పరమాత్మా వైపా! ప్రపంచము వైపా !
కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయము అర్థించడానికి ఇరువురు వస్తారు, ఆ ఇరువురు తనకు కావలసిన వారే బంధువులే కనుక ఇరువురికి సహాయముచేస్తానని మాట ఇస్తాడు, అయితే పరమాత్మా ఒక ప్రతిపాదన చేస్తాడు, ఇక్కడ పరమాత్మా తన నుంచి సహాయాన్ని అర్థించిన ఇరువురికి లభించేట్టుగా తన సహాయాన్ని రెండు రకాలుగా విభజించాడు. మొదటిది తన యొక్క సమస్త సైన్యము ఒక వైపు , {ఒక భాగము }, రెండవది తాను ఒక్కడు ఒక వైపు అయితే తనను కోరుకునే వారికీ ఒక షరతు పెట్టాడు, యుద్దములో తాను యుద్ధము చేయను, అస్త్రము పట్టను ఇది షరతు! దీని ప్రకారము నీకు ఏది కావాలో నిశ్చయించుకో మని ఇరువురి ముందు ఈ ప్రతి పాదన చేసి ముందుగా సహాయాన్ని అడిగే అవకాశము కూడా అర్జునుడికి ఇచ్చినాడు. ఎందుకంటే ఆ సందర్బములో పరమాత్మా ముఖ్యముగా అర్జునుడిని పరీక్షించాలి అన్న భావముతో, అర్జునుడి మనోదృక్పథము తెలుసుకొనుటకు. ఈ అవకాశమే అర్జునుడికి అసలయిన పరీక్ష, (అర్జునుడి యొక్క పారమార్థిక దృష్టిని ప్రపంచానికి తెలియజేయటము కొరకు. ) అర్జునుడు తనను కోరుకుంటాడు లేదా తన యొక్క అపారమయిన సైన్యాన్ని కోరుకుంటాడ ! కానీ అతను అర్జునుడు కనుక శ్రీ కృష్ణుడునే కోరుకున్నాడు కృష్ణుని అపార మయిన సైన్యముతో తనకు అవసరము లేదని అంటాడు. దుర్యోధనుడు ( భౌతిక దృష్టి ) తనకు అపారమయిన శ్రీకృష్ణుని సైన్యము లబించినందుకు ఎంతో సంతోషించాడు.
ఈ సమస్త జగత్తు అంతయు పరమాత్ముని సైన్యము, వస్తువిషయాదులన్నీ కూడా పరమాత్మా యొక్క సైన్యమే అయితే అవి నశ్వరమైనవి, అశాశ్వత మైనవి, పరమాత్మా మాత్రమే సత్యము, శాశ్వతడు, సత్యస్వరూపుడు, నిత్యానందస్వరూపుడు, శాశ్వతమైన పరమాత్మాను పొందాలనుకొంటే ప్రపంచము నుండి అంటే ప్రపంచ వస్తు విషయాదుల పట్ల విముఖుడై పరమాత్మా యొక్క స్మరణలో ఉండాలి.
(........ఇంకావుంది)