పేజీలు

సర్వమంగళ

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధి సాధికే శరన్యే త్రయంబకే దేవి నారాయని నమోస్తుతే .
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశ్యశాలినీ । దేశోఽయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ॥

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

25 ఆగస్టు, 2011

వినాయక వ్రత కల్ప విధానము

వినాయక వ్రత కల్పం 

ఆచమనం:

ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

సంకల్పం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
 ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః

శ్రీ గోవింద గోవింద ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగ్ ం శివః ఓం మహః ఓంజనః ఓంతపః ఓ గ్ం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామం  (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం) చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సర్వజిన్నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్ద్యాం వాసరః స్థిరవాసర యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ది వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
 

షోడశోపచారపూజ

ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ

(పుష్పములతో పూజించవలెను)
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో పూజింపవలెను)
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,
భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి।

అథ దూర్వాయుగ్మ పూజా

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

నమస్కారము, ప్రార్థన

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

శ్రీ వినాయక వ్రత కథ

 గణపతి జననము

సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।
అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।
శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।
జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

గణేశుడు అగ్రపూజనీయుడు

ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం

గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।
(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.

శ్యమంతకోపాఖ్యానము

చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.
అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది.
నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.
ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.
అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలికకున్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఓక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.

అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు.
అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్దమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్దము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
సర్వేజనాః సుఖినో భవంతు.

విఘ్నేశ్వర చవితి పద్యములు

ప్రార్థన :
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం

 



 

తెలుసుకో

అశాశ్వతమైన ఈ జీవితంలో ప్రతిక్షణమూ ఎంతో అమూల్యమైనదని తెలుసుకుని ప్రతి మనిషి సంతోషంగా ప్రాశాంతంగా జీవిస్తే ఎంతో మంచిది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం


 


రంతిదేవుడు


                               అన్నమో రామచంద్రా అంటూ ఆకలి మంటలతో విల విల పోయేవాళ్ళు భారత సమాజం లో ఎంతో మంది వున్నారు, భారత దేశం పుణ్య భూమి అలాగే కర్మ భూమి కూడా ! మీరు మీ ప్రాంతాలను బాగా గమనిచండి అక్కడక్కడ అన్నం యచించడానికి కూడా శక్తి లేని వాళ్ళు వున్నారు. అటువంటి వాళ్ళు మీ దృష్టి కి వస్తే గనుక మీ శక్తి కొలది వారికీ ఆ రోజు ఆహారాన్ని ఏర్పాటు చెయ్యండి, నా దృష్టి లో  నిజమైన పరమాత్మా సేవ ఇదే, మహా దానాలలో అన్నదానం అత్యంత శ్రేష్ఠ మైనది, ఆ తరువాత జ్ఞానదానం, ప్రముకంగా చెప్పుకోవాలంటే అన్నదానం అత్యంత పవిత్ర మైన కార్యము.

 మనకు తెలియని గొప్ప దయ కలిగిన వ్యక్తులకు కూడా ఈ పుణ్య భూమి లో కొదవ లేదు.  

    చాలామందికి తెలియని గొప్ప గొప్ప దాతలు ఎంతో మంది వున్నారు.

        శ్రీ మహా భాగవతం లో ఒక రాజు గురించి ప్రస్తావించారు అతను ఎవరో కాదు రంతి దేవుడు. అయన  కు దాన  గుణం ఎక్కువ అతని అంతటి దాన గుణ శ్రేష్టుడు ఎవరు లేరని ప్రతీతి,  అతను రాజ్య పరిత్యాగము చేయవలసివచ్చింది. అతను అడవి లో సన్యాసి జీవితం గడుపుతుంటాడు. 
 
                                        అతను 48 దినములుగా ఆహారం దొరకక నకనక లాడుతుంటాడు, సత్య దేవుడికి అతనిని ఇంకా పరీక్షించాలి అని అతనికి కొంత ఆహారం లభ్యం అయ్యేట్టుగా చేస్తాడు, ఆహారం అతనికి లభించే సరికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది, శక్తి కూడ దీసుకొని ఆహారాన్ని సమీపిస్తాడు,  దాన్ని  ఆరగించుదాం అనుకుంటుండగా ఒక పేదవాడు ఆకలితో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు      సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు, అతను ఆ అన్నం తీసుకొని  తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. అప్పటికే అతనికి శక్తి క్షీణించింది. అతని శరీరం ఆణువణువూ ఆహారం  కోసం తపిస్తుంది. అతను ఆ అన్నం తీసుకొని నోటిలో పెట్టు కొంటుండగా ఆ సమయానికి ఒక  కుక్క అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం ఎదురు చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది  అనుకుంటు స్పృహ కోల్పోతాడు. మరుక్షణమే సత్య దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.

All Religions Under One Roof

Yen Feng, a singapore Reporter  lauds the interfaith exhibition, a meeting point for all religions.
TALK of securing a “common space” in Singapore’s multi-religious society has focused largely on maintaining a secular public sphere.
The ongoing interfaith exhibition at Suntec City is a timely reminder that pluralism plays a part in promoting religious harmony, too. On display at the exhibition, organized by the Inter-Religious Organization and China’s State Administration of Religious Affairs, are more than 1,000 items of religious significance from 10 different religions, notably including lesser-known faiths like Jainism, Zoroastrianism and the Baha’i Faith, which in Singapore number altogether only about 3,000 followers.
The week-long exhibition, flush with explanatory notes, books, CDs as well as lectures and talks, enables visitors to better understand the fundamental tenets of each religion.
This transnational, interfaith endeavour is a public symbol of what has been ongoing in private circles all around Singapore in recent years. Activities organised by the various neighbourhoods’ Inter-Religious Confidence Circles, and interfaith youth forums, give opportunities for faith groups to exchange alternative views, and share with each other the different religious values that shape their lives.
Such exhibitions and cool-headed discussions on religion are crucial in a time when faith-based tensions in the world are hotter than ever.
Whether in Baghdad, Bombay or Belfast, from the recent Swiss ban on minarets, to the Ford Hood killings in the United States, community conflict is more often fuelled by religious misconceptions, rather than disagreement on where the line should be drawn between secular and religious society.
For example, since the 9/11 attacks, Islam, whose name means “peace” or “submission”, has been hijacked by religious extremists to  cultivate public perception that Muslims are all suicidal, bomb-carrying fanatics.
To combat such misguided representations,  discussions on pluralism, and the need to maintain a public space for all religions — such as the one in Hall 603 of Suntec City, where on the opening night of the religious exhibit, leaders of all 10 faiths in the IRO stood together on stage to offer the world a prayer of peace.
Such a show of non-exclusive solidarity is an example of what United States’ president Barack Obama’s faith advisor Eboo Patel said in an interview last month that “religion in the 21st century has to be about building a bridge of cooperation, not a bomb of destruction”. In Singapore, such a bridge may be drawn not as a detour from our public sphere, but as a meeting point for all religions to work together.
In a small country like Singapore, where people of all religions live together cheek by jowl, it is particularly important that we have a clear, unbiased understanding of the religious lives of our neighbours. We should know, at least, what the holy books central to each religion are, and what they say about their beliefs and the significance of their religious practices. In times of increased religiosity, such efforts will also circumvent acts of intolerance as politicians warn of followers retreating into their respective religious communities. In making the effort to understand the beliefs that underpin our neighbours’ rituals, we may find more  commonalities than differences between us. And that is a surer way in Singapore — and around the world — to promote peaceful co-existence and religious harmony.
The 2009 China-Singapore Religious and Cultural Exhibition was held at the Suntec City Convention Centre.

SOURCE : www.jainology.org

24 ఆగస్టు, 2011

ప్రముఖ భారతీయ ఆజన్మ-బ్రహ్మచారులు

[మార్చు] పెళ్ళిచేసుకోని నటీమణులు,గాయనీమణులు

[మార్చు] పెళ్ళిచేసుకోని నటులు

ఆర్.నారాయణమూర్తి

[మార్చు] ఉన్నత అధికారులు ,సంఘ సేవకులు

[మార్చు] కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు

                                                                          వికీపీడియా  వారి సౌజన్యము తో

    Om Shanti,Shanti,Shantihi

    Sarve Bhavantu Sukhinaha
    Sarve Santu Niramayah
    Sarve Bhadrani Pashyantu
    Ma Kaschid Dhuka Bhag Bhavet
    Om Shanti,Shanti,Shantihi


    May all be happy. May all enjoy health and freedom from disease. May all enjoy prosperity. May none suffer.

    Om Shanti,Shanti,Shantih


    Sarveshaam Svastir Bhavatu
    Sarveshaam Shaantir Bhavatu
    Sarveshaam Poornam Bhavatu
    Sarveshaam Mangalam Bhavatu.
    Om Shanti,Shanti,ShantihI

    Om. May there be peace in heaven.

    Om Dhauh Shaantirantarikssam Shaantih
    Prthivii Shaanti Raapah Shaantirossadhayah Shaantih |
    Vanaspatayah Shaantirvishvedevaah Shaantirbrahma Shaantih Sarvam Shaantih
    Shaantireva Shaantih ||

    Meaning:
    Om. May there be peace in heaven.
    May there be peace in the sky.
    May there be peace on earth.
    May there be peace in the water.
    May there be peace in the plants.
    May there be peace in the trees.
    May there be peace in the Gods.
    May there be peace in Brahman.
    May there be peace in all.
    May that peace, real peace, be mine.

    Om Shantihi, Shantihi, Shantihi .

    Om Bhadram Karne Bhihi Shrinu Yama Devaha
    Bhadram Pashyema Kshibhir Yajatraha
    Sthirai Rangai Stush Tuvam Sasta Nubhir
    Vyashema Deva-hitam Yada-yuhu

    Om Shantihi, Shantihi, Shantihi .

    చార్ ధాం యాత్ర ఉత్తర ఖండ్


                                                      మంచు తో కప్పభడిన కేదార్నాథ్ ఆలయం

                                            ఉత్తర ఖండ్ లో  సహజ ప్రకృతి  శోభతో అలరారే నాలుగు దివ్య ధామాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, భద్రినాథ్  ఇవి నిజంగా నాలుగు స్వర్గాలు.   ఈ యాత్రకు  రుషి కేష్ నుండి వెళ్ళాలి.  వెళ్లే దారి అంతా ఘాట్ రోడ్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండ దారిలో వెళ్తుంటే కింద పచ్చని తెవాచీ పర్చినట్లు ప్రకృతి, దట్టమయిన అడవులు అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, మేఘాలను తాకే కొండలు జలపాతాల ప్రక్కన ప్రయాణం భలే గమ్మతుగా వుంటుంది. మనోహరమైన ప్రకృతి దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఈ యాత్ర గొప్ప అందమైన  అనుభూతిగా మిగిలి పోతుంది.  నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. మానావాళి కి భగవంతుడు ఇచ్చిన వరం. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుత వరం. 



    23 ఆగస్టు, 2011

    అన్ని మతాలూ, కులాలూ ఒకటే

    అన్ని మతాలూ, కులాలూ ఒకటే

             ప్రతి మతంలో కొన్ని మంచి చెడులు ఉంటాయి. అంత మాత్రాన ఈ మతం చెడ్డది, ఆ మతం చెడ్డది అంటూ ఒకరి నొకరు దూషించు కొంటున్న సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. మానవత్వం అనే సద్గుణాలు లేని ఏ మతం యేదైనా సంస్కరించబడాల్సిందే. మంచి యే మతంలో వున్నాస్వీకరించడం నేర్చుకుంటే మానవజీవితం ఎంతో సాదించి నట్టే. మతాలను దూషించడం అనేది ఒక సంస్కార హీనతను సూచిస్తుంది. ఎవరైనా కానీ మతాలను, కులాలను దూషించడం అనేది అంత సరియ్యినది కాదు. మనమంతా మనుషులం. మానవత్వమే మన మతం అని గుర్తుంచుకోవలసిన అవసరం  వుంది. 

                  ఎంతో మంది మత సామరస్యానికి పాటుపడుతున్నారు, శ్రమిస్తున్నారు వాళ్ళు చెప్పేది ఏమంటే, నిజానికి ఎ మతానికి చెందినా వాడయిన ఇతరుల మతాలను ద్వేషిస్తూ వుంటారో అటువంటి వారు వారి వారి మతాలకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. నిజమైన ఆధ్యాత్మికత లో పరమత సహనం వుంటుంది, నిజమైన విస్వసకులు తమ తమ దైవం యెక్క ఆనంద స్వరూపాన్ని,  ఉత్తమ గుణాలను, సహనశీలతను, దయ, కరుణ, ప్రేమ, మహిమలను గూర్చి తెలుసుకోవడానికి గాని తలవడానికి గాని చెప్పడానికి  అతనికి సమయం సరిపోదు, ఇంక ఇతర మతాలని గాని వారి ఆచారాలను గాని విమర్శించే తీరిక ఎక్కడిది. తాను నమ్మిన భగవంతుడిని పక్కకు పెట్టి ఇతర మాతా లను దూషించటం, ద్వేషించటం వారికీ సరిపోతుంది. అలాంటి మతోన్మాదుల నుంచి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మన అందరికి ఎంతయినా వుంది.
    మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.       

                                  స్వర్గం ఇక్కడే వుంటుంది. పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం. హిందూ, ముస్లిం, క్రిష్టియన్ భాయీ భాయీ. ఇంత కన్నా మానవజాతి సదిన్చాలిసిన గొప్ప ప్రగతి నాకు తెలిసి ఏది లేదు.
    మీరు ఈ క్రింది చిత్రాల్ని చూడండీ.



      ఈ పైన ఊన్న చిత్రం  muziboo.కం నుండి సేకరణ

    సర్వేజన సుఖినోభవంతు

    ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23

    పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...

    శాంతి నేలకోనుగాక !

    భూమి లో శాంతి నేలకోనుగాక ! అంతరిక్షం లో శాంతి నేలకోనుగాక ! ఆకాశం లో శాంతి నేలకోనని. నీటిలో శాంతి నేలకోనుగాక ! మూలకాలలో ( మూలికలలో ) శాంతి నేలకోనుగాక !
    చెట్టు చేమలలో శాంతి నేలకోనుగాక ! దేవతలందరూ నాకు శాంతిని ప్రసాదిస్తారు గాక ! ప్రతి ఒక్కరికి దేవతలు శాంతిని అనుగ్రహిస్తారు గాక ! శాంతి లో సకల ప్రాణులు శాంతి పొందు గాక !
    ఈ నానా విధ శాంతులు మూలంగా నాకు మరియు అందరికి మంగళం ఒనగూరు గాక ! వాటికీ మంగళం ఒనగూరు గాక ! సమస్తమూ మనకు మంగళమును ప్రసాదించు గాక !. సమస్తానికి మంగళం ఒనగూరుగాక.

    ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

    సర్వేజనః సుఖినో భవంతు

    సర్వేజనః సుఖినో భవంతు, MAY ALL BEINGS BE HAPPY, MAY THE WHOLE WORLD BE HAPPY

    అహం బ్రహ్మసి

    The peace (Shanti) that resides in the solar world (Dyauh), in space (Antariksha), in the earth (Prithwi) and elemental waters (Rapah),
    nourishes the herbs, fruits and grains (Roshadhayah) thereby nourishing the original power (Om) in all beings (Vishvedevah).
    May the peace of the whole (Brahma) now and forever more (Sarvagwam) come into us, we pray. May the highest good prevail.

    Om Shanti Shanti Shanti (Peace Peace Peace) .సత్యం నిత్యం అనంతం

    Peace

    tranquilness, Peace, peace, peace shanti shanti shanti !

    May all people be happy

    May all people be happy
    May all people be happy

    వినాయక చవితి శుభాకాంక్షలు

    వినాయక చవితి శుభాకాంక్షలు
    వినాయక చవితి శుభాకాంక్షలు

    వినాయక చవితి శుభాకాంక్షలు

    వినాయక చవితి శుభాకాంక్షలు
    వినాయక చవితి శుభాకాంక్షలు

    SRI PADAVALLABHA

    SRI PADAVALLABHA
    SRI PADA RAJAM SHARANAM PRAPADYE

    NEE JEEVITANIKI

    NEE JEEVITANIKI

    SUVISHALAM IDAM VISWAM

    SUVISHALAM IDAM VISWAM

    SRI GURU RAGHAVENDRA

    SRI GURU RAGHAVENDRA

    SRI RAMAKRISHNA PARAMA HAMSA

    SRI RAMAKRISHNA PARAMA HAMSA

    JAI GURU DATTA

    JAI GURU DATTA
    SRI GURU DATTA

    JAI GURU DATTA

    JAI GURU DATTA

    Trident

    Trident
    Trident