హిడింబా దేవి
Hadimba Devi
Hadimba Devi
Hadimba Devi Temple In Winter.
బీముని భార్య , గాతోత్కాచ డి తల్లి అయిన హిడింబా దేవి కి ఒక ఆలయం ను నిర్మించారు ఆ అత్యంత ప్రసిద్ధ హిడింబా దేవి ఆలయం ను దున్గ్రి ఆలయం అని కూడా పిలుస్తారు ,, మనాలి, ఉత్తర భారతదేశం లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఒక హిల్ స్టేషన్ ఉంది. మనాలి సాహాస క్రీడలైన స్కీయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్(బల్లకట్టు పోటీలు), ట్రెక్కింగ్ (నడక), కయకింగ్ (పడవ), మరియు మౌంటైన్ బైకింగ్(పర్వత మోటార్ సైకిళ్ళ పోటీ) వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ, ఇది భారత మహాభారత పురాణల లో ఒక పాత్ర అయిన హిడింబా దేవి, ఇది ఒక పురాతన గుహ ఆలయం. ఈ ఆలయం చుట్టూ ఒక సెడార్ అడవి ( అభయారణ్యం) చుట్టు హిమాలయాలలో ఉంది. అభయారణ్యం యొక్క దేవత గా పూజలు అందుకొంటుంది ఈ ఆలయం భారీ రాక్ పైన నిర్మించబడింది. ఈ ఆలయము 1553 AD లో నిర్మించారు. Hadimba Devi Road
హిడింబాసుర వధ- హిడింబ భీమసేనుల వివాహం- ఘటోత్కచుని జననం
బిలమార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు క్రింద విశ్రమింప చేసి భీముడు వారికి కాపలా ఉన్నాడు. అలసి ఉండటం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు. భీముడు జరిగినది తలచుకుంటూ కూర్చున్నాడు. వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు. తన చెల్లెలు అయిన హిడింబను పిలిచి "హిడింబా ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు నానోరు చవిచెడి ఉన్నది వారిని చంపి నాకు వండి పెట్టు" అన్నాడు. అలాగే నని పాండవుల దగ్గరకు వెళ్ళిన హిడింబ అక్కడ కాపలాగా ఉన్న భీముని చూసింది. అతని మీద మనసు పడింది. అన్న మాట మరచి పోయింది. మానవ కాంతగా మారి పోయింది. తనను చూసి ఎవరని అడిగిన భీమసేనునితో " మహాభాగా నేను హిడింబుని చెల్లెలైన హిడింబను. నీ పై మనసు పడ్డాను. నా అన్న మహా బలవంతుడు. ఇది అతని వనము అతి భయంకరుడైన అతనిని చూసి భయపడని వారు లేరు నీవు ఏమాత్రం. నీవు నన్ను వివాహమాడినచో అతడు నిన్ను విడువగలడు. లేకున్న అతడు మిమ్మలిని బ్రతుకనీయడు. నా వెంట వస్తే కోరిన చోటికి తీసుకు పోతాను" అన్నది. వీరు నా తల్లీ అన్నతమ్ములు వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు. అయితే అందరం వెళదామని హిడింబ చెప్పింది. ఒక రాక్షసుడికి భయపడి నా తల్లీ సోదరుల నిద్ర చెడగొట్టనా" అన్నాడు. చెల్లెలు ఎంతకీ రాలేదని హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు భీకరంగా ఘర్జించి "నిన్ను సంహరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను" అని హిడింబునిపై లంఘించాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి ఘర్జనలకు మిగిలిన వారు నిద్ర లేచి హిడింబను అడిగి విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళి "భీమసేనా తూర్పు ఎర్రబారుతుంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతడిని చంపు" అని అరిచాడు. ఆ మాట విని భీముడు విజృంబించి హిడింబుని గిరాగిరా త్రిప్పి నేలకు కొట్టాడు. హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు. భీముని బలం హిడింబను ఆశ్చర్యపరచింది. భీముడు హిడింబను చూసి "నీవు రాక్షస కాంతవు మేము నిన్ను నమ్మము వెను తిరిగి వెళ్ళుము" అన్నాడు. హిడింబ కుంతీదేవి వద్దకు వెళ్ళి "అమ్మా నేను భీమునిపై మనసు పడ్డాను. అతను నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను. నన్ను మీ కోడలుగా స్వీకరిస్తే మీకు సహాయంగా ఉంటాను. నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు. మీరు శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడి కొలనులోని నీరు త్రాగారంటే మీకు ఆకలి దప్పులు ఉండవు. అక్కడకు కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు. కోరికలు అందరికీ ఒకటే కనుక మీమ్మల్ని అర్ధిస్తున్నాను" అన్నది. కుంతీదేవి హిడింబ మాటలు విన్నది. ఆమెపై విశ్వాసం కలిగి భీముని చూసి "భీమసేనా ఈమె ఉత్తమురాలు ఈమెను వివాహమాడితే మనకు మంచి జరుగుతుంది. నా మాట మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెను వివాహమాడు" అని చెప్పింది. తల్లి మాటను మన్నించి హిడింబను వివాహమాడి ఆమెతో చేరి శాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. కుంతీదేవితో "అమ్మా కష్టాలు కలకాలం ఉండవు. మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరవాత బ్రాహ్మణ రూపాలలో ఏకచక్ర పురం వెళ్ళండి. ఆ తరవాత నేను వచ్చి మీరి చెయ్యవలసిన కర్తవ్యం చెప్తాను" అన్నాడు. వ్యాసుని మాట ప్రకారం పాండవులు కొంతకాలం శాలిహోతుని శ్రమంలో గడిపారు. హిడింబ గర్భం ధరించి ఘటోత్కచుడిని కన్నది. అతను కామరూపుడు అమిత బలవంతుడు. ఘటోత్కచుడు కుంతీదేవిని తండ్రులను చూసి "అమ్మా నేను ఇక్కడ నాతల్లితో ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు రాగలను" అని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో తిరిగి వెళ్ళాడు.





























పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...
-
"కనులు చూచును గాని గ్రహీయింపలేవు. కర్నముల్ విను చున్న వేగాని తాము వినజాలకున్నవి యిదమిత్థరవము ! మా కిష్ట మున్నను లేక పోయినను మా శర...
-
Manava Seva Manava Seva is Madhava Seva – The Service of Humanity is the Service to the Lord. Gurudev Swami Sivananda j...
-
HAPPY VIJAYA DASHAMI 2012 YA DEVI SARVA BHUTESU MAATRU RUPENA SANSTHITHA NAMASTASAI NAMASTASAI NAMASTASAI NAMO NAMAH YA DEVI S...