అనంతపురం - అనంతుడు - ఆత్మీయుడు - మహామొహాపురం
అది అనంతుడు ఉండే పురం కాబట్టి దానిని అనంతపురం అంటారు, ఈ అనంతుడి సామ్రాజ్యము కూడా అనంతమైనదే ఈ అనంత సామ్రాజ్యానికి ఒక స్వయం ప్రతిపత్తి కల ఒక సామంత రాజ్యము ఉంది. ఇది అనేక నియతులతో వర్ధిల్లుతోంది. ఆ సామంత రాజ్యము పేరు మహా మొహ పురం. అనంతుని సామ్రాజ్యము నుండి మహామొహపురాన్ని సుస్పష్టముగా వీక్షించవచ్చు అయితే మహమొహాపురము నుండి ఇది సాధ్యము కాదు. మహా మొహాపురపు నియతి ప్రకారము అక్కడ అడుగు పెట్టినవాడు అక్కడి నియతికి లోబడి అత్యంత సహజముగా చరిస్తాడు, దానిని చూచినంతనే ఆకర్షింపబడుతారు, తాను మహామోహపురానికీ చెందిన వాడిగానే ఉంటాడు. ఆ మహమొహాపురమే తన సర్వస్వమని అతను అత్యంత బలీయముగా విశ్వసిస్తాడు. అక్కడ అతనికి లభించిన వాటితో, అతను పొందుతున్న వాటితో, ఇంకా అక్కడ అనేక ఆకర్షణలతో కనపడే ప్రతి వస్తు, విషయాలతో మానసిక బంధము ఏర్పరచుకొని వాటి యందు రాగ ద్వేషములు పెంపొందించుకొంటూ, వాటి యందే లగ్నము చెంది ఆ రాజ్యము విడువలేక తిరిగి తిరిగి మరల తాను అదే రాజ్యమునందు సదా సంచరిస్తూ ఎండమావుల లాంటి భౌతిక అస్తిత్వాలతో దాహము తీరక మహా మొహపు పురము చక్ర బంధములో తిరుగాడుతూనే ఉంటాడు. ఇది అనంతపురము మరియు మహామొహాపురాల పరిచయము.
ఇక అనంతుడి గురించి అతను అభేద భావన కలిగిన వాడు, ఎప్పుడూ ఆనందముతో నిండుకొని ఉంటాడు, అతనిని చూసినంతనే చూసినవారికి ఆ ఆనందము తొణికిసలాడుతోంది. ఆయనే సర్వ సామ్రాజ్యాధి పతి, ఆయన ఏలుబడిలో ఉండేదే అనంతపురము మరియు దాని సామంత రాజ్యము కూడ, మహామొహాపురము యొక్క మనుగడ, సమస్త పోషణ ఆధారము అంతా ఆ అనంతుడే.
ఈ అనంతుడికి ఒక ఆత్మీయుడు ఉన్నాడు, ఆ ఆత్మీయుడుకి ఆ అనంతుడే సర్వస్వము, ఆ అనంతుడు ఇతనికి హితుడు, సన్నిహితుడు, అనంతుని సాన్నిధ్యము, సామిప్యం, సారూప్యము అతను పొంది వున్నాడు. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఎట్టి భేద భావము లేదు. వారిద్దరూ నిత్యము జ్ఞాన గంగా లో విహరించేవారు, వారిద్దరికి సమయము అన్నది లేనిదిగా ఉంది. వారి యొక్క బంధమూ అనంతమయినదే. ఒకసారి అనంతుడి స్నేహితుడు అనుకోకుండా మహమొహాపురము వైపు దృష్టి సారించాడు అంతే అత్యంత ఆకర్షణ శక్తి గల మహమొహాపురమున తన దైన వస్తువు అక్కడ ఏదో ఉన్నట్టుగా అగుపించినది. అనంతుని ఆత్మీయుడికి. అంతే అనంతుని మాటలు ఏవో హెచ్చరిస్తున్నాయి, కానీ అంతలోపే వారిద్దరికీ దూరము బాగా పెరిగిపోయింది. ఇక అనంతుని పూర్తిగా మరచిపోయాడు. మహా మొహాపురముతో ఏకీ భవిత్వము చెందినాడు, ఇప్పుడు అతడు తనది కాని దానిని తనదిగా భావించే తత్వాన్ని పొందివున్నాడు, అతత్వము ఇప్పుడు అతనిలో ఒక ప్రధానమయిన కతృత్వాన్ని నిర్వహిస్తుంది, ఇప్పుడు ఆ మహమొహాపు అనుచరుడు అయిన అతత్వము ఇతనికి బానిసన లేదా అనంతుని ఆత్మేయుడు ఆ అనుచరుడికి బానిసను తెలియడం కష్టము, మహమొహాపురపు అనుచరుడు తనతో సారూప్యము చెందినట్లు కూడా అతనికి తెలియకుండా పోయింది.
ఇక్కడ అతనికి అనేక బంధుత్వాలు ఏర్పడ్డాయి, తల్లి తండ్రులతో, అన్న తమ్ముళ్ళతో, అక్క చెల్లెళ్ళతో, భార్య పిల్లలతో, స్నేహితులతో,, సన్నిహితులతో అనేక వస్తు విషయాదులతో, మహా మొహాపురములో తనకు లభిస్తున్న కీర్తి ప్రతిష్టలు, ఆస్థి పాస్తుల కొరకు వాటితో మానసికి బంధము ఏర్పరచుకొని అవి లేని తనను ఊహించుకోవడము కూడా అతనికి అసాధ్యము, వాటిలో తన అస్థిత్వము ఉందని గాఢముగా నమ్ముతూ వాటి యందు తిరుగాడుతున్నాడు. ఇక అతను పూర్తిగా అనంతుని గురించి అతని సహచర్యము గురించి ఏమాత్రము అతని స్మృతి పథములో లేవు. అనంతుని పూర్తిగా విస్మరించాడు. అనంతునితో అతనికి ఉన్న గాఢమయిన శాశ్వత సంబంధము వుంది అన్న విషయము కూడా అతని మస్తిష్కములో ఉదయిన్చడమే లేదు.
....... ఇంకావుంది.