బర్బరీకుడు ఒక సిద్ధ యోగి
బర్బరీకుడు మహాభారతములో ఘటోత్కచుడు, మౌరి ల కుమారుడు.భీమునకు మనవడు
అవుతాడు, తన తల్లి అయిన మౌరి దగ్గరే అన్ని అస్త్ర, శస్త్ర విద్యలు నేర్చినాడు, దేవతలు ఇతని అస్త్ర శాస్త్ర విద్య పట్ల వున్న ఆసక్తిని, పట్టుదలను చూసి మూడు అమోఘమయిన బాణాలను ప్రసాదిస్తారు, మొదటిది శిక్షించ వలసిన వారిని, రెండవది రక్షించ వలసిన వారిని , మూడవది శిక్షను అమలు చేసేది, వీటితో అతని కి ముల్లోకాలలోను ఎదురు అనేది ఉండదు. కురుక్షేత్ర యుద్ధము జరుగబోతోంది అని తెలిసి తన తల్లి దగ్గర ఎవరైతే బలహీనులో వారి పక్షాన యుద్ధము చేస్తానని ప్రతిన పూనుతాడు, పాండవులు బలహీనులని వారి పక్షాన యుద్ధము చేయుటకు బయలుదేరుతాడు, శ్రీకృష్ణ పరమాత్మకు బర్బరీకుని గురించి బాగా తెలుసు, బర్బరీకుడు యుద్ధానికి దిగితే కురు, పాండవులు ఇరువురు మిగలరు, బర్బరీకుని యుద్ధరంగమున రాకుండా నిలువరించాలి, శ్రీ కృష్ణుడు బ్రాహ్మణుని వేషములో బర్బరీకుని ప్రయాణ మార్గములో తారస పడి అతనిని నిలువరిస్తాడు, బర్బరీకుని మాటలతో రెచ్చగొట్టి అతని అస్త్రవిద్యను ప్రదర్శించ మని అడుగుతాడు అప్పుడు బర్బరీకుడు అక్కడే వున్న రవి చెట్టుపై ప్రయోగానికి సిద్ధము అవుతుండగా, శ్రీకృష్ణుడు చెట్టు ఆకు ఒకటి తన కాలికింద కనపడకుండా దాచి పెడతాడు, బర్బరీకుడు బాణ ప్రయోగము చేస్తాడు, చెట్టుపై ప్రతి ఒక్క ఆకుకు రంధ్రము పడుతుంది, శ్రీకృష్ణుడు తన కాలు వెనక్కి తీసుకొనగా తన కాలి కింద వున్న ఆకుకు కూడా రంధ్రము పడి ఉంటుంది, అతని అపార అస్త్ర శక్తిని ప్రశంసించి, బర్బరీక నీవు బల హీన పక్షాన నిలబడి పోరాడాలని బయలుదేరావు, నీవు ఏ పక్షాన నిలబడి యుద్ధము చేస్తే ఆపక్షము బలవంతము అయి మరొక పక్షము బలహీనమై, మరల నీవు ఆ బలహీనమయిన పక్షాన నిలబడి యుద్ధము చేస్తే ఇరుపక్షాలు కూడా చివరికి నశిస్తాయి అని జరగ బోయే ప్రమాదము గురించి వివరిస్తాడు, తన ప్రతిజ్ఞ నాశనానికి దారి తీస్తుందని గ్రహించిన బర్బరీకుడు తనకు ఈ విషయము ఎరుక పరచడానికి బ్రాహ్మణ వేషములో వచ్చినది శ్రీకృష్ణ పరమాత్మయని తెలుసుకొని శ్రీకృష్ణుని పాదాల మీదపడి మార్గోపదేశం చేయమని ప్రార్థిస్తాడు, చేసిన ప్రతిజ్ఞ నుండి బయట పడాలంటే సర్వ సమర్పణ ఒక్కటే మార్గమని శ్రీ కృష్ణుడు చెపుతాడు, సర్వ సమర్పణ అంటే తనను తాను అర్పించుకోవడం, తనను తాను అర్పించుకుంటే అక్కడ కర్తృత్వ , భోక్తృత్వాలు నుండి సాక్షిగా నిలబడటం జరుగుతుంది.
ఈ బర్బరీకుడే కురుక్షేత్ర యుద్ధానికి సాక్షిగా నిలిచినాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవుల మనోస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు పాండవులను బర్బరీకుడి దగ్గరకు తీసుకవెళతాడు బర్బరీకునితో తమ శౌర్య పరాక్రమాలు గురించి పాండవులు చెప్పుకోగా బర్బరీకుడు నవ్వుతాడు, అతని నవ్వుకు కారణము ఏంటని అర్జునుడు అడుగగా, బర్బరీకుడు ఇలా సమాధానము చెపుతాడు, మీరు మీ పరాక్రమముతో గెలిచామని సంబర పడుతున్నారు కానీ యుద్ధరంగములో ఒక్క శ్రీకృష్ణుడే ప్రతి ఆయుధము తానై, కౌరవులను, కౌరవసేనలను శ్రీకృష్ణుడు ఒక్కడే సంహరించాడని, యుద్ధరంగమున నాకు శ్రీకృష్ణ పరమాత్మా ఒక్కడే కనిపించాడని చెపుతాడు. కురుక్షేత్రములో బర్బరీకుడు తనను తాను శ్రీ కృష్ణ పరమాత్మకు సమర్పించు కున్నాడు.
బర్బరీకుడు - ( ఖాటు శ్యాము బాబా ) ఆత్మవిద్య
బర్బరీకుడు - ( ఖాటు శ్యాము బాబా ) ఆత్మవిద్య
........ ఇంకావుంది