సద్గ్రంథ పఠనము
రఘు, రాఘవ, రాఘవేంద్ర సంవాదము
రాఘవ : సాధ్గ్రంధ పఠనము వలన భక్తుడిలో, సాధకుడిలో ఆంతరంగిక పరిపక్వత సిద్దించి, భగవంతుని యొక్క, సత్యము యొక్క నిగూడ రహస్యాలు గ్రహించడానికి తగు విధముగా మానసిక స్థితి భక్తుడిలో సాధకుడిలో ఏర్పడుతుంది.
రాఘవేంద్ర : సధ్గ్రంధములలోని అనేక సత్పురుషుల జీవితాలు, వారు వారి జీవితములో అనుసరించిన విధానాలు , సత్యముకోసం, ధర్మము కోసం పరమాత్మకోసం, వారు పాటుపడిన రీతి, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, వారు చెందిన అనుభూతులు సాధకుడిలో, భక్తుడి హృదయములో సత్య ధర్మాల పట్ల, పరమాత్మా పట్ల వారి హృదయము ద్రవించి, వారి హృదయ ప్రక్షాళన జరిగి మానసిక బంధములనుండి విడి వడి వారి మనసులో అనేక ఉత్తమ మయిన మార్పులు కలిగి వారి మనసులు, వారి మస్తిష్కములు అతి సూక్ష్మమయిన, నీగూఢమయిన సత్యాలను గ్రహించగలిగే స్థితులు కలుగుతాయి, పరమాత్ముని పట్ల విశ్వసనీయత కలుగుతుంది, పరమాత్ముని యొక్క నిగూడ రహస్యాలు గోచరము అవుతాయి, సత్యత్వము పట్ల పరమాత్ముని పట్ల భక్తి పారవశ్యులు అవుతారు, పాప కర్మలు నశించి, పుణ్యము ప్రాప్తి కలుగుతాయి, పరమాత్మా యొక్క దివ్యానుభూతి కలిగి, స్వ స్వరూప అనుసంధానము జరిగి కాలచక్రమునుండి విడివడుతాడు. పరమాత్మా ప్రాప్తి , బ్రహ్మానంద సిద్ధి కలుగుతుంది.
........ఇంకావుంది.