అన్ని మతాలూ, కులాలూ ఒకటే
ప్రతి మతంలో కొన్ని మంచి చెడులు ఉంటాయి. అంత మాత్రాన ఈ మతం చెడ్డది, ఆ మతం చెడ్డది అంటూ ఒకరి నొకరు దూషించు కొంటున్న సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. మానవత్వం అనే సద్గుణాలు లేని ఏ మతం యేదైనా సంస్కరించబడాల్సిందే. మంచి యే మతంలో వున్నాస్వీకరించడం నేర్చుకుంటే మానవజీవితం ఎంతో సాదించి నట్టే. మతాలను దూషించడం అనేది ఒక సంస్కార హీనతను సూచిస్తుంది. ఎవరైనా కానీ మతాలను, కులాలను దూషించడం అనేది అంత సరియ్యినది కాదు. మనమంతా మనుషులం. మానవత్వమే మన మతం అని గుర్తుంచుకోవలసిన అవసరం వుంది.
ఎంతో మంది మత సామరస్యానికి పాటుపడుతున్నారు, శ్రమిస్తున్నారు వాళ్ళు చెప్పేది ఏమంటే, నిజానికి ఎ మతానికి చెందినా వాడయిన ఇతరుల మతాలను ద్వేషిస్తూ వుంటారో అటువంటి వారు వారి వారి మతాలకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. నిజమైన ఆధ్యాత్మికత లో పరమత సహనం వుంటుంది, నిజమైన విస్వసకులు తమ తమ దైవం యెక్క ఆనంద స్వరూపాన్ని, ఉత్తమ గుణాలను, సహనశీలతను, దయ, కరుణ, ప్రేమ, మహిమలను గూర్చి తెలుసుకోవడానికి గాని తలవడానికి గాని చెప్పడానికి అతనికి సమయం సరిపోదు, ఇంక ఇతర మతాలని గాని వారి ఆచారాలను గాని విమర్శించే తీరిక ఎక్కడిది. తాను నమ్మిన భగవంతుడిని పక్కకు పెట్టి ఇతర మాతా లను దూషించటం, ద్వేషించటం వారికీ సరిపోతుంది. అలాంటి మతోన్మాదుల నుంచి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మన అందరికి ఎంతయినా వుంది.
మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.
స్వర్గం ఇక్కడే వుంటుంది. పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం. హిందూ, ముస్లిం, క్రిష్టియన్ భాయీ భాయీ. ఇంత కన్నా మానవజాతి సదిన్చాలిసిన గొప్ప ప్రగతి నాకు తెలిసి ఏది లేదు.
మీరు ఈ క్రింది చిత్రాల్ని చూడండీ.
ఈ పైన ఊన్న చిత్రం muziboo.కం నుండి సేకరణ

సర్వేజన సుఖినోభవంతు 
