల జీవజాతులు, అపరూప కట్టడాలు, సుందరమైన ఉద్యాన వనాలను, ఆకాశ వీధులు క్షణాల్లో మన చుట్టుపక్కల ప్రత్యక్ష్యము అవుతాయి.  వాస్తవంగా అగుపిస్తూ అబ్బురపరుస్తాయి. ఇదే రీతిన మనస్సు  యొక్క చమత్కారము, మనసు యొక్క అపూర్వమయిన శక్తి అనేక మయోపాదికముల చేత అభివ్యక్తీకరణ జరుగుటను కొంతవరకు అయిన మనకు అర్థము చేసుకొనుటకు తోడ్పడుతుంది. 7D Hologram showను చూసినట్లు అయితే మనకు యోగ వాశిష్ఠ హృదయము లోని లవణో పాఖ్యానం  బోదపడుతుందని బావిస్తున్నాను.

 

                                                                                             .................(ఇంకావుంది )


26 ఏప్రిల్, 2017

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 9

శ్రీ రామ 

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 9

26-04-2017


ఆత్మీయ బంధువులయిన మీరందరు పరమాత్ముని యోక్క దివ్య ఆనందస్వరూపమును తెలుసుకొంటుంటారని భావిస్తూ 


లోకములో ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లల అమాయకత్వమును, పిల్లల నిష్కల్మష హృదయాలను చూసి సంబర పడిపోతుంటారు, వారు తడబడుతూ నడుస్తుంటే ఎంతో అబ్బురపడతారు, వచ్చిరాని మాటలకు మురిసిపోతుంటారు, తెలిసి తెలియని మాటలకు నవ్వుకుంటుంటారు, వారి ఆట పాటలను ఆనందంగా తిలకిస్తారు, వారి శారీరిక మానసిక ప్రక్రియ అలావుంటుంది, ఐతే వారు తమ పిల్లలు ఎప్పుడు అలాగే వుండాలని ఎవరూ అనుకోరు,  వాళ్ళు ఎదగాలని అన్నివిషయాలు తెలుసుకోవాలని ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వారి వారి జీవితాలను గడపాలని కోరుకుంటారు, శారీరికంగా మానసికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, ఆశిస్తుంటారు అలాగే లౌకిక విద్యలను బోధించేవారు కూడా లౌకిక ప్రపంచపు విద్యలను తమ విద్యార్థులకు బోదిస్తుంటారు, ప్రజాపాలకులు తమ దేశములోని ప్రజలు అభివృద్ధి చెందాలని పాలకులు భావిస్తారు, అందుకు తగినవిధంగా ప్రణాళికలు రచన చేసి అమలు చేస్తారు. 


జగద్గురువు ఆదిశంకరాచార్య వారు తమ శిష్యులను లోకానికి జ్ఞాన దీపాలుగా సత్యప్రకాశకులుగా మానవాళికి సత్యమార్గ భోదకులుగా ఈ లోకానికి అందించారు సామాన్య ప్రజలు ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతున్నారు, అలాగే ఆ పరమాత్మ జ్ఞానము కలిగిన భక్తుల కంటే అమాయకపు భక్తులంటే పరమాత్మకు ఎంతో ఇష్టము వారిని తొందరగా అనుగ్రహిస్తాడు కూడా అయితే ఆయా భక్తులు ఏమితెలియని అమాయకపు భక్తిలోనే ఉండాలని అనుకోడు, వారికి సరిఅయిన జ్ఞానము పొందడానికి తన గురించి పూర్తిగా అతను దివ్య మార్గమును పొందాలని స్వయముగా తానే జగద్గురువుగా, సద్గురువుగా త్రిమూర్తి రూపంగా, ఆ దత్త మూర్తి తన భక్తులకు తన యొక్క జ్ఞాన స్వరూపమును బోధిస్తాడు, ఆ భగవంతుని గురించి తెలుసుకొనే కొద్ది భక్తి కూడా పెరుగుతుంధి తన శిష్యుడను ఆ పరమాత్ముని దివ్య స్వరూపములో, దివ్యానందములో నిలిచేటట్టు అనుగ్రహిస్తాడు ఉద్ధరిస్తాడు, అది ఆ పరమాత్మ తన భక్తులకోసం శరీరాన్ని ధరించి సద్గురువుగా, భక్తుల, శిష్యుల హృదయములో జ్ఞానదీపంగా వెలుగొంది అజ్ఞానాంధకారమును తొలగించి అమృత జ్ఞానమునింపుతాడు. సద్గురువు యొక్క అనుగ్రహముతో మన అందరి హృదయాలలో అజ్ఞానమనే చీకటి తొలగి సత్యదీపము వెలగని అని భావిస్తూ.  

ఇట్లు 

మీ ఆత్మీయ బంధువు. 

( ఈ ఉత్తరము చదివే ప్రతిఒక్కరు ఆత్మీయ బంధువే )

, 

20 ఏప్రిల్, 2017

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 6

శ్రీరామ 

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 6


20-04-2017

సమాజము లో నుండి మనకు అనేక రకాల విమర్శలు కాని పొగడ్తలు కాని అవమానములు కాని రాజపూజ్యములు లాంటి అనేక రకాల అనుభవాలు ఎదురు అవుతుంటాయి సాధారణంగా అవి మన అహంభావము మీద పనిచేస్తాయి, ఇతరుల విమర్శలు మనస్సు యందు గుచ్చుకొన్నప్పుడు మనకు భాధ అవుతుంది అదే పొగడ్తలు అయితే ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఏ విషయమయిన మనస్సును తాకి నప్పుడు తదనుగుణ స్పందన మనలో కలుగుతుంది,ఈ రెండు సాధకుడికి లేదా భక్తుడికి ఆటంకములే రెండిటి యందు సమధృష్టి కలిగి లేదా ఆరెండు విషయమునందలి తటస్థన్గా వుండి తమ సాధన తాము కొనసాగించడమే, అవసరము మేరకు వాటి యందు తగు స్పందన కలిగి ఉంటూనే లౌకిక విషయాల యందు తమ కర్తవ్యమును నిర్వహిస్తూనే పరమాత్మ యందు మనస్సును నిమగ్నము చేయాలి లేదా  ఆ పరమాత్ముని లేదా గురువు యందు సంపూర్ణ శరణాగతి చెందాలి. 

   మన భారత దేశమును అనేక మంది రాజులు పరిపాలించారు అయితే ఆయా రాజులు తమ పరిపాలనా సౌలభ్యము కోసము ఎవరికి వారు బిన్నంగా తమ రాజధానులను ఏర్పరచుకున్నారు, తమ లక్ష్యాలకు అనుగుణంగా ఏక కేంద్రీకృత పరిపాలన, సామంత రాజ్య పాలనా విధానాలను కేంద్రాలను ఏర్పాటు చేసుకొన్నారు, అలాగే భక్తులు సాధకులు కూడా పరమాత్మని కేంద్రగా చేసుకొని తమ మనస్సులను పరిపాలించుకోవాలి, అప్పడు అంతఃకరణం ( మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము )లు  సామంతులు గా అవుతారు, సామంతులు అంటే తమ ఇచ్చ్చా పూర్వకంగా పరిపాలించకుండా తమ యొక్క రాజు లేదా చక్రవర్తి యొక్క అజ్ఞాలనే పాటిస్తూ ఉంటాడు నాది అనేది ఉండదు, కేవలము అధికారము, కర్తవ్యములు ఉంటాయి, అలాగే సాధకుడు లేదా భక్తుడు భగవంతుని తమలో ప్రతిష్ట చేసుకొని పరిపాలన చేస్తే మన అంతః కరణము శుద్ధమై మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారములు భగవంతుని సామంతులుగా అవుతాయి, అహంకారము  ఉండదు, సామంతుల పోషణ రక్షణ అంతా చక్రవర్తి చూసుకొన్నట్టు ఆ పరమాత్మయే తమ భక్తుని పోషణ, రక్షణ కల్పిస్తాడు. ఇక్కడ కర్తవ్యము ఉంటుంది కాని నేనే కర్తను అని ఉండదు, నేను చేస్తున్నానని అహంభావం ఉండదు,   ఉదాహరణకు భక్త ప్రహ్లాద. పరమాత్ముని యందు మనస్సును కేంద్రీకరించాలి ఆలా కేంద్రీకృత మయిన మనస్సు శుద్దము అవుతుంది, పరమాత్ముడు మనలో ప్రకాశిస్తాడు, మన అందరి మనస్సులు ఆ పరమాత్ముని యందు, సద్గురువు యందు  లగ్నము అవుగాక.  మన అందరికి పరమాత్ముని, గురువు యొక్క అనుగ్రహము కలుగు గాక. 


ఇట్లు 

మీ ఆత్మీయ బంధువు. 



( ఈ చరా చర జగత్తులో పరమాత్మయందు భక్తి వున్న 
ప్రతి ఒక్కరు ఆత్మీయ బంధువే )

28 మార్చి, 2017

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23

పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...

శాంతి నేలకోనుగాక !

భూమి లో శాంతి నేలకోనుగాక ! అంతరిక్షం లో శాంతి నేలకోనుగాక ! ఆకాశం లో శాంతి నేలకోనని. నీటిలో శాంతి నేలకోనుగాక ! మూలకాలలో ( మూలికలలో ) శాంతి నేలకోనుగాక !
చెట్టు చేమలలో శాంతి నేలకోనుగాక ! దేవతలందరూ నాకు శాంతిని ప్రసాదిస్తారు గాక ! ప్రతి ఒక్కరికి దేవతలు శాంతిని అనుగ్రహిస్తారు గాక ! శాంతి లో సకల ప్రాణులు శాంతి పొందు గాక !
ఈ నానా విధ శాంతులు మూలంగా నాకు మరియు అందరికి మంగళం ఒనగూరు గాక ! వాటికీ మంగళం ఒనగూరు గాక ! సమస్తమూ మనకు మంగళమును ప్రసాదించు గాక !. సమస్తానికి మంగళం ఒనగూరుగాక.

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

సర్వేజనః సుఖినో భవంతు

సర్వేజనః సుఖినో భవంతు, MAY ALL BEINGS BE HAPPY, MAY THE WHOLE WORLD BE HAPPY

అహం బ్రహ్మసి

The peace (Shanti) that resides in the solar world (Dyauh), in space (Antariksha), in the earth (Prithwi) and elemental waters (Rapah),
nourishes the herbs, fruits and grains (Roshadhayah) thereby nourishing the original power (Om) in all beings (Vishvedevah).
May the peace of the whole (Brahma) now and forever more (Sarvagwam) come into us, we pray. May the highest good prevail.

Om Shanti Shanti Shanti (Peace Peace Peace) .సత్యం నిత్యం అనంతం

Peace

tranquilness, Peace, peace, peace shanti shanti shanti !

May all people be happy

May all people be happy
May all people be happy

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

SRI PADAVALLABHA

SRI PADAVALLABHA
SRI PADA RAJAM SHARANAM PRAPADYE

NEE JEEVITANIKI

NEE JEEVITANIKI

SUVISHALAM IDAM VISWAM

SUVISHALAM IDAM VISWAM

SRI GURU RAGHAVENDRA

SRI GURU RAGHAVENDRA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

JAI GURU DATTA

JAI GURU DATTA
SRI GURU DATTA

JAI GURU DATTA

JAI GURU DATTA

Trident

Trident
Trident