మనస్సులో ఎటువంటి భావ తరంగాలు లేకుండా వుండడం అనేది ఒక మానసిక తపస్సు అదే మౌనం, చాలామంది మౌన వ్రతం అంటే కేవలం ఏ విషయాలు మాట్లాడకుండా వుండడం అని అనుకుంటూ తన మనస్సులో పరి పరి విదాలుగా ఆలోచిస్తూ వుండడం, చేతులతో ఇతరులకు తన భావాలను ప్రకటిస్తూ వుండడం లాంటివి చేస్తూ నేను మౌనవ్రతం ఉంటున్నాను అని అనుకుంటారు, అసలు మౌన వ్రతం చేయాలి అంటే కొన్ని రకాల పద్దతులను నియమాలను జాగ్రత్తలను తీసుకోవాలి.
మీ మనస్సు ఎలాగా వుండాలంటే ఎ విషయమును పట్టించుకోకూడదు, మీ ముందు ఒక పుష్పం వున్నది అనుకోండి మీ కళ్ళు ఆ పుష్పాన్ని చూసిన మీ మనస్సులో ఆ పుష్పం పట్ల ఎటువంటి అభిప్రాయం, ఆలోచన కలగా కూడదు. అంతరంగికంగా మనసులో ఎటువంటి భావాలూ కలగకుండా ఉండడమే అసలయిన మౌన దీక్ష.
నిజమైన మౌన యోగి శ్రీ రమణ మహర్షి. అయన మహా మౌని. అతని కళ్ళు చూస్తున్నట్లు ఉన్నప్పటికీ అతను అంతర్గత మైన చేయితన్యము తో పరమాత్మ యందు లయము అయి వుంటుంది.
మౌనం మూడు విధాలుగా చెప్తారు.
మౌనం మూడు విధాలుగా చెప్తారు.
- వాజ్మౌనం: వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలుకుట, అబద్ధము లాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి.
- అక్షమౌనం: అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును.
- కాష్ఠమౌనం: దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడినది.
మాట్లాడటం ఒక అందమైన కళ. మౌనం అంతకన్న అద్భుతమైన కళ.
- మహాత్మాగాంధీ
మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
- స్వామి వివేకానంద
- మహాత్మాగాంధీ
మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
- స్వామి వివేకానంద