శ్రీరామ
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 6
20-04-2017
సమాజము లో నుండి మనకు అనేక రకాల విమర్శలు కాని పొగడ్తలు కాని అవమానములు కాని రాజపూజ్యములు లాంటి అనేక రకాల అనుభవాలు ఎదురు అవుతుంటాయి సాధారణంగా అవి మన అహంభావము మీద పనిచేస్తాయి, ఇతరుల విమర్శలు మనస్సు యందు గుచ్చుకొన్నప్పుడు మనకు భాధ అవుతుంది అదే పొగడ్తలు అయితే ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఏ విషయమయిన మనస్సును తాకి నప్పుడు తదనుగుణ స్పందన మనలో కలుగుతుంది,ఈ రెండు సాధకుడికి లేదా భక్తుడికి ఆటంకములే రెండిటి యందు సమధృష్టి కలిగి లేదా ఆరెండు విషయమునందలి తటస్థన్గా వుండి తమ సాధన తాము కొనసాగించడమే, అవసరము మేరకు వాటి యందు తగు స్పందన కలిగి ఉంటూనే లౌకిక విషయాల యందు తమ కర్తవ్యమును నిర్వహిస్తూనే పరమాత్మ యందు మనస్సును నిమగ్నము చేయాలి లేదా ఆ పరమాత్ముని లేదా గురువు యందు సంపూర్ణ శరణాగతి చెందాలి.
మన భారత దేశమును అనేక మంది రాజులు పరిపాలించారు అయితే ఆయా రాజులు తమ పరిపాలనా సౌలభ్యము కోసము ఎవరికి వారు బిన్నంగా తమ రాజధానులను ఏర్పరచుకున్నారు, తమ లక్ష్యాలకు అనుగుణంగా ఏక కేంద్రీకృత పరిపాలన, సామంత రాజ్య పాలనా విధానాలను కేంద్రాలను ఏర్పాటు చేసుకొన్నారు, అలాగే భక్తులు సాధకులు కూడా పరమాత్మని కేంద్రగా చేసుకొని తమ మనస్సులను పరిపాలించుకోవాలి, అప్పడు అంతఃకరణం ( మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము )లు సామంతులు గా అవుతారు, సామంతులు అంటే తమ ఇచ్చ్చా పూర్వకంగా పరిపాలించకుండా తమ యొక్క రాజు లేదా చక్రవర్తి యొక్క అజ్ఞాలనే పాటిస్తూ ఉంటాడు నాది అనేది ఉండదు, కేవలము అధికారము, కర్తవ్యములు ఉంటాయి, అలాగే సాధకుడు లేదా భక్తుడు భగవంతుని తమలో ప్రతిష్ట చేసుకొని పరిపాలన చేస్తే మన అంతః కరణము శుద్ధమై మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారములు భగవంతుని సామంతులుగా అవుతాయి, అహంకారము ఉండదు, సామంతుల పోషణ రక్షణ అంతా చక్రవర్తి చూసుకొన్నట్టు ఆ పరమాత్మయే తమ భక్తుని పోషణ, రక్షణ కల్పిస్తాడు. ఇక్కడ కర్తవ్యము ఉంటుంది కాని నేనే కర్తను అని ఉండదు, నేను చేస్తున్నానని అహంభావం ఉండదు, ఉదాహరణకు భక్త ప్రహ్లాద. పరమాత్ముని యందు మనస్సును కేంద్రీకరించాలి ఆలా కేంద్రీకృత మయిన మనస్సు శుద్దము అవుతుంది, పరమాత్ముడు మనలో ప్రకాశిస్తాడు, మన అందరి మనస్సులు ఆ పరమాత్ముని యందు, సద్గురువు యందు లగ్నము అవుగాక. మన అందరికి పరమాత్ముని, గురువు యొక్క అనుగ్రహము కలుగు గాక.
ఇట్లు
మీ ఆత్మీయ బంధువు.
( ఈ చరా చర జగత్తులో పరమాత్మయందు భక్తి వున్న
ప్రతి ఒక్కరు ఆత్మీయ బంధువే )