{మాయా లక్షణాలు - కరోనా లక్షణాలు}
రఘు, రాఘవ , రాఘవేంద్ర సంవాదము
రఘు : మాయ అనేది లేనిదానిని చూపిస్తూ యధార్థముగ వున్న సత్యాన్ని మరుగు పరచడం మాయ యొక్క ప్రధాన లక్షణముగా మహాత్ములు చెపుతుంటారు కదా ! ఈ మయా లక్షణాన్ని సులభతరంగా అర్థం చేసుకోవడానికి ఏవైనా భౌతికత్వముతో ముడి పడిన సంఘటనలు ఉన్నాయా ?.
రాఘవ : పరమాత్ముడు మానవాళికి అనేక విధములుగా మాయ యొక్క స్వభావాన్ని, భౌతిక జగత్తు యొక్కఅనిత్యత్త్వాన్ని
పరబ్రహ్మ యొక్క సత్యత్వాన్ని అనేకవిధాలుగు, మహాత్ములతో, సద్గురువులతో, పరమహంసలతో, జ్ఞాన యోగులతో, ప్రకృతి లో జరిగే అనేక మార్పులతో తెలియచేస్తూనే ఉంటాడు. మహాత్ముల, గురు బోధనలను అనుసరించి సత్యత్వము వైపు, భగవంతుని వైపు అడుగులు వేయాలి.
రాఘవేంద్ర : వాస్తవం.
రఘు : మరి ప్రస్తుత పరిస్థుతులననుసరించి ఏవైనా మానవాళికి ప్రకృతి పరంగా ఏవైనా మాయ యొక్క లక్షణాన్ని బోధించే ప్రయత్నము జరింగిందా ?
రాఘవ : భగవంతుడు ప్రకృతి నుంచి అనేకవిధములుగా మానవాళికి భోద చేస్తుండవచ్చు, అయితే అందరు అన్నిటిని గ్రహించలేక పోవచ్చు.
రఘు : అయితే ప్రస్తుతం కరోనా ప్రపంచమంతటా విస్తరించి మానవాళిని కబళిస్తుంది కదా ! మరి ఈ కరోనా ద్వారా ప్రకృతి నేర్పే పాఠం ఏంటి ?. ఈ కరోనా కాలములో ఏదయినా భోద జెరిగి ఉండవచ్చా ?
రాఘవ : ఈ కరోనా మానవాళికి అనేక రకాల పాఠాలే నేర్పించి వుండవచ్చు, అయితే మనము మాయ యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటున్నాము కదా ! మరి ఈ మాయ లక్షణము ను ఈ కరోనా తెలియ చేసేది ఏమయినా ఉందా ?.
రాఘవేంద్ర : మరి అయితే ముందుగా కరోనా లక్షణాలు చెప్పండి చూద్దాం !.
రఘు : దగ్గు, జలుబు, జ్వరము, డయేరియా ఇది ఒకరి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందడము. ఇంకా చెప్పాలంటే దీనికి వాసనను, రుచిని పోగొట్టే లక్షణము ఉంది అని కూడా చెపుతుంటారు.
రాఘవ : 3 రొసెస్ టీ రంగు, రుచి, వాసన ఇస్తుంది, కరోనా పోగొడుతుంది. ☺☺☺☺
రఘు : రంగు కాదు, రుచి వాసనను మాత్రమే పోగొడుతుందని అంటుంటారు.
రాఘవ : అంటే వాస్తవముగా పదార్థానికి వుండే రుచి కానీ, వాసన గాని కరోనా సోకిన వ్యక్తికి పోతుంది అంటారు.
రఘు : అంటే ?
రాఘవ : కరోనా సోకిన వారిలో కొంతమందికి పదార్థము యొక్క 'రుచి' ( పులుపు, కారము ) లాంటివి నాలుక ద్వారా గ్రహించ లేకపోవడము, అలాగే పదార్థము యొక్క 'వాసన' అది సుగంధము కాని దుర్గన్ధము గాని కరోనా సోకిన ఆయా వ్యక్తులు గ్రహించలేక పోవడము.
రఘు : మరి ఈ రకమయిన కరోనా లక్షణము మాయా లక్షణానికి ఎలా సరి పోలుతుంది.
రాఘవేంద్ర : కరోనాను మాయతో పోల్చుకొంటే కరోనాకు ఎలాగయితే వాస్తవంగా పదార్థానికి వుండే రుచిని గాని, వాసనను గాని రోగికి తెలియనీయదో అదేవిధముగా మాయ చేత జీవ భావము కలిగి ఆత్మ స్వరూపుడికి వాస్తవముగా ఉండే పరబ్రహ్మాన్ని తెలియనీయదు. మాయా మోహితుడయినా జీవుడు పరబ్రహ్మానుభూతిని మాయ చేత కోల్పోయి కరోనా రోగి పదార్థానికి వుండే వాస్తవమయిన రుచి, వాసన కోల్పోయి విభిన్నమయిన అనుభూతి చెందినటుల మాయ చేత బ్రహ్మము జీవభావము పొంది సత్యముగా భావించి నట్లుగా..........
ఇంకావుంది.