మహా మోహము
రఘు, రాఘవ , రాఘవేంద్ర సంవాదము
రఘు : మానవుడు ఎందుకు ప్రాపంచిక వస్తు విషయాదులతో రమిస్తూ అవియే సత్యమని భ్రమిస్తూ, తనను కమ్మివేసిన మాయా మోహమును, మహా మోహమును గుర్తించలేకున్నాడు. పరమసత్యాన్ని, పరమాత్మ తత్వాన్ని ఎందుకు గ్రహించలేక పోతున్నాడు. తన యొక్క స్వస్వరూపాన్ని గుర్తించ లేక పోతున్నాడు, పరిమితుడయి రాఘ ద్వేషాలతో కొట్టు మిట్టాడుతున్నాడు ?.
రాఘవ : వాస్తవంగా మానవుడికి మహామోహము వలన, పాంచ భౌతిక పదార్థ పరిధికి లోనయిన వాడై తన పట్ల తనకు ఉన్న మోహము కారణముగా తనకన్నాభిన్నముగా అగు పిస్తున్న ప్రపంచ వస్తు విషయాదులతో అనుకూల, ప్రతికూల భావనలతో వాటియందు రాఘ ద్వేషములు కలిగి, వాటితో సుఖ దుఃఖములు కలిగిన వాడయి పాప పుణ్య కర్మలను ఆచరిస్తూ కాల భ్రమణ చక్రములో తిరుగాడుతూన్నాడు.
రాఘవేంద్ర : ఎలాగయితే పంది దుర్గంధ భరితమయిన బురదకుంటలో ఆహారము సేకరిస్తూ అందులోనే సంచరిస్తూ బురద కుంటలోనే జీవిస్తుంది. ఎందుకంటే అది బురద కుంట యొక్క దుర్గందాన్నిగ్రహించలేదు, పంది యొక్క నాసిక గ్రంథులు అతిసూక్ష్మమయినవి, అది కేవలము తన యొక్క ఆహారాన్ని మాత్రమే పసిగట్టగలదు, దుర్గంధాన్ని పసిగట్టలేదు కాబట్టి అది యథేచ్ఛగా బురద కుంటలో సంచరిస్తూ, అందులోనే ఆహారాన్ని సేకరిస్తూ అందులోనే జీవిస్తుంది. అదే విధముగా మానవుడు త్రిగుణాలతోను, రాగ ద్వేషాధులతోను, అరిషట్ వర్గాదులతోను సంచరిస్తూ ఈ మాయా జగత్తు యందు తాత్కాలిక సుఖ భోగాలకోసం, కీర్తి ప్రతిష్టలకోసం వెంపర్లాడుతూ ప్రాపంచిక వస్తు విషయాదుల యందు ఆసక్తుడై వాటి యందు రమిస్తున్నాడు. పంది దుర్గందాన్ని గ్రహించనట్లుగా మానవుడు మాయా మొహాన్ని గ్రహించ లేకున్నాడు.
.... ..... ఇంకావుంది