ఆది భౌతికం, ఆది దైవికమ్, ఆధ్యాత్మికం
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్న చందాన !.
{ భగవంతుడు అనుగ్రహించినప్పటికీ , సద్గురువు అనుగ్రహించినప్పటికీ వారి వారి మనస్సులే ఆయా ఫలాలను అందుకోకుండా వారికి అడ్డు పడుతాయి . }
భౌతికముగా జరిగే కష్ట,నష్టములను, ఉపద్రవాలను సాధకుడు దాటుకోవాచ్చు, దైవికముగా జరిగే సంఘటనల నుండి పరమాత్ముని కృప తో, సద్గురువు అనుగ్రహముతో దాటుకోవచ్చు అయితే ఆధ్యాత్మికంగ అంటే తన యెక్క మనస్సు నుండి జరిగే ఉపద్రవములనుండి ఎవరు కూడా రక్షించలేరు, తన మనస్సును జయిస్తేనే సాధకుడు కానీ భక్తుడు కానీ ఉన్నతిని, అభివృద్ధిని, పరమాత్మ నుండి సద్గురువు నుండి పొందిన అనుగ్రహమును, ఆయువు, ఆరోగ్యము ఐశ్వర్యము లను పొందగలరు. అందుకు ఉదాహరణ అనేకములు వున్నాయి.
ఉదాహరణకు మహాభారతములోని ఉద్యోగ పర్వము లో జరిగిన సంగటన చెప్పుకోవచ్చు, కౌరవులను ఆది భౌతికమునుండి, ఆది దైవికము నుండి రక్షించే ప్రయత్నము చేశారు కానీ ఆధ్యాత్మికము ( ఆధ్యాత్మికం అంటే ఇక్కడ మనస్సు అని అర్థము వస్తుంది. ) వారి మనస్సులు ( దుర్యోధనాధి కౌరవుల ) ఆయా శాంతి ఫలాలను అనుభవించకుండా చేశాయి. శాంతి దూత గా శ్రీ కృష్ణ పరమాత్మా జరగబోయే యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పాలని ప్రయత్నించాడు. ఒకరకంగా చెప్పాలంటే యుద్దాన్ని నివారించి కౌరవులను దుర్గతినుండి, దుర్మరణముల నుండి కాపాడాలని భగవానుడు ప్రయత్నించాడు, ఆయనే కాదు ఆయా సభలో పాల్గొన్న తపస్విలు, గురువులు, మహాత్ములు అందరు ఈ సంఘటనలనుండి కాపాడాలని ప్రయత్నించారు ఈ ప్రయత్నము దుర్యోధనాధి కౌరవులకు ఒకరకముగా వారికి భౌతికముగా,దైవికముగా జరిగే ఉపద్రవాలనుండి, సంఘటనలనుండి దుర్గతి పాలవకుండ, దుర్మరణము పొందకుండా నిలువరించే ప్రయత్నము చేశారు లేదా ఆవిధముగా అనుగ్రహము వారికి కలిగించారు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయ్నతమంతా సత్పురుషులు, అమాయకులు, ప్రజల ప్రాణనష్ట నివారణకు అయివుండవచ్చు, అతని మనస్సే పరమాత్మా అనుగ్రహించిన, సద్గురువులు, మహాత్ములు అనుగ్రహించిన అనుగ్రహ ఫలాలను అనుభవించకుండా అడ్డుపడినట్లు అయ్యింది. దుర్యోధనుని దురహంకారము కారణముగా, రాఘ ద్వేషాదుల కారణముగా హృదయ దౌర్బల్యము కలిగి భగవానుని, మహాత్ముల బోధనలను పెడచెవినపెట్టినారు. మానసికముగా కలిగిన వికారము, వికలత్వము కారణముగా అతని మనస్సే అతనికి శత్రువు అయింది.
అతని మనస్సు నుండి కలిగే ఉపద్రవాన్ని అతను కనుగొనలేకపోయాడు, భగవానుడు, గురువులు, మహాత్ములు ఎంత బోధించినప్పటికీ, హెచ్చరించినప్పటికీ ఎంత మేలు చేయాలనీ చూసినప్పటికీ అతని మనస్సు కారణముగా అతనిని అతని పరివారాన్ని రక్షించలేక పోయారు.
{ సాధకుడికి, భక్తుడికి మొట్ట మొదట తన యొక్క మనస్సే తనకు ప్రధాన అవరోధం. }
.......ఇంకావుంది