నిర్వాన శతకం (నిర్వాణ షట్కము)
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రజిహ్యే నచ ఘ్రాణనేత్రే
నచ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం! శివోహం!
మనస్సు, బుద్ది, అహంకార,చిత్తాలు నేను కాదు.శ్రవణ జిహ్వలు గాని చక్షు ఘ్రాణాలు గాని నేను కాదు. ఆకాశం, వాయువు, అగ్ని,జలం,పృథ్వి ఇవేవి నేను కాదు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
నచ ప్రాణసంజ్ఞో నవై పంచ వాయుః
న వా సప్త ధాతుర్నవా పంచకోశా
న వాక్పాణిపాదౌ నచోపస్థ పాయు
చిదానందరూపః శివోహం! శివోహం!
న వా సప్త ధాతుర్నవా పంచకోశా
న వాక్పాణిపాదౌ నచోపస్థ పాయు
చిదానందరూపః శివోహం! శివోహం!
ప్రాణశక్తిని నేను కాదు. పంచవాయువులు నేను కాదు.శరీరపు సప్తధాతువులు నేను కాదు. దాని పంచకోశాలు పాణిపాదాలు రసనం తదితర కర్మేంద్రియాలు-ఏవీ నేను కాదు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
నమే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మేనైవ మాత్సర్య బావః
న ధర్మో న ఛార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం! శివోహం!
మదోనైవ మేనైవ మాత్సర్య బావః
న ధర్మో న ఛార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం! శివోహం!
లోభమోహాలు నాకు లేవు. రాగద్వేషాలు నాకు లేవు. గర్వం అహంకారం ధర్మం విషయం వాంఛ, మోక్షం- ఏవీ నాకు లేవు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
న పుణ్యం న పాపం న సౌఖ్యం న ధుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఙ్నాః
అహం భోజనంనైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం! శివోహం!
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఙ్నాః
అహం భోజనంనైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం! శివోహం!
వేదయజ్ఙాలు సుఖధుఃఖాలు ధర్మాధర్మాలు మంత్ర తీర్థాలు నాకు తెలియవు.. నేను అనుభవించే వాడిని కాను. అనుభవించదగిన వస్తువును కాను. అనుభవింపబడే వాడిని కాను.. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితానైవ మేనైవ మాతా న జన్మః
న బంధుర్నమితృం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోహం! శివోహం!
పితానైవ మేనైవ మాతా న జన్మః
న బంధుర్నమితృం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోహం! శివోహం!
చావు భీతి నాకు లేవు. జాతి విచక్షణ లేదు. తల్లీతండ్రీ లేరు. జన్మయే లేదు. బంధుమిత్రులు నాకు లేరు. గురువు శిష్యుడు లేరు. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
అహం నిర్వికల్పో నిరాకరరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానందరూపః శివోహం! శివోహం!
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానందరూపః శివోహం! శివోహం!
నాకు రూపం లేదు, కల్పన లేదు. సర్వవ్యాపిని సర్వగతుణ్ణి. అయినా ఇంద్రియాలకతీతుణ్ణి. మోక్షాన్ని కాను. జ్ఙేయాన్ని కాను. నిత్యానంద చైతన్య స్వరూపుడను నేను... నేనే శివుణ్ణి..నేనే శివుణ్ణి..
మనో బుద్ధ్యహంకార చిత్తాలు నేను కాదు
శ్రవణ జిహ్వలుగాని చక్షు ఘ్రాణాలుగాని నేను కాదు
ఆకాశం వాయువు అగ్ని జలం పృధివి ఇవేవీ నేను కాదు
నేను శాశ్వతానందాన్ని చైత్యాన్ని శివుణ్ణి శివుణ్ణి
ప్రాణ శక్తిని నేను కాదు పంచవాయువులు నేను కాదు
శరీరపు సప్త ధాతువులు నేను కాదు దాని పంచకోశాలు
పాణిపాదాలు రసనం తదితర కర్మెంద్రియాలు ఏవీ నేను కాదు
నేను శివుణ్ణి శివుణ్ణి
శరీరపు సప్త ధాతువులు నేను కాదు దాని పంచకోశాలు
పాణిపాదాలు రసనం తదితర కర్మెంద్రియాలు ఏవీ నేను కాదు
నేను శివుణ్ణి శివుణ్ణి
లోభ మోహాలు నాకు లేవు రాగ ద్వేషాలు నాకు లేవు
గర్వం అహంకారం ధర్మం విషయం వాంఛ మోక్షం
ఏవీ నాకు లేవు శాశ్యతమైన చిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
గర్వం అహంకారం ధర్మం విషయం వాంఛ మోక్షం
ఏవీ నాకు లేవు శాశ్యతమైన చిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
వేదయజ్ఞాలు సుఖదుఃఖాలు ధర్మాధర్మాలు మంత్రతీర్దాలు
నాకు తెలియవు నేను భోక్తనుగాని భోజనాన్ని గాని భోజ్యాన్ని
గాని కాను నేను శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
నాకు తెలియవు నేను భోక్తనుగాని భోజనాన్ని గాని భోజ్యాన్ని
గాని కాను నేను శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
చావు భీతి నాకు లేదు జాతి విచక్షణ లేదు తల్లీతండ్రీ లేరు
జన్మయే లేదు బంధుమిత్రులు నాకు లేరు గురువు శిషుడు లేరు
శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి నేను
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
జన్మయే లేదు బంధుమిత్రులు నాకు లేరు గురువు శిషుడు లేరు
శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి నేను
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
నాకు రూపం లేదు కల్పన లేదు సర్వవ్యాపిని సర్వగతుణ్ణి
అయినా ఇంద్రియాలకతీతుణ్ణి మోక్షాన్ని కాదు
జ్ఞేయాన్ని కాను నేను శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
అయినా ఇంద్రియాలకతీతుణ్ణి మోక్షాన్ని కాదు
జ్ఞేయాన్ని కాను నేను శాశ్యతమైనచిదానంద స్వరూపుణ్ణి
నేను శివుణ్ణి నేను శివుణ్ణి
– జగద్గురు శ్రీ శంకర భగవద్పాద విరచితం నిర్వాణ షట్కము
(శ్రీ శంకర ఉవాచ అనే రామకృష్ణ మఠం ప్రచురణ నుంచి)
(శ్రీ శంకర ఉవాచ అనే రామకృష్ణ మఠం ప్రచురణ నుంచి)