అన్నమో రామచంద్రా అంటూ ఆకలి మంటలతో విల విల పోయేవాళ్ళు భారత సమాజం లో ఎంతో మంది వున్నారు, భారత దేశం పుణ్య భూమి అలాగే కర్మ భూమి కూడా ! మీరు మీ ప్రాంతాలను బాగా గమనిచండి అక్కడక్కడ అన్నం యచించడానికి కూడా శక్తి లేని వాళ్ళు వున్నారు. అటువంటి వాళ్ళు మీ దృష్టి కి వస్తే గనుక మీ శక్తి కొలది వారికీ ఆ రోజు ఆహారాన్ని ఏర్పాటు చెయ్యండి, నా దృష్టి లో నిజమైన పరమాత్మా సేవ ఇదే, మహా దానాలలో అన్నదానం అత్యంత శ్రేష్ఠ మైనది, ఆ తరువాత జ్ఞానదానం, ప్రముకంగా చెప్పుకోవాలంటే అన్నదానం అత్యంత పవిత్ర మైన కార్యము.
మనకు తెలియని గొప్ప దయ కలిగిన వ్యక్తులకు కూడా ఈ పుణ్య భూమి లో కొదవ లేదు.
చాలామందికి తెలియని గొప్ప గొప్ప దాతలు ఎంతో మంది వున్నారు.
శ్రీ మహా భాగవతం లో ఒక రాజు గురించి ప్రస్తావించారు అతను ఎవరో కాదు రంతి దేవుడు. అయన కు దాన గుణం ఎక్కువ అతని అంతటి దాన గుణ శ్రేష్టుడు ఎవరు లేరని ప్రతీతి, అతను రాజ్య పరిత్యాగము చేయవలసివచ్చింది. అతను అడవి లో సన్యాసి జీవితం గడుపుతుంటాడు.
అతను 48 దినములుగా ఆహారం దొరకక నకనక లాడుతుంటాడు, సత్య దేవుడికి అతనిని ఇంకా పరీక్షించాలి అని అతనికి కొంత ఆహారం లభ్యం అయ్యేట్టుగా చేస్తాడు, ఆహారం అతనికి లభించే సరికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది, శక్తి కూడ దీసుకొని ఆహారాన్ని సమీపిస్తాడు, దాన్ని ఆరగించుదాం అనుకుంటుండగా ఒక పేదవాడు ఆకలితో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు, అతను ఆ అన్నం తీసుకొని తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. అప్పటికే అతనికి శక్తి క్షీణించింది. అతని శరీరం ఆణువణువూ ఆహారం కోసం తపిస్తుంది. అతను ఆ అన్నం తీసుకొని నోటిలో పెట్టు కొంటుండగా ఆ సమయానికి ఒక కుక్క అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం ఎదురు చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది అనుకుంటు స్పృహ కోల్పోతాడు. మరుక్షణమే సత్య దేవుడు అక్కడ ప్రత్యక్షమై అతనికి మోక్ష ప్రాప్తిని కలుగ జేస్తాడు.