యోగ వాశిష్ఠ హృదయము – లవణో పాఖ్యానం
మాయా మోహిత, బ్రమ కల్పిత ( మైండ్
మ్యాపింగ్ )
ఒక విత్తనము మొలకేత్తి అచిన్న మొలక మహా వట వృక్షము
అవుతుంది, అదే విదంగా జీవుడు శైశవము నుంచి అతని ప్రస్థానము మొదలవుతుంది, శైశావములో
ప్రపంచ బావము ఇసుమంతయిన ఉండదు, క్రమ క్రమంగా అతను బాహ్య జగత్తు యొక్క అనేక రకాల
అనుభవాలతో, అనుభూతులతో, పరిచయమవుతున్న వస్తు విషయాలతో క్రమ క్రమంగా అతను వాటితో
మమేకము అవుతాడు, పాంచ భౌతిక దృశ్య ప్రపంచమే వాస్తవంగా బావన చెందుతాడు, బాహ్య
జగత్తు యొక్క జ్ఞానము, పొందిన అనుభూతుల ద్వార వాస్తవంగా భావన చెందుతాడు. తాను శరీర
ఇంద్రియముల ద్వార పొందుతున్న అనుబూతులు, మానసికంగా చెందుతున్న భావనలు సత్యములుగా
బావిస్తూ రాగ ద్వేషముల యందు అనురక్తి కలిగి వున్నాడు, అనేక బావజాలములను
ఏర్పరుచుకొని వ్యవహరిస్తుంటాడు, తాను పొందుతున్న అనుబూతులన్నీ పోగేసుకొని మైండ్
మ్యాపింగ్ లేదా మనో రూప కల్పన చేసుకొని అనుబవాలుగా, విషయ వాసనలుగా ఏర్పరచుకొని మాయా
సంసారమును కొనసాగిస్తుంటాడు.
మాయ చేత బాహ్య జగత్ యందు తనకు కలిగిన, ఏర్పరచుకొన్న
భావాలను వాస్తవముగా అనుబూతి చెందుతు తనకు కలిగిన మిద్యా జ్ఞానమును ప్రపంచము యందు
ఆరోపించుట (మైండ్ మ్యాపింగ్) జీవ
స్వభావమయి వున్నది, ఇదే విషయాన్ని
ఇంకొంచెము విపులముగా పరిశీలిస్తే సహజముగా ఒక వ్యక్తి తన యొక్క బావములతో, తాను
గ్రహించిన, పొందిన వివేక విజ్ఞానములతో, అనేక అనుభూతులతో కామ, క్రోధ, లోబ, మోహ, మద, మాత్సర్యాలకు లోబడి
పీడుతుడు అవుతున్నాడు. తనలో కలిగే అనేక భావాలతో వ్యవహరిస్తూవుంటాడు, తాను ఏ
బావములతో అయితే కలిగి ఉంటాడో ఆయా బావోద్వేగములు కలిగి వుంటాడు, అంతే కాకుండా ఇతరుల
రాగ ద్వేషములకు కూడా గురి అవుతూ వారి యొక్క ఈర్ష్య , ద్వేషముల లాంటి ధౌర్బల్యాది
మానసిక రోగముల ప్రబావములో పడుతున్నాడు, ఎవరయినా తనయందు ఈర్ష్య బావముతో మాట్లాడుతున్నప్పుడు
వారి యొక్క బావముతో తాను కలత చెందుతూ మదన పడతారు, ఇక్కడ సూక్ష్మముగా అర్థము
చేసుకోవలసింది ఏమిటంటే ఎవరయినా తమ యందు గాని ఇతర మయిన విషయముల యందు, రాజకీయ, కుల,
మత, వర్గ, ప్రాంత, వ్యక్తుల, ప్రాపంచిక విషయముల యందు రాగ ద్వేషములు కలిగి వికృత బావములు
రూపొందించుకొని వాటిని పులుముకొని వాటితో
కలత చెందుతూ ఇతరులయందు, తత్ సంబందిత వ్యక్తి యందు దౌర్బల్యమును
ప్రదర్శిస్తుంటారు, ఇది కూడా తత్ సంబందిత వ్యక్తీ కి ఇతర వ్యక్తులకు బ్రమను కల్పించే
విషయము. ఎవరయితే ఇతరులు తన యందు కలిగిన బావ దారిద్ర్యము, (అరిషట్ వర్గ ప్రేరేపిత
అసహ్యములు, మానసిక జుగుప్స ) ఉదాహరణకు తన యందు ఇతరులు వాస్తవానికి బిన్నముగా
ఈర్ష్య, ద్వేషములతో నిందించిన, వ్యక్త పరచిన వారి యొక్క బావముతో కలత చెందుట ఒక
బ్రాంతి కరమయిన చర్య అది వాళ్ళు అబిప్రాయము వారి యొక్క ప్రొజెక్షన్ వారి యొక్క
మనోవ్యాది కాని వాస్తవానికి నేను వారి యొక్క దురబిప్రాయము కాదు అని తెలిసి ఉండుట
మనో బ్రాంతి రహిత స్తితి, వారు నీ మీద తయారు చేసుకున్న, ఏర్పరచుకొన్న,
జుగుప్స అబిప్రాయముల యందు నీవు
పట్టించుకోని వారి మనో రోగమును నాది అని పట్టుకోవడమే, కలత చెందడమే, నీ మీద వారు తయారు
చేసుకొన్న
(Mind Maping) జుగుప్సా కరమయిన
బావములచేత వాళ్ళును వాళ్ళే పీడిన్చుకుంటూ
నీ యందు, ఇతరుల యందు వ్యక్తీకరించి ప్రదర్శించి, యాతనకు గురిచేస్తే కాని వారి
యొక్క దుర్బలమయిన మనసు శాంతించదు శునకానందము పొందుతుంటారు, వాళ్ళను వాళ్ళు హిప్న టైజ్ చేసుకొంటూ
ఇతరులను హిప్న టైజ్ చేస్తుంటారు, ఇది సహజముగా ప్రపంచములో జరిగే బావ కాలుష్యము, కాబట్టి ఇతరుల మనోబావముల పీడింప బడుతు
వారి ఈర్ష్య, ద్వేశాది జుగుప్స అసహ్యములు
ప్రపంచములో జరిగే ప్రతి చర్యలన్ని ప్రపంచికుల మస్తిష్కమునుంచి ప్రొజెక్షన్
అవుతున్నవే అంతే కాని అవి అన్ని సత్యాలు కావు, వాటి యందు తగు విదముగా స్పందిస్తూ
సత్యముగా నీవు పరమాత్మ యొక్క సత్యత్వమును గ్రహించుటకు నీవు ఎటువంటి బావ జాలము
ఏర్పరచుకోనక, ఇతరుల మైండ్ మ్యాపింగ్ లో కొట్టుకొని పోకుండా కేవల కర్తవ్యనుసారముగా
ప్రవర్తిస్తూ పవిత్రమయిన, పర బ్రహ్మ బావనలో మనసు
లీనమవ్వాలి.
Hologram Technology మనకు మహా భారతములో ధర్మ రాజు రాజసూయ యాగము ఘట్టము మనకు జ్ఞప్తికి తెస్తుంది, ఇందుల మయుడు పాండవులకు మయుడు మయ సభను నిర్మించి ఇస్తాడు ప్రస్తుత టేక్నాలజి 3D చిత్రాలు అందరికి సుపరిచితమే, ప్రస్తుత కాలములో
3D గేమ్స్ కూడా చాలానే వస్తున్నాయి అయితే
ప్రస్తుత కాలములో వస్తున్న ఆధునిక Technology ద్వార అత్యంత ప్రామాణికతతో అనేక రకాల చిత్ర
ప్రదర్శనలు జరుగుతున్నాయి. Hologram Technology, 7D Hologram show లకు ప్రస్తుతము అత్యంత ఆదరణ లబిస్తుంది. ఈ షోలో
వాస్తవాన్ని ప్రతిబింబించే విదంగా అనుభూతులను పంచుతున్నాయి, ప్రదర్శన ఎక్కడో
స్క్రీన్ మీద కాకుండా వాస్తవంగా మన చుట్టుపక్కల జరుగుతున్నట్టుగా వుంటుంది.
తెరపయిన కనిపించే చిత్రాలు మనచుట్టుగా తిరగాడుతున్నట్లు బ్రమలకు గురిచేస్తు
ప్రదర్శనలు జరుగుతున్నాయి, పి సి సర్కార్ ౧౯౯౨ 1992లో లేజర్ ప్రక్రియతో ఆయన రైలునే మాయం చేసినట్టు
ప్రేక్షకులకు బ్రమను కల్పించాడు. రైలునే మాయము చేసి అందరిని ఆశ్చర్య చకితులను
చేసినాడు, అదేవిదముగా ఈనాడు వున్న 7D Hologram టేక్నాలజి ద్వార లేని వస్తువులను,
మనుష్యులను, అనేక రకాల జీవజాతులు, అపరూప కట్టడాలు, సుందరమైన ఉద్యాన వనాలను, ఆకాశ
వీధులు క్షణాల్లో మన చుట్టుపక్కల ప్రత్యక్ష్యము అవుతాయి. వాస్తవంగా అగుపిస్తూ
అబ్బురపరుస్తాయి. ఇదే రీతిన మనస్సు యొక్క చమత్కారము, మనసు యొక్క అపూర్వమయిన శక్తి
అనేక మయోపాదికముల చేత అభివ్యక్తీకరణ జరుగుటను కొంతవరకు అయిన మనకు అర్థము చేసుకొనుటకు
తోడ్పడుతుంది. 7D Hologram showను చూసినట్లు అయితే మనకు యోగ వాశిష్ఠ హృదయము లోని లవణో పాఖ్యానం బోదపడుతుందని బావిస్తున్నాను.
.................(ఇంకావుంది )