పేజీలు

సర్వమంగళ

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధి సాధికే శరన్యే త్రయంబకే దేవి నారాయని నమోస్తుతే .
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశ్యశాలినీ । దేశోఽయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ॥

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

30 సెప్టెంబర్, 2011

వైశేషికం

వికీపీడియా నుండి
సృష్టికర్త అంటూ ఎవడూ లేడని, సృష్టి సమస్తం అణువుల కలయికవల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త కాణాద ఋషి. ఈయనను కణభక్షకుడు మరియు కణభోజి అనికూడా పేర్లు మరియు అసలు మొదటి పేరు కశ్యపుడు. కణాదుని సూత్రాలలో సృష్టి కర్త, ఈశ్వరుని ప్రసక్తి ఎక్కడా లేదు. అందుచేత ఇది నిరీశ్వర దర్శనం. వైశేషిక దర్శనం ఈశ్వరుడిని అంగీకరించకపోయినా వేద ప్రమాణ్యాన్ని, ఆత్మను, పునర్జన్మను, కర్మ సిద్ధాంతాన్ని, మోక్ష సిద్ధిని అంగీకరిస్తుంది. ఈ శాస్త్రమునకు తర్కశాస్త్రము అని కూడా పేరు.
కణాద దర్శనంలో పది అధ్యాయాలున్నాయి. ప్రతీ అధ్యాయంలో రెండేసి ఆహ్నికాలు, మొత్తం 370 సూత్రాలు ఉన్నాయి.

విషయ సూచిక

నాలుగు పురుషార్థాలు

'అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామ:' అని వైశేషిక దర్శనం ప్రారంభమవుతుంది. అంటే 'ఇపుడు ధర్మం గురించి వ్యాఖ్యానిస్తాము' అని. దేనివల్ల అభ్యుదయం, నిశ్శ్రేయసం సిద్ధిస్తాయో అదే ధర్మం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి చతుర్విధ పురుషార్థాలు. ధర్మం వల్ల అర్థకామాలు (అభ్యుదయం) చివరిదైన మోక్షం (నిశ్శ్రేయసం)లభిస్తాయి. ధర్మంవల్ల తత్త్వజ్ఞానం, దానివల్ల అభ్యుదయ, నిశ్శ్రేయసాలు సిద్ధిస్తాయి. పదార్థ జ్ఞానమే తత్త్వజ్ఞానం. అంటే పదార్థాలను గురించి తెలుసుకుంటే తత్త్వం బోధపడుతుంది.

షట్పదార్ధ సిద్ధాంతం

పదార్ధాలు ఆరు విధాలని వైశేషిక సిద్ధాంతం. అవి ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం.
  • తదుపరి వచ్చిన వైశేషికులు అభావమును కూడా చేర్చి మొత్తము ఏడు అని అన్నారు.
  • ఇక్కడ పదార్థము అనగా ఒక పదము యొక్క అర్థము తెలుసుకొనుట.

ద్రవ్యం

  • ద్రవ్యము తొమ్మిది విధాలుగా ఉంటుంది. అవి ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు.
  • ద్రవ్యములు రెండు విధములు. ఒకటి మూర్త ద్రవ్యములు మరియు రెండు అమూర్త ద్రవ్యములు.

మూర్త ద్రవ్యములు

  • వీటిలో ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు అను నాలుగు మూర్త ద్రవ్యాలు అనగా కంటికి కనిపించునవి.

 అమూర్త ద్రవ్యములు

  • మిగిలినవి అనగా ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. అనేవి అమూర్త ద్రవ్యములు. అంటే కనిపించనివి.
  • ద్రవ్యములు రెండు విధములు. ఒకటి సావయవములు మరియు రెండు నిరవయవములు
సావయవములు
  • ఇవి ఉత్పత్తి వినాశములు, స్వతంత్రము లేనివి, ఒకదానిపై ఆధారపడినవి మరియు అనిత్యములు. అవి:
  • ఫృథ్వి, జలం, అగ్ని.
నిరవయవములు
  • స్వతంత్రము కలవి, నిత్యములు మరియు పరమార్థములు.
  • వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనేవి మహాపళయము వరకు ఉంటాయి.
  • ఆత్మ అనునది పరమార్థ నిత్యము. ఈశ్వరుడు ను నమ్మిన మతము నందు పరమార్థ నిత్యము కలవాడు ఈశ్వరుడు.
  • మనస్సు అనేది మోక్షము వరకు ఉంటుంది.
ఆత్మ అనేది జీవాత్మ. అది అనాది, అనంతం, సర్వవ్యాపి, అనేకం. అయితే జడం, అచేతనం. మనస్సు అంతరింద్రియం. అది ఆలోచిస్తుంది. ఆత్మ మనస్సుతో కలవడంవల్ల చేతనం అవుతుంది. దానికి గ్రహణ శక్తి కలుగుతుంది. సుఖం, దు:ఖం మొదలైనవి పొందుతుంది.

గుణం

  • ఇది స్వతంత్రంగా ఉండలేదు. ద్రవ్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది పదిహేడు విధాలు. రూపం (రంగు), రసం (రుచి), గంథం (వాసన), స్పర్శ, సంఖ్య, పరిమాణం, పృథక్త్వం (ప్రత్యేకత), సంయోగం (కలయిక), విభాగం (వేర్పాటు), పరత్వం (ముందు), అపరత్వం (వెనుక), బుద్ధి, సుఖం, దు:ఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం.
  • గుణపద వాచ్యములు మరి ఏడు అయిన, గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము మరియు శబ్దము కలిపి మొత్తము ఇరువదినాలుగు (24).
  • ఈ ఇరువదినాలుగు (24) గుణములకు మరి యొకటి లఘుత్వము చేర్చిన మొత్తము ఇరువదిఅయిదు (25).

కర్మ

కర్మ అయిదు విధాలుగా ఉంటుంది. కర్మ అంటే ఇక్కడ చలనం అని అర్థం. అవి - ఉత్ క్షేపణం (పైకి పోవడం), అవక్షేపణం (కిందికి పోవడం), ఆకుంచనం (ముకుళనం, ముడుచుకొనడం), ప్రసారణం (వ్యాకోచించడం, విస్తరించడం), గమనం (వెళ్ళడం). ద్రవ్యం లేనిదే కర్మ లేదు.

సామాన్యం

అనేక వస్తువులలో ఒక సమాన లక్షణం ఉండడమే సామాన్యం. ఇది ద్రవ్య, గుణ, కర్మలతో శాశ్వతంగా ఉంటుంది. ఒకచోట అనేక గోవులను చూస్తాం. గోత్వం వాటి సామాన్య లక్షణం. గోవు అంటే గోజాతి అంతా స్ఫురిస్తుంది. అలాగే వృక్షత్వం, ఘటత్వం ఇత్యాది. సామాన్యం అనేది ఊహకల్పితం కాదు. అది యథార్థంగా వస్తువులలో ఉంటుంది.

విశేషం

సామాన్యానికి వ్యతిరేకమయింది విశేషం. దీని ద్వారానే వస్తువుల మధ్య భేదాన్ని గుర్తిస్తాం. ఇది కూడా యథార్థ పదార్ధమే. ఊహాత్మకమైనది కాదు.

సమవాయం

వస్తువు, గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు, దాని గుణాలు వేరు కావు. వస్తువు లేకుండా గుణాలుండవు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. అలాగే అవయవి, అవయవాలు; చలనం, చలించే వస్తువు; కారణం, కార్యం - ఒకదానిలో ఒకటి విడదీయరానిదిగా ఉండటమే సమవాయం.

ఒక వస్తువును అంతకంతకూ చిన్న భాగాలుగా చేస్తూ పొతే చివరకి ఇక విభజన సాధ్యంకాని స్థితి వస్తుంది. ఆ స్థితిలో మిగిలే సూక్ష్మాతిసూక్ష్మ వస్తువే అణువు. అది నిరవయవి. అంటే దానిలో భాగాలుండవు. అది అచ్ఛేద్యం.

కిటికీ సందులోనుంచి గదిలోకి వచ్చే సూర్య రశ్మిలో సూక్ష్మమైన నలకలు తేలుతూ, చలిస్తూ ఉంటాయి. వాటిని త్రస రేణువులంటారు. ప్రతీ త్రస రేణువు త్ర్యణుకం. అంటే అది మూడు ద్వ్యణుకాలతో ఏర్పడుతుంది. ప్రతి ద్వ్యణుకం రెండు అణువులతో ఏర్పడుతుంది. అణువు కంటే సూక్ష్మ వస్తువు లేదు. అణువులలో ఫృథ్వీ అణువులు, జలాణువులు, అగ్ని అణువులు, వాయవ్యాణువులు ఇలా భిన్నాణువులుంటాయి. అణువుల సంయోగంవల్ల ప్రపంచం ఏర్పడింది. అణువులను ఎవరూ ఉత్పత్తి చేయలేదు. అవి అనాదిసిద్ధమయినవి, నిత్యమయినవి, శాశ్వతమయినవి.

వైశేషికులది అసత్కార్యవాదం. అంటే కారణం వేరు, కార్యం వేరు. ప్రతి కార్యానికీ కారణం ఉన్నప్పటికీ కారణంలో కార్యం మొదటినుంచీ ఉండదు. కార్యం అనేది కొత్తగా పుట్టుకువస్తుంది. కార్యంలో కనబడే లక్షణాలు ఏవీ కారణంలో కనబడవు. మట్టిలోనుంచి కుండ తయారయినా, మట్టి లక్షణాలు వేరు, కుండ లక్షణాలు వేరు. కుండ ఆకారం మట్టిలో ఉండదు. విత్తనం పగలగొట్టి చూస్తే సూక్ష్మ రూపంలో చెట్టు కనిపిస్తుందా? నూలు దారాలలో వస్త్రలక్షణాలు ఎక్కడ ఉన్నాయి? నిజానికి చెట్టు, కుండ, వస్త్రం ఇవన్నీ కొత్తగా పుట్టుకువచ్చిన కార్యాలు.

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23

పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...

శాంతి నేలకోనుగాక !

భూమి లో శాంతి నేలకోనుగాక ! అంతరిక్షం లో శాంతి నేలకోనుగాక ! ఆకాశం లో శాంతి నేలకోనని. నీటిలో శాంతి నేలకోనుగాక ! మూలకాలలో ( మూలికలలో ) శాంతి నేలకోనుగాక !
చెట్టు చేమలలో శాంతి నేలకోనుగాక ! దేవతలందరూ నాకు శాంతిని ప్రసాదిస్తారు గాక ! ప్రతి ఒక్కరికి దేవతలు శాంతిని అనుగ్రహిస్తారు గాక ! శాంతి లో సకల ప్రాణులు శాంతి పొందు గాక !
ఈ నానా విధ శాంతులు మూలంగా నాకు మరియు అందరికి మంగళం ఒనగూరు గాక ! వాటికీ మంగళం ఒనగూరు గాక ! సమస్తమూ మనకు మంగళమును ప్రసాదించు గాక !. సమస్తానికి మంగళం ఒనగూరుగాక.

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

సర్వేజనః సుఖినో భవంతు

సర్వేజనః సుఖినో భవంతు, MAY ALL BEINGS BE HAPPY, MAY THE WHOLE WORLD BE HAPPY

అహం బ్రహ్మసి

The peace (Shanti) that resides in the solar world (Dyauh), in space (Antariksha), in the earth (Prithwi) and elemental waters (Rapah),
nourishes the herbs, fruits and grains (Roshadhayah) thereby nourishing the original power (Om) in all beings (Vishvedevah).
May the peace of the whole (Brahma) now and forever more (Sarvagwam) come into us, we pray. May the highest good prevail.

Om Shanti Shanti Shanti (Peace Peace Peace) .సత్యం నిత్యం అనంతం

Peace

tranquilness, Peace, peace, peace shanti shanti shanti !

May all people be happy

May all people be happy
May all people be happy

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

SRI PADAVALLABHA

SRI PADAVALLABHA
SRI PADA RAJAM SHARANAM PRAPADYE

NEE JEEVITANIKI

NEE JEEVITANIKI

SUVISHALAM IDAM VISWAM

SUVISHALAM IDAM VISWAM

SRI GURU RAGHAVENDRA

SRI GURU RAGHAVENDRA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

JAI GURU DATTA

JAI GURU DATTA
SRI GURU DATTA

JAI GURU DATTA

JAI GURU DATTA

Trident

Trident
Trident