ఆనందమయ జీవితానికి ఆరు ధ్యానాలు
స్వర్గానికున్న ఒేక ఒక్క మార్గం ప్రార్థన ఆనే ధ్యానం. ధ్యానమంటే భగవంతునికి శరణా గలు, అసలు సక్రమంగా ఆచరిస్తే శరీరభాగాలు లోతైన, విశాలమైన దైవ్యపదం! భగవం తుణ్ణి ేకవలం ఒక రూపంగా కళ్ళముందు, మనసులో పూజించనక్కరలేదు. ఆయన రక్షకుడిగా ఆరాధించవచ్చు. పూజించవచ్చు, భౌతిక సృష్టికి మూలం మన మనస్సులోనే ఉందని తెలుసుకోవాలి!
ప్రార్థన (ధ్యానం) యొక్క అసలు అర్థము తెలుసుకుందాం! భగవంతుని స్వస్వరూపంలో ఏకం కావడం. అనేక యోగుల ఆత్మలతో సంలీనం కావడం. ధ్యానంలో భగవంతునితో సంభాషించగలరు. అసలు ధ్యానశక్తి ఊహకి అందనిది చాలా చాలా సూక్ష్మంగా ఉన్నట్లుంటుంది. ‘‘అశాంతిలో ఉన్న మనస్సుని ప్రశాంతంగా మార్చే ఏకైక సాధ్యమే ధ్యానము. జీవితానికి రూపం. భగవంతునితో జరిపే ఆత్మసంభాషణ ధ్యానం. అది దైవానికి పెట్టుకునే విన్న పం కావచ్చు. భగవంతుని గురించి స్తుతి, ఆరాధన కావచ్చు. ఆయన ఈ జీవి తాన్ని మనకు అందించినందున కృతజ్ఞతలు తెల్పటం కావచ్చు. ఏ రూపంలో నైనా వుండవచ్చు.
అసలు అచ్చంగా హృదయాంతరాళాలలో అప్రయత్నంగా పెల్లుబికే భావము దైవానికి మనం తెల్సు. మన మనసులు తెల్సు... మన ఇబ్బందులు తెల్సు. మరి మన పరిస్థితులన్నీ చెప్పకుండానే అన్నీ తెల్సిన వ్యక్తిగా ఆయనతో ఎందుకు సంభాషించాలి?మన ధ్యానం కూడా మనల్ని దైవానికి దగ్గర చేస్తాయి. అని ప్రకృతికి, ఆయన సహ వ్యక్తిత్వానికి, వాస్తవ రూపంగా వుండాలి. సంపదకోసమే, ఏదో ప్రతీకారం తీర్చుకోవడం కోసమో చేసే ధ్యానంగా ఉండకూడదు.
ఎంతో ఎక్కువ తీవ్రతతో, నిజాయితో చేస్తే భగవంతుడు మన ప్రార్థన అల కించి, ప్రతిస్పందిస్తాడు. సమగ్ర ఆనందమయి జీవనానికి కొన్ని ధ్యానాలు చాలా అవసరం. ఈ ధ్యానాలు ఆరు రకాలు.
1. ఏకాత్మ ధ్యానం 2. గుద్యోముకి ధ్యానం
3. జ్ఞాన ధ్యానం 4. దాన ధ్యానం
5. ఆరోగ్యధ్యానం 6. వసుదైకకుటుంబ ధ్యానం
దైవానికి మానసికంగా దగ్గరైతే ఏం జరుగతుంది తెలుసా... ఇతరులకి సాయ పడే మానసిక స్థితికి ఎదిగేట్లు దోహదపడుతుంది. ఇతరుల దుఃఖాన్ని తగ్గిం చటమేకాక, మనల్ని మార్చి పరిపూర్ణుల్ని చేస్తుంది. అసలు ధ్యానంలో అతి ము ఖ్యం ఏంటంటే మాటలు లేని హృదయం. ఎప్పడూ దైవాన్ని ఏమి ప్రార్థించాలి తెల్సా, ఎలాంటి క్లిష్టపరిస్థితులలోనైనా నన్న మరింత ధృడంగా నిలబెట్టు అని!
అంతేకాని కేవలం సుఖంకోసమో... ఆనందం... సంపద కోసమో చేస్తే వృధా! ధ్యానంలో మరపురానిది మరొకటి ... మీ పనికి తగిన శక్తి కావాలని ప్రార్థన! అసలు మన ధ్యానంలో బలం వుంది అంటే అదే ఫలితాన్నిస్తుంది....!ధ్యానం అనేది రోటీన్‌గా, గుడ్డిగా చేయకూడదు. అది హృదయంలో జరగాలి. అది మనకి, దైవానికి మధ్య కమ్యూనికేషన్. అది ఒక ఆశ లాంటిది. ఆధార శక్తి, అది చర్యకాదు. ఒక దృక్పథం. ‘‘భగవంతుడిపై ఆధారపడే ఒక బలమైన దృక్పథం ధ్యానం’’
1) ఏకాత్మధ్యానం...
ఈశ్వరో గురరాత్మేతి మూర్తిత్రయస్వరూపిణే
ఆనందాత్మస్వరూపాయ దక్షిణామూర్తయే నమః
‘‘ఆమందానంద కందళిత హృదయారవింద గోవింద’’
ఆనందమానందవనే వసంతం, ఆనందసంపూర్ణ గోవింద’’
ఆనందదరూపేణ సదాచరంతం, రాధరవింఏ సతతం వసంతం
ఉన్నతమైన స్థానంలో ఉన్న మన మిత్రునితో ఏకాత్మభావనవల్ల వారియొక్క ఆధికారాలు అన్నీ మనకు ప్రాప్తిస్తాయి. కాని వారి బాధ్యతలు సంక్రమిం చవు. అదే విధంగా సర్వాంతర్యాతి అయిన భగవంతునితో ఏకాత్మభావన వల్ల అతని పుణ్యసంపద మనకి ప్రాప్తిస్తుంది. పరమేశ్వరునితో ఏకాత్మభావన వల్ల వచ్చే పుణ్య ప్రభావంతో పాపం నశిస్తుంది. ఈ విధమైన ఏకాత్మభావన వల్ల సమస్త నదీజలాల్లో స్నానం చేసిన ఫలితం, అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన ఫలితం వస్తుంది.
పైన చెప్పిన శ్లోకాన్ని పఠించడం వల్ల భగవంతునితో ఏకాత్మభావన వల్ల మంచి జరుగుతుంది. గురువుతో ఏకాత్మభావన వల్ల జ్ఞానం సంప్రాప్తిస్తుంది.
2) సద్యోముక్తి ధ్యానం...
పాలినీ సర్వభూతానాం తథాకామంగహారిణి
సద్యోముక్తి ప్రదాదేవి వేదసారాపరాత్పరా
ప్రతి మనిషి మోక్షసాధనం లక్ష్యంగా పెట్టుకుని జీవించాలి. జీవన్ముక్తి జీవితానంతరముక్తి కష్టం సద్యోముక్తి అనే భావన అవసరమైంది. సర్వ భూతాలను పాలించే తల్లి, కామాంగాలను హరించే తల్లి సద్యోముక్తి ప్రద, ఈ భావన వేదం యొక్క సారం.
3) దాన ధ్యానం...
మిళిత వివిధముక్తాం దివ్యమాణిక్య యుక్తాం
జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి
వివిధ రకాలైన మణిమాణిక్యాదులను పరిపూర్ణమైన కనకవృష్టిని విశ్వరూపిణి, సకల చరాచర జగత్తుని తనలో నిలపుకున్న లలితాదేవి సమ ర్పించినట్టు ధ్యానం చేయాలి.
శత్రువుల పేర్లు, మిత్రుల పేర్లు రాసుకుని ఒక్కొక్కరికీ 10 కోట్లు, 20 కోట్లు దానం చేస్తున్నట్లు భావన చేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల సంపద పెరుగుతుంది. జనాల నుంచి వచ్చే వ్యతిరేకత, ఆసూయా భావం తొలు గుతుంది.
4) జ్ఞాన ధ్యానం
విశ్వజ్ఞాన వాగ్దేవి విశ్వ విజ్ఞాన దాయిని
విశ్వమోక్ష ప్రదాత్రీత్వం జ్ఞానానందం దదాతునః
మానసికంగా (ఆధ్యాత్మికచింనతో) మనం ఏదైనా దానం చేసినట్టు
భావన చేస్తే దానిని మనం పొందగలుగుతాం. అదే విధంగా విశ్వమంతటికీ జ్ఞానదానం చేస్తున్నాము అనే భావన వల్ల మనం శాశ్వతమైన, నిజమైన జ్ఞానా న్ని పొందటానికి పై శ్లోకాన్ని జపిస్తూ విశ్వానికి జ్ఞానదానం చేస్తున్న భావన చేయాలి.
5) ఆరోగ్య ధ్యానం...
హాస్పిటల్‌లోని రోగులకు ఐదారువేలమందికి ‘‘క్రీంఅచ్యుతానంత గోవింద’’ అనే మంత్రాన్ని జపించి స్పర్శవైద్యం చేసి రోగాన్ని నివారించి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి వారి చేతితో పళ్లను ఉంచి ఆనందంగా వారిని ఇంటికి సాగనంపుతున్నట్లు ధ్యానం చేయాలి.
6) వసుధైక కుటుంబధ్యానం...
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తాః సుఖినో భవస్తు
కాలేవర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః
అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః
అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతమ్
మనం అందరి మంచి కోరితే మనకి కూడా మంచి జరుగుతుంది. లోకమంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉండడం వల్ల ఎల్లప్పటికీ మనకు మంచే జరుగుతుంది. ఈ విధంగా ఆరు ధ్యానాలు ఎప్పటికీ చేస్తూ ఉండడం వల్ల ఆనందమయి జీవనాన్ని పొందవచ్చు. -- ఆచార్య సి వి బి సుబ్రహ్మణ్యం