అకారణభయం
" ఒక దమ్మిడి లేని పిల్లవాడతాడు
పూగోట్టుకోన చెంత నేమియూ లేదు
కానీ అతనిప్రక్క దొంగాలున్నర
లనుచు విన్నంతనే భయమొందినాడు,
పరిగెత్తినాడు విహ్వలచిత్తుడగుచు :
తప్పించుకోన కొండలే ప్రాకినాడు :
పెద్ద గుంటలలోనే జారిపడినాడు :
దేహము గాయాలతో గాసిజేందే :
గజగజ వణికి భయక్రాంతు డయ్యె :
కాని ఇదంత వృధా బయం బౌర!
పోగొట్టుకొన వనికడ నేమి గలదు ?
ఓ ప్రపంచక మానవుడా ! యథార్థముగా
నీ దురవస్తయు నీయవివేక
భయ మీవిధంబుగా నున్నది సుమ్మి !
ఓ భయ బ్రాన్తుడా ! ఏల నీ భయము ?
" తెలుసుకో నిను నీవు " - భయమేల్ల దీరు
దొంగలున్నారని భయపడవద్దు.
లే లెమ్ము, నిద్ర లే , తెలిసికో నిన్ను !
నిన్నంట్టగల అపాయం భెమికలదు ?
నీ భావమే నిన్ను బయపెట్టుచుండే
తత్వమసి ! యల పరబ్రహ్మమే నీవు,"
స్వామి రామ తీర్థ వేదాంత భాష్యము నుండి