శ్రీ దక్షిణామూర్తి దీక్ష
ఈ దీక్ష స్వీకరించే వారు ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చే ముందు 40 రోజుల ముందు సోమవారం లేదా గురువారం స్వీకరిస్తారు. ఇది కోటప్ప కొండ గుడిలో కానీ లేదా దగ్గరలో శివాలయంలో కానీ, శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో కానీ లేదా ఒక మఱ్రి చెట్టు క్రింద కానీ ఎవరైనా స్వీకరించవచ్చు.
స్ఫటిక మాల-54 లేదా 108 పూసలు గలది శ్రీ దక్షిణామూర్తి లేదా శివుని రూపుతో ఉన్నది ధరించటం జరుగుతుంది.ఇరుముడి 3 టెంకాయలు,మూడు రకాల పండ్లు,విభూతి,గంధం,కర్పూరం,తే నె,పటికె బెల్లం,మూడు గుప్పెళ్లు బియ్యం తో కట్టుకుంటారు.
దీక్షలోని నియమాలు విధిగా ఏ బ్రహ్మచర్య దీక్షలో ఉండే నియమాలే:
1. తల్లి దండ్రుల,దేవ బ్రాహ్మణాది పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి యుండాలి.ప్రాత:కాలమున లేవగానే తల్లిదండ్రుల లేదా గృహ పెద్దల పాదములకు నమస్కరించాలి.
2. ప్రతి దినము ఉదయం,మధ్యాహ్నం,సాయం కాలం మూడు పూటలా చన్నీటి స్నానం శిరస్నానం విధిగా చేయాలి.
3. విభూతి రేఖలు దిద్దుకుని గంధము కుంకుమలతో గుండ్రని బొట్టు భ్రూస్థానం లో పెట్టుకోవాలి.
స్ఫటిక మాల-54 లేదా 108 పూసలు గలది శ్రీ దక్షిణామూర్తి లేదా శివుని రూపుతో ఉన్నది ధరించటం జరుగుతుంది.ఇరుముడి 3 టెంకాయలు,మూడు రకాల పండ్లు,విభూతి,గంధం,కర్పూరం,తే
దీక్షలోని నియమాలు విధిగా ఏ బ్రహ్మచర్య దీక్షలో ఉండే నియమాలే:
1. తల్లి దండ్రుల,దేవ బ్రాహ్మణాది పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి యుండాలి.ప్రాత:కాలమున లేవగానే తల్లిదండ్రుల లేదా గృహ పెద్దల పాదములకు నమస్కరించాలి.
2. ప్రతి దినము ఉదయం,మధ్యాహ్నం,సాయం కాలం మూడు పూటలా చన్నీటి స్నానం శిరస్నానం విధిగా చేయాలి.
3. విభూతి రేఖలు దిద్దుకుని గంధము కుంకుమలతో గుండ్రని బొట్టు భ్రూస్థానం లో పెట్టుకోవాలి.
4. స్వామిని సర్వకాల సర్వావస్థలయందు ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ: అని జపిస్తూ ఉండాలి.
5. మద్య,మాంస,ధూమపానాదులను త్యజించాలి.సాత్వికాహారాన్ని భుజిస్తూ ఉల్లి, మసాలాలు, వేపుడులు మానివేయాలి.
6. త్రికరణ శుధ్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.స్త్రీలను పవిత్ర దృష్టితో చూడాలి.
7. మాల ధరించిన పిదప తన హృదయములో స్వామికి నివాసమేర్పడిందని భావించి శ్రధ్ధా భక్తులతో వినయ విధేయతలతో మెలగాలి.
8. క్షురకర్మ చేయించుకొనుట,చేతి గోళ్లు తీయుట చేయకూడదు.
9. భూశయనము చేయాలి.నేల మీద శుభ్రమైన వస్త్రాన్ని పరచుకొని విశ్రమించాలి.లేదా చాప వేసుకోవచ్చు.
10.ఒక పూట మాత్రమే భోజనం చేయాలి.రాత్రి పూట పండ్లు భుజించి పాలు సేవించాలి.

11. మూత్ర విసర్జనానంతరం కాళ్లు, చేతులు కడుక్కొని నీటితో ఏడు సార్లు పుక్కిలించి ఉమిసివేయాలి.కాలకృత్యాల అనంతరం స్నానమాచరించి ఉతికి ఆరవేసిన వస్త్రాలను ధరించాలి.
12. ప్రతి సోమ,గురువారాలలో స్థానిక దేవాలయాన్ని సందర్శించాలి.
13. సాధ్యమైనంతవరకూ పురాణ కాలక్షేపం గానీ సత్సాంగత్యం లో గానీభజనలో పాల్గొనటం గానీ చేయాలి.
14. చెప్పులను వాడకూడదు. తప్పనిసరి అయినప్పుడు తోలు చెప్పులు కాని వాటిని ధరించాలి.
15. త్రికాలములందు శ్రీ దక్షిణామూర్తి పూజలు చేయాలి.
16. తెల్లని వస్త్రములు మాత్రమే ధరించాలి.చేతి రుమాలు సైతం తెల్లనిదయి ఉండాలి.రంగు అంచు ఉండకూడదు.అవసరమైతే ఆకుపచ్చ అంచు ఉండవచ్చు.
17. ప్రతి రోజూ ఒక గంట మౌనం పాటించాలి (నిర్విరామంగా)

18. సినిమాలు చూడటం,అశ్లీల సాహిత్యం చదవటం చేయకూడదు.దీక్ష స్వీకరించిన వారు మానసిక శారీరిక స్థితులయందు సమతుల్యతతో మరియు మనోవాక్కాయకర్మలయందు పవిత్రతతో సమాజమునకు ఆదర్శప్రాయులుగా ఉండాలి.
పై నియమాలతో పాటు ప్రవర్తనా దోషాలను పరిహరించి సన్నియమాలను ఆచరించటం ద్వారా అందరూ శ్రీ మేధా దక్షిణామూర్తి అపార కరుణా కటాక్ష వీక్ష ణాలకు పాత్రులై సుఖ శాంతులని,అష్టైశ్వర్య విభూతిని పొందుదురు గాక!
ఓం తత్ సత్!