మంచు తో కప్పభడిన కేదార్నాథ్ ఆలయం
ఉత్తర ఖండ్ లో సహజ ప్రకృతి శోభతో అలరారే నాలుగు దివ్య ధామాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, భద్రినాథ్ ఇవి నిజంగా నాలుగు స్వర్గాలు. ఈ యాత్రకు రుషి కేష్ నుండి వెళ్ళాలి. వెళ్లే దారి అంతా ఘాట్ రోడ్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండ దారిలో వెళ్తుంటే కింద పచ్చని తెవాచీ పర్చినట్లు ప్రకృతి, దట్టమయిన అడవులు అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, మేఘాలను తాకే కొండలు జలపాతాల ప్రక్కన ప్రయాణం భలే గమ్మతుగా వుంటుంది. మనోహరమైన ప్రకృతి దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఈ యాత్ర గొప్ప అందమైన అనుభూతిగా మిగిలి పోతుంది. నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. మానావాళి కి భగవంతుడు ఇచ్చిన వరం. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుత వరం.