యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం
మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్ మ్యాపింగ్ )
సమీక్ష కొనసాగుతున్నది :
ఆ దేశములోని అత్యంత
ప్రముఖ ధనవంతులలో ఒకడు అయిన ఒక వ్యక్తి, తన కుమార్తె వివాహము ఆ
దేశములోనే వినూత్నముగా జరిపించాలని అనుకున్నాడు, ఆ
వివాహానికి ఆహ్వానించ బడిన వారికి వారు జీవించినంత కాలం గుర్తుండే విధముగా ఒక మంచి
అనుభూతి కలగాలని భావించి ఇంద్రజాలములో
ఖ్యాతి గడించిన ఒక ఇంద్రజాలికుడిని సంప్రదించి తన ఆలోచనను అతనికి తెలియజేసాడు, ఆ
ఇంద్రజాలికుడి సామర్థ్యము ఎటువంటిది
అంటే ప్రేక్షకులను క్షణాల్లో మంత్ర ముగ్దులను చేయ గలిగే నిపుణత అతనిది, పట్ట
పగలు నక్షత్రాలు చూపగలిగే దిట్ట, ఆ ధనవంతుడి అభిష్టము
ప్రకారము తన వద్ద ఒక గొప్ప రచన ఉన్నదని అయితె తన యొక్క ప్రదర్శనను సామాన్య వేదిక మీద కాకుండా
ఒక ఉద్యానవనములో తాను సూచించిన విధముగా ఉండాలని అందుకు అనేక ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని, అందుకు
తన యొక్క సహచరుల సహాయము తీసుకొమ్మని వివాహానంతరము
రోజు ఆహ్వానితులకు ప్రదర్శనను ఉద్యానవనములో
ఏర్పాటు చేయవలసి ఉంటుందని ఆహ్వానితులను విడివిడిగా ఉద్యానవనము లోపలికి తీసుక
రావలసిందిగా సూచించాడు.
ఆ ధనవంతుడు
అనుకున్నట్లుగానే ఆహ్వానాలు దేశములోని ప్రముఖులకు, బందువులకు, మిత్రులకు అతనికి కావలసిన ముఖ్యమైన వ్యక్తులకు అనుచరులకు అందరికి
ఆహ్వానాలు చేరినాయి. ఆ శుభ గడియలు
రానే వచ్చాయి, ఎంతో కోలాహలముగా వివాహము జరిగింది.
పెళ్లి మరుసటి రోజు
ప్రదర్శన మొదలయింది, ఇంద్రజాలికుడు సూచించిన విధముగా ఒకొక్కరిని ఆ ఉద్యానవనములో
పలికి ఆహ్వానింప బడుతున్నారు, అందరిలాగా ఆ ధనికుడు కూడా ప్రదర్శనను తిలకించడానికి
వచ్చాడు, ఆ ద్వారము దగ్గరికి ప్రవేశించగానే ఇంద్రజాలకుని సేవకులు ఆయనను లోపలికి
ఆహ్వానించారు, లోపలికి ప్రవేశించగానే ఆయన కనుచూపు మేరలో అత్యంత విశాలమయిన, బారీ
ఎత్తు గల చిత్రపటం కానవచ్చినది, ఆ చిత్ర పటములో అందమైన పూల తోట, బారీ వృక్షాలు,
ఎన్నో రకాల పండ్ల చెట్లు, ఎత్తయిన కొండలు, జలపాతాలు, చిన్న చిన్న సెలయేర్లు,
అందమైన భవంతి అక్కడ అక్కడ ఆకాశములో మేగాలు, ఆ మేగాల చాటున సూర్యుడు, సూర్యుని
కిరణాలు అక్కడ వుండే సరస్సులలో ప్రకాషిస్తున్నట్లు ఎంతో సజీవముగా కానవస్తున్నది, ఆ
చిత్ర పటము ఎంతో అద్బుతముగా
చిత్రీకరించినట్లు గోచరమౌతున్నది, ఆ చిత్ర పటలము దగ్గర అవుతున్న కొద్ది అతనికి ఆనందము,
ఆశ్చర్యము అవుతున్నది, ఈ చిత్రాన్ని ఏ చిత్రకారుడు గీసేనో అని ఆ చిత్రకరుడను
ప్రశంశిస్తు ఆ చిత్రానికి మరింత చేరువ అవుతున్నాడు, అచిత్రము చేరువవుతున్న కొద్ది
ఆ చిత్రములోని వృక్షాలు, కదులుతున్నట్లు మరి కొంతదూరములో జలపాతములో ప్రవాహము కాన
వచ్చినది, మేగాలలో కదలికలు కనపడ్డాయి, ఆయన ఆశ్చర్యమునకు అవధులు లేవు ఇది నిజామా
అనుకొంటు ముందుకు సాగుతున్నాడు, వాటికీ దగ్గర అవుతున్న కొద్ది ఆ చిత్రము కాదు ఇది
వాస్తవముగా వున్నది, దూరము నుంచి ఇది ఒక చిత్రము లాగా అనిపించినది అన్న బావన ఆయనకు
కలుగుతున్నది, మొదటగా అక్కడ అందమయిన అనేక పుష్పాలు ఆయనకు దర్శన మిచ్చాయి,
అద్బుతమయిన పుష్ప సుగందాలు ఆయనను ఎంతో ఉత్తేజ పరుస్తున్నాయి, ఆ పుష్పాల తోటలో
కాసేపు విహరిస్తూ ఆ సుగంద పరిమళాలను ఆస్వాదిస్తు, వాటి అందాలను తిలకిస్తూ ముందుకు
సాగుతున్నాడు, ఆ తోటను దాటుకొని, అందమయిన సెలయేళ్ళు, వాటి ప్రక్కన అనేకనేక్ పండ్ల
చెట్లు అగుపించాయి, ఆ పండ్ల చెట్లను చూడగానే వాటిని తినాలనే భావన ఆయనకు కలిగింది,
వెంటనే నారింజ పండ్ల చెట్టు నుండి కొన్ని పండ్లు తెంచుకొని తిని చూడగా అబ్బబ్బ
ఎంతో పులుపు, నోరంతా పూల్లగ, అక్కడే వున్న మామిడి పళ్ళు తెమ్పుకొని ఒకటి తిన్నాడు,
ఎంతో తియ్యదనం , కడుపు నిండా రక రకాల
పండ్లు అరగించాడు, ఆరగించిన తరువాత కాస్త విశ్రాంతి తీసుకొన్నాడు, ఆకాశం మేఘావృతము
అయ్యింది చల్లని గాలులు ఆయనను ఎంతో ఆహ్లాద పరచినాయి, అలా కాస్తా ముందుకు వెళ్ళాడో లేదో వర్షం మొదలయింది, వర్షము
వెలసిన తరువాత ఆయన కొంత దూరములో వున్న అందమయిన కొండల సముదాయము కానవచ్చినది, ఆ
కొండలలోనుంచి అక్కడక్కడ జల పాతాలు కానవచ్చినాయి, ఆ కొండల దగ్గర ఒక సుందరమయిన భవంతి
అయన దృషిలో పడింది, ఎంతో సుందరముగాను, ఆకర్షణీయముగా కనపడుతున్నది, ఆ భవంతిని
సందర్శించాలని కోరిక కలిగింది, అనుకున్నదే తడువుగా ఆ భవంతి వద్దకు వెళుతున్నాడు. భవంతి దగ్గర అవుతున్న కొద్ది ఆ భవంతి సామాన్య
మనవ కట్టడము కాదు దేవతలు నిర్మించినదా అన్న భావన ఆయనలో మెదలుతుంది. భవన సమీపము అత్యంత
రమణీయముగా వున్నది, అప్పుడే వాన వచ్చి వెలసి ఉండడము వాతావరణము ఎంతో ఆహ్లాదముగా
వుంది, ఆ భవనములోనుంచి మంచి సంగీతమ్ ఎంతో ఆనందముగా వినసొంపుగా వినిపిస్తుంది, ఆ
సంగీతం తనను మై మరిపించే విదముగా వున్నది, ఆ భవన ప్రదాన ద్వారము దాటుకొని కాస్తా
ముందుకు వెళ్ళగా ఒక అద్దాల మండపము కాన వచ్చినది, అద్దాల మండపములోనికి
ప్రవేశించాడు, అనేక రకాల ఆకృతులతో, అనేక రకాల పరిమాణాలతో అద్దాల మండపము ఎంతో
గొప్పగా కానవస్తున్నది, అద్దాల మండపములో తన యొక్క ప్రతిబింబము, అనేక రకాల
ఆకృతులలో, రకరకాల పరిణామాలలో అయన యొక్క ప్రతిబింబము ప్రతిపలిస్తున్నది, ఒక అందమయిన
పసి బాలుని ఆకృతితో కూడిన అద్దము ముందు ఆ ధనికుడు నిలబడినాడు, అద్బుతం, ఆశ్చర్యము
తన ఎదురుగా ఒక చిన్న పసిబాలుడు అందులో కాన వస్తున్నాడు, బాగా ఆ అద్దాన్ని పరికించి
చూడగా అందులో కాన వచ్చే ఆ పసిబాలుని ఆకృతి అచ్చము తన పసితనములోని తన యొక్క రూపము
లాగే కాన వస్తున్నది, ఆలాగే ఏడు, ఎనిమిది సంవత్సరాల బాలుని ఆకృతితో మరొక అద్దము
వద్ద నిలబడగా అక్కడ తాను ఆ సంవత్సరములలో తాను అలాగే ఉండే తన చిత్రము గుర్తుకు
వచ్చినది, ౧౪ 14 సంవత్సరాల నూనూగు మీసాల
వయస్సులో మరొక ఆకృతి గల అద్దములో
అవయస్సులోని తన రూపాన్ని చూచాడు, యుక్తవయస్సులోని యౌవకుని ఆకారములో వున్న ఆకృతి
దగ్గర నిలబడగా ఆ వయస్సులో యువకుడిగా తాను ఎలావుండే వాడో అవిదముగా తన యొక్క
రూపాన్ని చూచుకొన్నాడు, మిగతా వాటి మాదిరే ఇందులో కూడా ఆయనకు కేవలము కనపడడము కాదు
తాను ఏవిదముగా తన కదలికలు కలవో అదేవిదముగా ఆ అద్దములో ప్రతిబింబించే తన రూపము కూడా
ఆయా వయస్సులో కాన వస్తున్నది, ఆ
వయస్సులోని సజీవత్వము అందులో దర్శనమిస్తున్నది. మరొక ఆకృతి వద్ద నిలబడగా తన
ప్రస్తుత సహజ బింబము అందులో కాన వస్తున్నది, ప్రక్కన చివరిగా మానవాకృతిలో ఒక
అద్దము చూడగా వృద్దాప్యము లో తన రూపము చూసుకొన్నాడు, తన జీవితములో ఇటువంటి అద్దాల మండపము గురించి
ఎన్నడు కనీసము వినను కూడా వినలేదని, ఎంతో ఆశ్చర్యముకు లోనయినాడు, ఆ అద్దాల
మండపములోనుంచి ఆభవనము లోపలి ప్రదాన విశాల మయిన కార్య మండపము లోనికి వచ్చాడు,
అక్కడికి రాగానే అక్కడ వున్న శిల్ప కళలకు ఎంతో సంతోషిస్తూ ఆ భవనపు ఫై అంతస్తుకు చేరుకొన్నాడు
అక్కడ ఏకాంత మండపములో ఎవరో సంచరిస్తున్న అలికిడి కావడముతో ఇక్కడ తాను కాకుండా ఇంకా
ఎవరో వున్నట్లు గ్రహించి వారిని చేరుకోవాలని ఏకాంత మండపములోనికి ప్రవేశించాడు,
ఏకాంత మండపములోని బాల్కనిలో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఏవో మాట్లాడుకుంటున్నట్లు
అనిపించి వారిని సమీపించడానికి అక్కడికి చేరుకొన్నాడు, అక్కడ వారు ఇద్దరు ఆ రోజే వివాహము అయిన నవదంపతులు అని ఆయనకు
అర్థము అవుతున్నది, వారిని పలకరించాలనే ఆసక్తి తో వారి సమక్షమునకు వచ్చాడు, అయితే
ఇతని రాకను వారు ఏమాత్రము గమనించ లేదనుకుంటాను, ఆ నవదంపతులకు అత్యంత సమీపమునకు
వచ్చాడు, వారిని చూడగానే ఆయనకు ఆనందముతో వుబ్భి తబ్బుబి అయిపోతున్నాడు. ఆనందాశ్రవులు
ధారాపాతముగా కారుతున్నాయి, అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యినాడు, ఆ నవ దంపతులు ఎవరో కాదు తనకు జన్మనిచ్చిన తల్లి
తండ్రులు. అయితే ఆ నవ దంపతలకు ఇతని ఉనికి ఏమాత్రము తెలియటములేదు.
....................సమీక్ష కొనసాగుతున్నది.