వ్యష్టి - సమిష్టి
ఒక అవగాహన
సూర్యని నుండి సూర్య రష్మిని ఆయా యంత్ర పరికరములు { సోలార్ యంత్ర పరికరములు } గ్రహించి వాటియొక్క సామర్థ్యము ననుసరించి, వాటిలో పొందపరుచబడిన ఉపయోగ విశిష్టతతో వాటి యొక్క వైవిధ్యమయిన శక్తి తో పనిచేయునో అదే విధముగా చైతన్య స్వరూపుడయిన ఆ పరబ్రహ్మ నుండి జీవులు శక్తిని, చైతన్యమును పొందుతూ ఆయా జీవి యొక్క భౌతిక శరీర, మానసిక, ప్రజ్ఞననుసరించి, వివేకముతో వారి సామర్థ్యముననుసరించి వ్యవహరిస్తున్నారు.
క్రిమి కీటకాదుల యందు, పశు పక్షాదుల యందు, దేవ, దానవల యందు, మానవల యందు , యక్ష, కిన్నర కింపురుషులు ఇత్యాదులందు ప్రకాశిస్తున్నది కూడా ఆ బ్రహ్మ యొక్క చైతన్యమే విలక్షణమయిన పరస్పర వైరుధ్యమైన ఆయా ఉపాధులయందు గల సామర్థ్యము ననుసరించి వారి/వాటి యొక్క వ్యవహారము కలదు.
జగత్తు పట్ల సమిష్టి యొక్క భవనాలే వ్యష్టిలో గోచరము అవుతున్నది. స్ఫురిస్తున్నది. వ్యష్టి బౌతికంగా అంతరిస్తున్నప్పటికీ, వ్యష్టిలో జగత్తు లేకుండా పోయినప్పటికీ, సమిష్టి యొక్క భావనలో జగత్తు యొక్క భావన ఉన్నందున అన్య ఉపాధులకు జగత్తు భాసిస్తూనే వున్నది . సమస్త జగత్తు యథార్థముగా వున్నట్లుగా భాసిస్తున్నది .
సమిష్టి లో జగత్తు యొక్క దృడ భావన వున్నదందున వ్యష్టిలో ఆ భావనే స్ఫురిస్తున్నది. అయితే వ్యష్టి ఈ జగత్తును తన కన్నా భిన్నముగా దర్శిస్తున్నాడు, అనుభూతి చెందుతున్నాడు. వ్యవహరిస్తున్నాడు. తనకు మూలము అసమిష్టి యే తనలో భాసిస్తున్న జగత్తు భావన అంతయూ ఆ బ్రహ్మదే అని గ్రహించలేక వున్నాడు. జగత్తుకు గల లేదా పదార్థానికి గల భౌతిక పరిదులు, నియతులు, వృద్ధి క్షయములు తనకు ఆపాదించుకొని లోకమునందు వ్యవహరిస్తున్నాడ, దుఃఖిస్తున్నాడు .
.....ఇంకావుంది.