యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం
మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్
మ్యాపింగ్ )
సమీక్ష కొనసాగుతున్నది :
యోగ వాశిష్ఠ
హృదయము – లవణో పాఖ్యానం నకు ముందుగా మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్ మ్యాపింగ్ ) అనే అంశాన్ని
సమీక్షిస్తున్నాము. లవణో పాఖ్యానం మనకు అర్థము కావడానికి ఈ సమీక్ష తోడ్పడుతుంది. ఇందులోని అంశాలు కొన్ని రిపీటేడ్ గా ఉన్నప్పటికి ఒక మంచి అవగాహన కొరకు ఈ వివరణ తప్పని సరి అయినది.
యావత్ జగత్ మాయా
మోహిత బ్రహ్మ యొక్క ఒక కల్పన అని అనుకుంటే ఆయన అనేకానేక అంశాలుగు ఉపాదులుగా
వ్యక్తమవుతూ వాటి యందు అసత్తు (ఉపాధి గత బెదాలతో ) తో రమిస్తూ అనేక కల్పనలను రచిస్తూ జగత్ గా అనేక ఉపాధి గత
బేదాలు గల జీవ సమిష్టి గా, జీవులుగా
ప్రకటితమయి జీవ బ్రాంతి తో మాయా బద్దుడై వున్నాడు. సమిష్టి జీవుడి యొక్క మాయా
సంసారం గురించి తెలుసుకోవాలంటే, అవగాహన చేసుకోవాలంటే, ముందుగా వ్యష్టి జీవుడిగా మనము ఎటువంటి కల్పనలకు, బందాలకు, భావాలకు, ప్రభావాలకు, ప్రలోభాలకు లోనై ఉన్నామో
తెలుసుకొందాం, మన యొక్క నిత్య జీవితములో ఎన్నో అంశాలు మనలను అవాస్తవ స్తితులలోనికి గురిచేస్తుంటాయి, ఇందులో మన యొక్క మానసిక బావనలు, ఆలోచనలు
మనము గ్రహించే విషయాలు, స్వతంత్రముగా మనలో ఏర్పరచుకొనే లేదా భావన చెందే విషయాలు
వాస్తవానికి బిన్నముగా ఉండవచ్చు, కొన్ని అంశాలు మనము కల్పన చే సుకొన్నవైతె మరి
కొన్ని మన చుట్టూత వుండే సమాజము నుంచి మనకు కలిగేవి లేదా ఏర్పడేవి. సహజముగా
మనసుతోనే అనేక బ్రమ కల్పిత అంశాలు ముడి పడివున్నాయి, జీవుడు తన యొక్క దేహబిమానముతో
పాటు బౌతికముగా, మానసికముగా ఏర్పరచుకొనే బందాలు అనేకము, అవి బార్యా, పుత్రుల
యందు బంధు బాంధవులు, మిత్ర, సపరివారమందు
అనేక వస్తు విషయముల యందు ఏర్పరచుకొన్న ఇవన్నీ నేను అనే అహంకార భావన నుండి కల్గిన బ్రాంతి
జనకములే.
మానసికముగా మనకుగా మనము కల్పించుకోన్నవి కొన్ని అయితే
మరికొన్ని ఇతరుల నుంచి ఏర్పడేవి మరి కొన్ని, అవి వారి వారి వ్యక్తీ గత మనోబవాలు కావొచ్చు లేదా ఇతరులచే
ప్రబావితము అయ్యేవి కావచ్చు, ఏదయినా గ్రహించే వాడి లేదా అనుభూతి చెందేవాడి మీద ఆయా
ప్రభావము ఉంటుంది. ఆయా విషయము యొక్క సత్యత్వము అది వాస్తవమా లేదా అవాస్తవమ అనేది
గ్రహించే వాడి ప్రజ్ఞ లేదా అతని యొక్క మేదస్సు పైన ఆధారపడి ఉంటుంది. ఈ విషయము మనకు ఇంకొంచెము బాగా అర్థము కావాలంటే
ఇది వరకు పోగొ టీవిలో (pogo tv
) Just For Laughs Gags ప్రోగ్రాము వచ్చేది, బహుశా చాలామందికి తెలిసేవుంటుంది,
ఇందులో విషయాలు ఎంతో ఆసక్తి కరముగా ఉంటుంది, ఈ ప్రోగ్రంమ్ యొక్క రూపకల్పన గురించి కొంత
అవగాహన చేసుకొందాం, ఎందుకంటే ఎదుటివారిని అంటే చూపరులను లేదా ప్రేక్షకులను
నవ్వించడం వీరి ముఖ్యవుద్దేశ్యం, అయితే వీరి యొక్క కల్పిత సన్నివేశాలు ఉద్దేశ్య
పూర్వకంగా చేస్తున్న సంగటనల తాలూకు విషయాలు ఏవి కూడా వారు లక్ష్యము చేసుకొన్న
వ్యక్తులకు తెలియదు, ఇతరులు కావాలని చేసిన ట్రాప్ అనితెలియక ఆయా సంఘటనలకు గురి
అయిన వ్యక్తులు ప్రతిస్పందిస్తారు, కొన్ని
సంగటనలు వారిని అనేక భావోద్వేగాలకు ఆశ్చర్యానికి, బయానికి, ఆనందానికి, అసహ్యతకు, కోపాన్ని, జాలిని, దయకు గురిచేస్తాయి,
ఇది అవాస్తవము అని తెలియక బ్రమలకు లోను అవుతారు, ఈ ప్రోగ్రాము రూప కర్తలు ఇది
యద్రిచ్చికంగా జరుగుతుంది అనేట్టుగా రూపొందిస్తారు, వాస్తవముగా జరగక పోయిన కొన్ని
కొన్ని సంగటనలు జరిగినట్టుగా బ్రమలకు గురి చేయడము, వాళ్ళకు కలిగే భావోద్వేగాలు,
ఆశ్చర్యములను తమాషాగా రూపొందించి ప్రేక్షకులకు చూపించడం ఈ ప్రోగ్రాం యొక్క
ముఖ్యవుద్దేశ్యము ఇక్కడ మనము ఈ విషయములో మనము గమనించ వలసినది ఏమిటంటే ఎలాగయితే Just For Laughs Gags కార్యక్రమ కర్తలు ఇతరులను మనో బ్రాంతి కి గురి చేసి ఒక సన్నివేశాన్ని ఏవిదముగా తయారు చేస్తారో అదేవిదముగా, సమిష్టి యొక్క మాయా కల్పన వల్ల వ్యష్టి జీవుడు సమిష్టి యొక్క మాయా కల్పనల వల్ల బ్రాంతి నొంది అశాశ్వతము, అసత్యము అయిన జగత్ యందు సత్యత్వ భావనతో చరిస్తూ సంసారము యందు పరిబ్రమిస్తున్నాడు. ఇతరుల కల్పన వల్ల గాని
లేదా స్వీయ కల్పనల వల్ల గాని అది ప్రదర్శన
గాని లేదా ఒక భావజాలము గాని తాను ఏర్పరచుకొన్న బందాల ద్వార, సామాజికముగా ఏర్పరచుకొన్న వస్తు విషయా దూల పట్ల సత్యత్వ బ్రాంతి కలగా చేస్తున్నదో అదే విదముగా ఇంకొంచెము వివరణాత్మకముగా చూస్తే మాయోపాది వలన వ్యష్టి జీవుడు మాయ మోహిత బ్రహ్మ
లేదా సమిష్టి బ్రహ్మ యొక్క రూప కల్పనలో మాయా మొహితుడు అయ్యి నేను అనే అహంకారానికి
బద్దుడు అయి ఇదే సత్తు అని వాస్తవమని బ్రమించి భవ బందాలలో ఇరుక్కొని సంసార
సాగరములో కాల చక్రములో కొట్టుమిట్టాడుతున్నాడు అని గ్రహించుటకు
కొంతవరకు ఈ సమీక్ష ఉపయుక్తము అని బావిస్తున్నాను.
మైండ్ మ్యాపింగ్
బ్రమ కల్పిత అనే అంశము అర్థము చేసుకోవడానికి Just For Laughs Gagsను సమీక్షించడము జరిగింది. వాస్తవానికి
ఇటువంటి Tv ప్రోగ్రాములు అంత సంస్కార వంతమయినవి కాదు అని అనిపిస్తుంది, ఎందుకంటే
ఎదుటివారి యొక్క భావోద్వేగాలతో ఉద్దేశ్య పూర్వకంగా ఆడుకోవడము నీచుల లక్షణము అని
మనకు ఎన్నో ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి, అది వారి యొక్క మానసిక దౌర్భల్యము లేదా
దుర్భలత నుంచి వ్యక్తమౌతున్నవి అనిచెప్పవచ్చు, బ్రమ కల్పిత మనస్సు గురించి
సమీక్ష మరింత లోతుగా తదుపరి పోస్టింగ్ లో కొనసాగిస్దాము.
......సమీక్ష
కొనసాగుతున్నది.