అపరిగ్రహము - అస్తేయం
'అపరిగ్రహం'అంటే ఇతరుల వస్తువులు గ్రహించ కుండా వుండటము నాయొక్క భావనలో అది కేవలము వస్తువులతోనే కాదు ఇతరుల నుండి విషయ గ్రహణము కూడా చేయకూడదు, అంటే ఇతరుల భావనలు, అవి అరిషట్ వర్గాలతో కూడుకొని ఉంటాయి కనుక వాటిని కూడా సాధకుడు గ్రహించకూడదు. వారి యొక్క భావాలు మనపట్ల మంచి భావన, మంచి అభిప్రాయము కావచ్చు లేదా ఈర్ష్య ద్వేషాదులతో కూడుకున్నవి కావచ్చు అయితే అవి కేవలము వారు మన పట్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాలు కావచ్చు, మనలను ఆవిధముగా అర్థము చేసుకోవడము కావచ్చు, వాటిని సాధకుడు తన మనసులో చేరనిస్తే, వాటినుంచి సాధకుడి మనసులో భావ పరంపర పెరిగి పోయి తన యందు కూడా రాగఃద్వేషాదుల అల్లికలు కలుపు మొక్కల లాగా పెరిగి పోయి సార వంతమయిన జ్ఞాన ప్రకాశన్నీ ప్రకాశ హీనము చేస్తాయి. రైతు తన యొక్క పొలములో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు పీకి పారేసి మరల వాటిని పెరగనీయకుండా జాగ్రత్త పడితే అతనికి లభించే పంట అద్భుత ఫలాలను ఇస్తుంది. పండిన పంటను కూడా చీడ పురుగులు పట్టకుండా రైతు ఎప్పుడు అప్రమత్తుడై ఉంటాడో సాధకుడు కూడా ఈ విధమైన సాధనను కొనసాగించాలి. అందుకు సాధకుడికి చెప్పబడిన యమ నియమాదులు పాటించడము వలన శుద్ధ అంతఃకరణం ఏర్పడి దివ్య ఫలాలను పొందగలడు.
కేవలము వస్తువులే కాక ఎప్పుడయితే సాధకుడు ఇతరుల భావజాలమును స్వీకరిస్తాడో అంటే ఆయా విషయాదులందు మనస్సున స్వీకరించినట్లే, వాటితో మనస్సున అనేక భావజాలోత్పతికి కారకుడు అవుతున్నాడు, తన పట్ల విమర్శ కావచ్చు, పొగడ్త కావచ్చు ఆరెండు కూడా ఎవరు అయితే వ్యక్తము చేస్తారో అవి కేవలము వారివే వారి యొక్క మనో భావజాలములే ఆయా మనోభావాలు వారివి మాత్రమే, అవి తన పట్ల అయినప్పటికీ కేవలము అవి వారి యొక్క మనోభావాలుగా పరిగణించి ఆ ఉద్దేశ్యాలను వారికె వదిలి వేయాలి కానీ వారి భావాల పట్ల సాధకుడు తన యందు భావోత్పతి చేసుకోకూడదు, అందువల్ల సాధకుడి మనసు యందు అనేక విషయ పరంపరలకు అవకాశము ఇట్చినట్లే, ఆలా చేసుకొంటే తనవి కానీ భావ జలాన్ని తాను స్వీకరించి నట్లే. తనది కాని విషయము అవుతుంది. తనది కాని వస్తువును తనది గా ప్రతి పాదించడమే అవుతుంది. ఇది అపరిగ్రహము-అస్తేయము అని అనిపించుకుంటుంది. ప్రాపంచికుల మనోభావాలు తన పట్ల కానీ వేరే ఇతర ప్రాపంచిక వ్యవహారములు యందు ఎలా ఉన్నప్పటికీ వాటితో సంగత్వము, భాగస్వామ్యము చేసుకోకుండా తనవి గా చేసుకోకుండా, తనవి గా క్లెయిమ్ చేయకుండా ప్రమాద కార విషయములుగా, అక్కరకు రాని విషయములు గా పరిగణించి వాటిని వదిలి వేయడమే సాధకుడికి పరమ శ్రేయస్కరము. ఇతరుల మనో భావ వికారాలు, కక్కు ( వాంతికి ) వంటివిగా, అసహ్యమయినవిగా భావించి వాటికీ అంటే ఆయా భావాలకు దూరముగా వుండటము సాధకుడి యొక్క ప్రధాన ఆవశ్యకమైన గుణముగా ఉండాలి. ఐతే ఇక్కడ గమనించ వలసినది ఏమంటే అవతలి వారు మన పట్ల విద్వేష పూరితమైన భావాలతో మన యొక్క మనుగడకు గాని దన, మాన, ప్రాణాలకు నష్టము కలిగించే విధముగా ఉంటే మాత్రము ఏమాత్రము సాధకుడు ఆయా విషయముల యందు అశ్రద్ధ చేయకూడదు. ఈ విషయాన్ని మహాభారతము తెలియచేస్తున్నది.
పాండవులు కౌరవుల పట్ల ఎంతో స్నేహశీలతను, బందు ప్రీతితో వ్యవహరిస్తున్నప్పటికీ కౌరవులు మాత్రము పాండవుల యొక్క ప్రతి చర్యను, దురభిప్రాయముతో, ద్వేష పూరితమయిన భావనలతో పాండవుల ప్రతి చర్యను వారి పట్ల జరిగిన అవమానంగా చూస్తు పాండవుల యొక్క దన మాన ప్రాణాలను హరించాలనే భావనలతో వారిని అనేక విధాలుగా వెంటాడారు, మానసికముగా హింసిస్తూ వారి, నైతికంగా కృంగేలా సందర్భము వచ్చిన ప్రతి సారి అడుగు అడుగున వారిని వేధించడమే కాకుండా, ఉద్దేశ్య పూర్వకంగా వారిని అనేక సందర్భాలను కల్పిస్తూ వారిని వివశులను చేసి వారి ని అనేక విధాలుగా పతనము చేయాలనీ దుష్ట పన్నాగాలు ఎన్నో పన్నినారు.
వారి విద్వేష పూరితమయిన చర్యలు పదునాలుగు సంవత్సరాల అరణ్య వాసములో కూడా కొనసాగినాయి. కాబట్టి సాధకులు తాము ఎంత తమ వరకు తాము ఉన్నప్పటికీ తమను ఎవరి దౌర్భల్యాలు వెంటాడుతున్నాయి తెలియదు కాబట్టి నిరంతర అప్రమత్త కూడా అవసరమే. సాధకుడికి ఎవరి పట్ల శత్రు భావము లేనప్పటికీ తన పట్ల ఇతరుల మనస్సులు ఏవిధమయిన దుర్బలత్వముతో తో కూడుకున్నవో తెలియదు అతి సహనము, అతిగా ఓర్పు కూడా ప్రమాద కారి కావచ్చు, కనుకనే శ్రీకృష్ణ పరమాత్మా దుర్మార్గాన్ని అతిగా సహించడము కూడా వాటిని ప్రోత్సహించడమే, వారిలో నీవు ఏమిచేసినా వారి మనస్సులు రాగద్వేషాదులనుండి విడివడవు, వారిని ఉపేక్షించడము వలన వారిని చూసి వారి లాంటి దుర్మార్గులు ఎందరో తయారు అవుతారు కాబట్టి వారిని అరికట్టడము అనివార్యము అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునిడికి హితవు చెప్పాడు. కాబట్టి సాధకుడు ఇతరుల విద్వేషం నుంచి కూడా అప్రమత్తుడు అయి చీడ పురుగులనుంచి పంటను కాపాడు కుంటున్నట్లుగా సాధకుడు తనను తాను కాపాడుకోవాలి.
{ సాధకుడు తన నుండి ఇతరుల నుండి వెలువడే విద్వేష పూరిత భావజాలము నుండి తన యొక్క మనస్సును, తన యొక్క చిత్తమును సదా కాపాడుకొంటూ నిత్యము జాగరూకతో ఉండాలి }
.........ఇంకావుంది.