29 ఏప్రిల్, 2017
26 ఏప్రిల్, 2017
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 9
శ్రీ రామ
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 9
26-04-2017
ఆత్మీయ బంధువులయిన మీరందరు పరమాత్ముని యోక్క దివ్య ఆనందస్వరూపమును తెలుసుకొంటుంటారని భావిస్తూ
లోకములో ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లల అమాయకత్వమును, పిల్లల నిష్కల్మష హృదయాలను చూసి సంబర పడిపోతుంటారు, వారు తడబడుతూ నడుస్తుంటే ఎంతో అబ్బురపడతారు, వచ్చిరాని మాటలకు మురిసిపోతుంటారు, తెలిసి తెలియని మాటలకు నవ్వుకుంటుంటారు, వారి ఆట పాటలను ఆనందంగా తిలకిస్తారు, వారి శారీరిక మానసిక ప్రక్రియ అలావుంటుంది, ఐతే వారు తమ పిల్లలు ఎప్పుడు అలాగే వుండాలని ఎవరూ అనుకోరు, వాళ్ళు ఎదగాలని అన్నివిషయాలు తెలుసుకోవాలని ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వారి వారి జీవితాలను గడపాలని కోరుకుంటారు, శారీరికంగా మానసికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, ఆశిస్తుంటారు అలాగే లౌకిక విద్యలను బోధించేవారు కూడా లౌకిక ప్రపంచపు విద్యలను తమ విద్యార్థులకు బోదిస్తుంటారు, ప్రజాపాలకులు తమ దేశములోని ప్రజలు అభివృద్ధి చెందాలని పాలకులు భావిస్తారు, అందుకు తగినవిధంగా ప్రణాళికలు రచన చేసి అమలు చేస్తారు.
జగద్గురువు ఆదిశంకరాచార్య వారు తమ శిష్యులను లోకానికి జ్ఞాన దీపాలుగా సత్యప్రకాశకులుగా మానవాళికి సత్యమార్గ భోదకులుగా ఈ లోకానికి అందించారు సామాన్య ప్రజలు ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతున్నారు, అలాగే ఆ పరమాత్మ జ్ఞానము కలిగిన భక్తుల కంటే అమాయకపు భక్తులంటే పరమాత్మకు ఎంతో ఇష్టము వారిని తొందరగా అనుగ్రహిస్తాడు కూడా అయితే ఆయా భక్తులు ఏమితెలియని అమాయకపు భక్తిలోనే ఉండాలని అనుకోడు, వారికి సరిఅయిన జ్ఞానము పొందడానికి తన గురించి పూర్తిగా అతను దివ్య మార్గమును పొందాలని స్వయముగా తానే జగద్గురువుగా, సద్గురువుగా త్రిమూర్తి రూపంగా, ఆ దత్త మూర్తి తన భక్తులకు తన యొక్క జ్ఞాన స్వరూపమును బోధిస్తాడు, ఆ భగవంతుని గురించి తెలుసుకొనే కొద్ది భక్తి కూడా పెరుగుతుంధి తన శిష్యుడను ఆ పరమాత్ముని దివ్య స్వరూపములో, దివ్యానందములో నిలిచేటట్టు అనుగ్రహిస్తాడు ఉద్ధరిస్తాడు, అది ఆ పరమాత్మ తన భక్తులకోసం శరీరాన్ని ధరించి సద్గురువుగా, భక్తుల, శిష్యుల హృదయములో జ్ఞానదీపంగా వెలుగొంది అజ్ఞానాంధకారమును తొలగించి అమృత జ్ఞానమునింపుతాడు. సద్గురువు యొక్క అనుగ్రహముతో మన అందరి హృదయాలలో అజ్ఞానమనే చీకటి తొలగి సత్యదీపము వెలగని అని భావిస్తూ.
ఇట్లు
మీ ఆత్మీయ బంధువు.
( ఈ ఉత్తరము చదివే ప్రతిఒక్కరు ఆత్మీయ బంధువే )
,
20 ఏప్రిల్, 2017
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 6
శ్రీరామ
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 6
20-04-2017
సమాజము లో నుండి మనకు అనేక రకాల విమర్శలు కాని పొగడ్తలు కాని అవమానములు కాని రాజపూజ్యములు లాంటి అనేక రకాల అనుభవాలు ఎదురు అవుతుంటాయి సాధారణంగా అవి మన అహంభావము మీద పనిచేస్తాయి, ఇతరుల విమర్శలు మనస్సు యందు గుచ్చుకొన్నప్పుడు మనకు భాధ అవుతుంది అదే పొగడ్తలు అయితే ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఏ విషయమయిన మనస్సును తాకి నప్పుడు తదనుగుణ స్పందన మనలో కలుగుతుంది,ఈ రెండు సాధకుడికి లేదా భక్తుడికి ఆటంకములే రెండిటి యందు సమధృష్టి కలిగి లేదా ఆరెండు విషయమునందలి తటస్థన్గా వుండి తమ సాధన తాము కొనసాగించడమే, అవసరము మేరకు వాటి యందు తగు స్పందన కలిగి ఉంటూనే లౌకిక విషయాల యందు తమ కర్తవ్యమును నిర్వహిస్తూనే పరమాత్మ యందు మనస్సును నిమగ్నము చేయాలి లేదా ఆ పరమాత్ముని లేదా గురువు యందు సంపూర్ణ శరణాగతి చెందాలి.
మన భారత దేశమును అనేక మంది రాజులు పరిపాలించారు అయితే ఆయా రాజులు తమ పరిపాలనా సౌలభ్యము కోసము ఎవరికి వారు బిన్నంగా తమ రాజధానులను ఏర్పరచుకున్నారు, తమ లక్ష్యాలకు అనుగుణంగా ఏక కేంద్రీకృత పరిపాలన, సామంత రాజ్య పాలనా విధానాలను కేంద్రాలను ఏర్పాటు చేసుకొన్నారు, అలాగే భక్తులు సాధకులు కూడా పరమాత్మని కేంద్రగా చేసుకొని తమ మనస్సులను పరిపాలించుకోవాలి, అప్పడు అంతఃకరణం ( మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము )లు సామంతులు గా అవుతారు, సామంతులు అంటే తమ ఇచ్చ్చా పూర్వకంగా పరిపాలించకుండా తమ యొక్క రాజు లేదా చక్రవర్తి యొక్క అజ్ఞాలనే పాటిస్తూ ఉంటాడు నాది అనేది ఉండదు, కేవలము అధికారము, కర్తవ్యములు ఉంటాయి, అలాగే సాధకుడు లేదా భక్తుడు భగవంతుని తమలో ప్రతిష్ట చేసుకొని పరిపాలన చేస్తే మన అంతః కరణము శుద్ధమై మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారములు భగవంతుని సామంతులుగా అవుతాయి, అహంకారము ఉండదు, సామంతుల పోషణ రక్షణ అంతా చక్రవర్తి చూసుకొన్నట్టు ఆ పరమాత్మయే తమ భక్తుని పోషణ, రక్షణ కల్పిస్తాడు. ఇక్కడ కర్తవ్యము ఉంటుంది కాని నేనే కర్తను అని ఉండదు, నేను చేస్తున్నానని అహంభావం ఉండదు, ఉదాహరణకు భక్త ప్రహ్లాద. పరమాత్ముని యందు మనస్సును కేంద్రీకరించాలి ఆలా కేంద్రీకృత మయిన మనస్సు శుద్దము అవుతుంది, పరమాత్ముడు మనలో ప్రకాశిస్తాడు, మన అందరి మనస్సులు ఆ పరమాత్ముని యందు, సద్గురువు యందు లగ్నము అవుగాక. మన అందరికి పరమాత్ముని, గురువు యొక్క అనుగ్రహము కలుగు గాక.
ఇట్లు
మీ ఆత్మీయ బంధువు.
( ఈ చరా చర జగత్తులో పరమాత్మయందు భక్తి వున్న
ప్రతి ఒక్కరు ఆత్మీయ బంధువే )
12 ఏప్రిల్, 2017
06 ఏప్రిల్, 2017
బర్బరీకుడు ఒక సిద్ధ యోగి
బర్బరీకుడు ఒక సిద్ధ యోగి
బర్బరీకుడు మహాభారతములో ఘటోత్కచుడు, మౌరి ల కుమారుడు.భీమునకు మనవడు
అవుతాడు, తన తల్లి అయిన మౌరి దగ్గరే అన్ని అస్త్ర, శస్త్ర విద్యలు నేర్చినాడు, దేవతలు ఇతని అస్త్ర శాస్త్ర విద్య పట్ల వున్న ఆసక్తిని, పట్టుదలను చూసి మూడు అమోఘమయిన బాణాలను ప్రసాదిస్తారు, మొదటిది శిక్షించ వలసిన వారిని, రెండవది రక్షించ వలసిన వారిని , మూడవది శిక్షను అమలు చేసేది, వీటితో అతని కి ముల్లోకాలలోను ఎదురు అనేది ఉండదు. కురుక్షేత్ర యుద్ధము జరుగబోతోంది అని తెలిసి తన తల్లి దగ్గర ఎవరైతే బలహీనులో వారి పక్షాన యుద్ధము చేస్తానని ప్రతిన పూనుతాడు, పాండవులు బలహీనులని వారి పక్షాన యుద్ధము చేయుటకు బయలుదేరుతాడు, శ్రీకృష్ణ పరమాత్మకు బర్బరీకుని గురించి బాగా తెలుసు, బర్బరీకుడు యుద్ధానికి దిగితే కురు, పాండవులు ఇరువురు మిగలరు, బర్బరీకుని యుద్ధరంగమున రాకుండా నిలువరించాలి, శ్రీ కృష్ణుడు బ్రాహ్మణుని వేషములో బర్బరీకుని ప్రయాణ మార్గములో తారస పడి అతనిని నిలువరిస్తాడు, బర్బరీకుని మాటలతో రెచ్చగొట్టి అతని అస్త్రవిద్యను ప్రదర్శించ మని అడుగుతాడు అప్పుడు బర్బరీకుడు అక్కడే వున్న రవి చెట్టుపై ప్రయోగానికి సిద్ధము అవుతుండగా, శ్రీకృష్ణుడు చెట్టు ఆకు ఒకటి తన కాలికింద కనపడకుండా దాచి పెడతాడు, బర్బరీకుడు బాణ ప్రయోగము చేస్తాడు, చెట్టుపై ప్రతి ఒక్క ఆకుకు రంధ్రము పడుతుంది, శ్రీకృష్ణుడు తన కాలు వెనక్కి తీసుకొనగా తన కాలి కింద వున్న ఆకుకు కూడా రంధ్రము పడి ఉంటుంది, అతని అపార అస్త్ర శక్తిని ప్రశంసించి, బర్బరీక నీవు బల హీన పక్షాన నిలబడి పోరాడాలని బయలుదేరావు, నీవు ఏ పక్షాన నిలబడి యుద్ధము చేస్తే ఆపక్షము బలవంతము అయి మరొక పక్షము బలహీనమై, మరల నీవు ఆ బలహీనమయిన పక్షాన నిలబడి యుద్ధము చేస్తే ఇరుపక్షాలు కూడా చివరికి నశిస్తాయి అని జరగ బోయే ప్రమాదము గురించి వివరిస్తాడు, తన ప్రతిజ్ఞ నాశనానికి దారి తీస్తుందని గ్రహించిన బర్బరీకుడు తనకు ఈ విషయము ఎరుక పరచడానికి బ్రాహ్మణ వేషములో వచ్చినది శ్రీకృష్ణ పరమాత్మయని తెలుసుకొని శ్రీకృష్ణుని పాదాల మీదపడి మార్గోపదేశం చేయమని ప్రార్థిస్తాడు, చేసిన ప్రతిజ్ఞ నుండి బయట పడాలంటే సర్వ సమర్పణ ఒక్కటే మార్గమని శ్రీ కృష్ణుడు చెపుతాడు, సర్వ సమర్పణ అంటే తనను తాను అర్పించుకోవడం, తనను తాను అర్పించుకుంటే అక్కడ కర్తృత్వ , భోక్తృత్వాలు నుండి సాక్షిగా నిలబడటం జరుగుతుంది.
ఈ బర్బరీకుడే కురుక్షేత్ర యుద్ధానికి సాక్షిగా నిలిచినాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవుల మనోస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు పాండవులను బర్బరీకుడి దగ్గరకు తీసుకవెళతాడు బర్బరీకునితో తమ శౌర్య పరాక్రమాలు గురించి పాండవులు చెప్పుకోగా బర్బరీకుడు నవ్వుతాడు, అతని నవ్వుకు కారణము ఏంటని అర్జునుడు అడుగగా, బర్బరీకుడు ఇలా సమాధానము చెపుతాడు, మీరు మీ పరాక్రమముతో గెలిచామని సంబర పడుతున్నారు కానీ యుద్ధరంగములో ఒక్క శ్రీకృష్ణుడే ప్రతి ఆయుధము తానై, కౌరవులను, కౌరవసేనలను శ్రీకృష్ణుడు ఒక్కడే సంహరించాడని, యుద్ధరంగమున నాకు శ్రీకృష్ణ పరమాత్మా ఒక్కడే కనిపించాడని చెపుతాడు. కురుక్షేత్రములో బర్బరీకుడు తనను తాను శ్రీ కృష్ణ పరమాత్మకు సమర్పించు కున్నాడు.
బర్బరీకుడు - ( ఖాటు శ్యాము బాబా ) ఆత్మవిద్య
బర్బరీకుడు - ( ఖాటు శ్యాము బాబా ) ఆత్మవిద్య
........ ఇంకావుంది
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23
పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...
శాంతి నేలకోనుగాక !
-
పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...
-
I am That by Swami Rama Tirtha (1873-1906) I have no scruple of change, nor fear of death, Nor was I ever born, Nor had I pare...
-
Human suffering is one of religion's most compelling mysteries: Why do the innocent suffer? Why does God permit evil? Is God helpless ...
సర్వేజనః సుఖినో భవంతు
అహం బ్రహ్మసి
Peace
May all people be happy
May all people be happy
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
SRI PADAVALLABHA
SRI PADA RAJAM SHARANAM PRAPADYE
NEE JEEVITANIKI
SUVISHALAM IDAM VISWAM
SRI GURU RAGHAVENDRA
SRI RAMAKRISHNA PARAMA HAMSA
JAI GURU DATTA
SRI GURU DATTA
JAI GURU DATTA
Trident
Trident

