జీవుడు - సాధకుడు - సిద్ధుడు
క్షేత్రము - స్థానము
జీవ భ్రాంతి తొలగి స్వస్వరూప దర్శనము ఆత్మ దర్శనమైన యోగి జీవన్ముక్తుడు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతుడు అవుతున్నాడు, అతను సర్వే సర్వత్రా అంతటా ఆ పరబ్రహ్మను మాత్రమే దర్శిస్తున్నవాడు, మాయ తొలగినవాడు, ద్వంద్వము లేనివాడు, అంతటా ఆనందస్వరూపుడయినా ఆ పరబ్రహ్మను చూడగలుగుతున్నవాడు అవుతున్నాడు. ఎలాగంటే భూమి మీద వుండే సమస్త జీవులకు భూ భ్రమణము వల్ల ప్రకృతిలో ఏర్పడే రాత్రి పగలు, ఋతువులు జీవులకు అనుభూతిలో కలవు, జనన మరణ అదే విధముగా సూర్యుని స్థానములో నిలబడి చూస్తే రాత్రి పగలు { చీకటి వెలుగులు } ఋతువులు ఇత్యాదులు వుండవు. అతనికి అంతటా కేవలం అఖండమయిన ప్రకాశము మాత్రమే గోచరిస్తుంది. అదేవిధముగా ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి ఆత్మక్షేత్రము నుండి అంతటా ఆత్మ స్వరూపముగానే దర్శిస్తాడు. ఈ జగత్తు యందు జగత్తుకు ఆధారముగా వున్న, అంతటా నిండి నిబిడీకృతమయిన దివ్య ఆనందస్వరూపుడయినా ఆ పరబ్రహ్మ, పరమాత్మనే దర్శిస్తుంటాడు, ఇతనినే జీవన్ముక్తుడు అంటారు. అతనికి జగత్తు యందు జగత్తును కాంచాడు, జగత్తుకు ఆధారమయిన శుద్ధ చైతన్యాన్ని దర్శిస్తాడు. ఆత్మ దర్శనము పొందిన యోగి వ్యవహారికముగా కనిపిస్తున్నప్పటికీ అతను ఎల్లపుడు ఆత్మస్థానములోనే ఉంటాడు. అంతటా ఆనంద స్వరూపమయిన ఆత్మనే దర్శిస్తాడు.
{ భూ క్షేత్రము నందు జీవుడు కాలము , రాత్రి పగలు, ఋతువులు ప్రకృతిని అనుభూతి చెందుతాడు, సూర్యని నందు నిలబడి చూస్తే కాలానికి అతీతమయిన స్థితి, అఖండమయిన ప్రకాశము, ఆవిధముగానే ఆత్మ యందు స్థితిని పొందినవాడు భౌతిక దృష్టి నశించి జనన మరణ సంసార బంధాలకు అతీతుత మైన స్థితిని పొందుతున్నాడు. }
.....ఇంకావుంది.